విజయనగరం అర్బన్: ఉపాధ్యాయుల అక్రమ బదిలీలకు ప్రభుత్వం గేట్లు బార్లా తెరిచింది. రాజకీయ పలుకుబడి, అర్థ బలంతో జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు ఇష్టారాజ్యంగా జరిగాయి. కౌన్సెలింగ్ విధానానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వమే నేరుగా బదిలీ చేసే ప్రక్రియను అధికారపార్టీ నేతల ప్రమేయంతో చేపట్టింది. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టి టీచర్లు అనుకున్న ప్రాంతాలకు బదిలీ చేయంచుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 11 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి సంబంధిత ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులు వచ్చాయి. ఉపాధ్యాయుల అక్రమ బదిలీ లను రద్దు చేయాలని, కౌన్సెలింగ్ విధానాన్ని పాటిం చాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు నిరసన వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. జిల్లా నుంచి సుమారు 60 మంది ఉపాధ్యాయుల బదిలీలకు ప్రయత్నాలు చేసుకోగా కేవలం 11మంది ని మాత్రమే బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
విద్యాశాఖలో గందరగోళం
ఉపాధ్యాయుల బదిలీల్లో భారీ మొత్తం చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు దళారులు బదిలీ కోసం ఉపాధ్యాయుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి అధికారపార్టీ నేత ల ద్వారా సంబంధిత అధికారులకు ముట్టచెప్పారనే విమర్శలున్నాయి. డీఈఓ కార్యాలయానికి సంబంధం లేకుండానే నేరుగా విద్యాశాఖ డెరైక్టరేట్ నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కార్యాలయంతో సంబం దం లేకుండా, ఖాళీలను చూసుకోకుండా నేరుగా ప్రభుత్వం బదిలీలు చేయడం వల్ల గందరగోళ పరి స్థితి నెలకొంది. గత ప్రభుత్వం ఫిబ్రవరిలో ఇలాగే నేరుగా 20 మందిని బదిలీ చేసింది. తొమ్మిది నెలల గడవక ముందే మళ్లీ ప్రభుత్వం బదిలీలకు అవకాశం ఇవ్వడం అన్యాయమని ఉపాధ్యాయులు అభిప్రాయ పడుతున్నారు. దీని వల్ల అనారోగ్యంతో బాధపడి రిటైర్‌మెంట్ దగ్గరకొచ్చిన వారికి దక్కాల్సిన స్థానాలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో మొత్తం 11 మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. వారిలో అత్యధికం ఎస్‌జీటీ ఆరు గురున్నారు. మిగిలిన వారిలో ముగ్గురు స్కూల్ అసిస్టెం ట్ టీచర్లుండగా ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం, ఫిజికల్ డెరైక్టర్లు ఒక్కొక్కరున్నారు.బదిలీఅయిన వారిలో స్కూల్ అసిస్టెంట్‌లు డి.వెంకటరావు (ఏటీఅగ్రహారం యూపీస్కూల్ నుంచి జిల్లా కేంద్రంలోని కోట లోని వైజ్ఞానప్రదర్శనాలయం), డి.గౌరినాయుడు (సాలూరు ప్రభుత్వ పాఠశాల నుంచి పార్వతీపురం ప్రభుత్వ పాఠశాల), ఎన్.ఉషారాణి (వావిలపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల నుంచి మలిచర్ల), ఎల్‌ఎఫ్‌హెచ్‌ఎం ఎం.సాంబమూర్తి (చీపురుపల్లి నుంచి బలి జిపేట), ఫిజికల్ డెరైక్టర్ జి.శ్రీనివాసరావు (వేపాడ జెడ్పీహెచ్‌ఎస్ నుంచి జామి జెడ్పీ హెచ్‌ఎస్) ఉన్నా రు. అదే విధంగా ఎస్‌జీటీలలో జి.సుజాత (చెల్లూరు నుంచి ముడిదాం), ఐ.వి.శంకరరావు (రామన్నదొరవలస నుంచి కృష్ణపల్లి), ఎన్.అప్పలనాయుడు (కొండకెంగువ నుంచి గాజులరేగ), కె.ఎస్.ఎల్.ఎస్.శైలజ (కొట్టాం నుంచి దర్మపురి), జి.చంద్రమతి (గాజులరేగ నుంచి యాతపేట)ని బదిలీ చేశారు.
దొడ్డిదారిన టీచర్ల బదిలీలు !
Published Wed, Nov 26 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM
Advertisement
Advertisement