సీతంపేట, న్యూస్‌లైన్: మహానేత వైఎస్ మరణానంతరం 108 సేవలు అంతంతమాత్రంగా ఉండటంతో ఎందరి ప్రాణాలో గాలిలో కలిసిపోతున్నాయి. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీలో శనివారం రాత్రి జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సీతంపేట మండలం మర్రిపాడు కు చెందిన గొర్లె ఉషారాణి రాత్రి ఇంటి వద్దే ఆడబిడ్డను ప్రసవించింది. అయితే.. శిశువు పుట్టిన వెంటనే ఏడవకపోవడం, చలనం లేకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు 108కి ఫోన్ చేశారు.
ఈలోగా తల్లి స్పృహ కోల్పోయింది. కొద్దిసేపటికి 108 వాహనం వచ్చినప్పటికీ అందులో ఆక్సిజన్, సెలైన్ ఏమీ లేకపోవడంతో బాధితురాలికి ప్రథమ చికిత్స కూడా అందలేదు. కుటుంబ సభ్యులు వెంటనే మరోసారి 108లో సీతంపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సెలైన్ ఎక్కిస్తుండగా ఆమె కన్నుమూసింది. బిడ్డ మాత్రం క్షేమంగా ఉంది. 108 వాహనంలో ఆక్సిజన్, సెలైన్ ఉండి ఉంటే తన భార్య ప్రాణాలు దక్కేవని మృతురాలి భర్త శివ రోదించారు.
108లో ఆక్సిజన్ లేక బాలింత మృతి
Published Mon, Apr 28 2014 12:59 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement