కల్లూరు, న్యూస్‌లైన్: స్థానిక బళ్లారి చౌరస్తా సమీపంలోని కృష్ణారెడ్డినగర్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన నీలి కిరోసిన్‌ను జిల్లా పౌరసరఫరాల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సెల్‌ఫోన్‌కు మెసేజ్ రూపంలో వచ్చిన పక్కా సమాచారం మేరకు డీఎస్వో వెంకటేశ్వర్లు నిఘా పెట్టి పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్వో విలేకరులకు వెల్లడించారు. కృష్ణారెడ్డినగర్‌లోని ఖాళీ స్థలంలో 12 డ్రమ్ములు కనిపించగా స్వాధీనం చేసుకున్నామన్నారు.
అందులో నాలుగు డ్రమ్ముల్లో 800 లీటర్ల కిరోసిన్ ఉందన్నారు. మిగతా డ్రమ్ములు ఖాళీగా ఉన్నాయన్నారు. స్వాధీనం చేసుకున్న కిరోసిన్‌ను సమీపంలోని 130 షాపు నెంబరు డీలరు మధుసూదన్‌కు అప్పగించామన్నారు. కిరోసిన్‌ను ఎవరూ అక్కడ ఉంచారనే విషయంపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. దాడి వివరాలపై జేసీకి నివేదిక సమర్పిస్తామన్నారు. దాడులు చేసిన వారిలో ఏఎస్‌ఓ జగన్‌మోహన్‌రావు, ఎఫ్‌ఐ రామాంజనేయరెడ్డి, సిబ్బంది వెంకటరాజు, సుల్తాన్ ఉన్నారు.