జహీరాబాద్, న్యూస్‌లైన్: ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె.గీతారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి జహీరాబాద్‌లోని ఫ్రెండ్స్ గార్డెన్ ఫంక్షన్‌హాల్‌లో మంత్రి గీతారెడ్డి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిందూ ముస్లింల మధ్య సోదర భావం పెంపొందించేందుకు ఇఫ్తార్ విందులు ఎంతగానో దోహద పడతాయన్నారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందన్నారు. అల్లా దయవల్ల ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. జహీరాబాద్ ప్రాంతం మత సామరస్యతకు ప్రతీకగా నిలిచిందన్నారు. అనంతరం మంత్రి గీతారెడ్డి ముస్లింలతో కలిసి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ జైపాల్‌రెడ్డి, మంత్రి గీతారెడ్డి భర్త రాంచంద్రారెడ్డి, కుమార్తె మేఘనారెడ్డి, కాంగ్రెస్ నాయకులు మంకాల్ సుభాష్, షీలా రమేష్, తాహెరాబేగం, ఖాజా పాల్గొన్నారు.
సోదర భావంతో మెలగాలి
నర్సాపూర్, న్యూస్‌లైన్: హిందూ ముస్లింలు సోదర భావంతోకలిసి, మెలిసి ఉండాలని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖా మత్రి వి.సునీతారెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మణికొండ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొని ప్రార్థనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇఫ్తార్ విందులో పాల్గొనడం తాను అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇఫ్తార్ విందులో నర్సాపూర్ ముస్లిం మతపెద్ద ఖాజాసమియొద్దీన్, కాంగ్రెస్ నాయకులు స్థానిక సర్పంచ్ రమణారావు, ఆత్మ చైర్మన్ ఆంజనేయులుగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, స్థానిక ఉపసర్పంచ్ నయీం, ఇతర కాంగ్రెస్ నాయకులు సత్యంగౌడ్, గులాం మహమ్మద్, కృష్ణారావు, శ్రీనివాస్‌గుప్తా, నవీన్‌రావు, జ్ఞానేశ్వర్,చిన్నఅంజనేయులుగౌడ్, రషీ ద్, మహమ్మద్, పాల్గొన్నారు.
మత సామరస్యాన్ని చాటే ఇఫ్తార్ విందులు
Published Wed, Aug 7 2013 12:29 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
Advertisement
Advertisement