saline
-
ఎక్స్పైరీ సెలైన్ ఎక్కించేశారు!
ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు కాలం చెల్లిన మందులతో చికిత్స చేస్తున్నారు. శుక్రవారం ఓ రోగికి కాలం చెల్లిన సెలైన్ పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ఎస్.కె.అజారుద్దీన్ జ్వరంతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. అతడిని అడ్మిట్ చేసుకుని వైద్యుల సూచన మేరకు అతడికి సెలైన్ పెట్టారు. అక్కడే ఉన్న అజారుద్దీన్ సోదరుడు ఆసిఫ్..సెలైన్ సరిగ్గా ఎక్కడం లేదని దానిని పరిశీలించగా ఎక్స్పైరీ డేట్ చూసి షాక్ అయ్యాడు.ఈ ఏడాది మార్చితోనే సెలైన్ కాలపరిమితి ముగిసినట్లు గుర్తించిన వెంటనే అక్కడి వైద్యులు, సిబ్బందిని నిలదీశాడు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న మీడియా ఆస్పత్రి ఆవరణలోని ఓ మెడిసిన్ ట్రాలీలోని మందులను పరిశీలించగా, మూడు వాయిల్స్ కాలం చెల్లినవి కనిపించాయి. అక్కడి నుంచి ఇంజెక్షన్ ఓపీకి వెళ్లి చూడగా అందులో సైతం ఓ వాయిల్ 3 నెలల ముందే గడువు ముగిసినట్లు కనిపించింది.దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ వంశీ మాధవ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా, విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకుంటామన్నారు. కాగా, ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం రాత్రి డీసీహెచ్ సురేశ్, డీఎంహెచ్‌వో రాజేందర్ సందర్శించారు. కాలంచెల్లిన మందులు వాడటంపై కలెక్టర్ ఆదేశాలతో ఆస్పత్రిని తని ఖీ చేసినట్లు తెలిపారు. అజారుద్దీన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
సెలైన్‌లో విషం ఎక్కించుకుని వైద్యుడి ఆత్మహత్య
అమీర్‌పేట (హైదరాబాద్): కుంగుబాటుతో సెలైన్‌లో విషం ఎక్కించుకుని ఓ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. కడప జిల్లా బద్వేలుకు చెందిన రాజ్‌కుమార్ (29) బీకేగూడ మున్సిపల్ పార్కు సమీపంలో ఉంటూ అమీర్‌పేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. శుక్రవారం గదిలోనే ఉన్న రాజ్‌కుమార్ తన స్నేహితుడితో మనసు బాగోలేదని చెప్పి ఫోన్ చేశారు. కొద్దిసేపటి తర్వాత స్నేహితుడు తిరిగి ఫోన్ చేయగా ఫోన్ ఎత్తలేదు. అదే ఆస్పత్రిలో పనిచేసే మరో వైద్యుడు శ్రీకాంత్‌కు సమాచారం ఇవ్వడంతో ఇంటికి వచ్చి చూడగా సెలైన్ పెట్టుకుని బెడ్‌పై కనిపించారు. సెలైన్ తీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రి సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గదికి చేరుకుని పరిశీలించారు. -
Covid-19: పుక్కిలించిన సెలైన్‌తో కరోనా టెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థ అయిన నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్ఈఈఆర్ఐ)నీరి సంస్థ కరోనా టెస్టింగ్‌కు కొత్త విధానాన్ని కనిపెట్టింది. సెలైన్ ట్యూబ్‌తో 3 గంటల్లో కరోనా టెస్టింగ్ ఫలితాన్ని తెలియజేసే విధానాన్ని ఆవిష్కరించింది. ఈ విధానంలో నోట్లో పుక్కిలించిన సెలైన్‌తో ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తారు. అత్యాధునిక ల్యాబ్ అవసరం లేకుండా.. అతి తక్కువ ఖర్చుతో టెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఆవిష్కరణ వల్ల గ్రామీణ, గిరిజన ప్రాంతాల వారికి మరింత సౌలభ్యం చేకూరనుంది. దీని వల్ల సొంతంగా ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు. నీరి ఆవిష్కరించిన ఈ నూతన టెస్టింగ్ పద్దతికి ఐసీఎంఆర్ సంస్థ కూడా ఆమోదం తెలిపింది. తర్వలోనే ఇది మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. చదవండి: Covid-19 Self-Testing: ఇంట్లోనే కరోనా టెస్టు -
నిలబడితేనే..సెలైన్
తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో కనీస వసతులు లేక రోగులు, బాధిత కుటుంబసభ్యులు అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రిలో గ్లూకోజ్ బాటిళ్లు పెట్టేందుకు స్టాండ్లు లేకపోవడంతో రోగులకు సాయంగా వచ్చిన వారు..నిలబడి సెలైన్ బాటిళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెం ట్ మల్లికార్జునస్వామిని వివరణ కోరగా..ఆస్పత్రిలో స్టాండ్ల కొరత ఉందని తెలిపారు. -
మృత్యువుతో పోరాడి ఓడింది
గాంధీ ఆసుపత్రిలో కన్నుమూసిన ప్రవల్లిక • పురుగు అవశేషం ఉన్న సెలైన్ వల్లే మా కుమార్తె చనిపోయింది • గాంధీ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే మా పాప దూరమైంది • మంత్రికి మొరపెట్టుకుంటే మాపైనే కేసు పెడతామని బెదిరించారు • సాయిప్రవల్లిక తల్లిదండ్రుల ఆరోపణ • ఆమెది సహజ మరణమే.. ఎవరినీ బెదిరించలేదు: మంత్రి లక్ష్మారెడ్డి హైదరాబాద్/కొడకండ్ల(పాలకుర్తి): అరుదైన ‘న్యూరోనల్ సెరాయిడ్ లిపో ప్యూసినోసిస్’అనే వ్యాధితో బాధపడుతూ గాంధీ ఆసుపత్రిలో చేరిన చిన్నారి సాయి ప్రవల్లిక(6) రెండు నెలల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయింది. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున కన్నుమూసింది. ఆమెకు వైద్యం అందజేసే క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గాంధీ వైద్యులు పురుగు అవశేషం ఉన్న సెలైన్ ఎక్కించిన సంగతి తెలిసిందే. ప్రవల్లిక ఆరోగ్యం మరింత క్షీణించి చివరకు మృత్యు ఒడికి చేరుకుందని ప్రవల్లిక తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డికి మొరపెట్టుకుంటే.. తనపైనే కేసు పెడతామని బెదిరించారని చెప్పారు. అయితే ప్రవల్లికది సహజ మరణమే అని, తాము ఎవరినీ బెదిరించలేదని మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ‘సెలైన్’పై ముగ్గురితో కమిటీ జనగామ జిల్లా కొడకండ్ల మండలం మైదంచెరువు తండాకు చెందిన భిక్షపతి, సుమలత దంపతుల కుమార్తె సాయిప్రవల్లిక మెదడు సంబంధిత ‘న్యూరోనల్ సెరాయిడ్ లిపో ప్యూసినోసిస్’వ్యాధితో బాధపడుతోంది. గతేడాది డిసెంబర్ 7న గాంధీ ఆసుపత్రి చిన్నపిల్లల విభాగంలోని పీఐసీయూలో ప్రవల్లికను చేర్చుకున్నారు. అదే నెల 15వ తేదీన చిన్నారికి ఎక్కించిన సెలైన్ బాటిల్లో పురుగు అవశేషం ఉన్నట్లు తండ్రి భిక్షపతి గుర్తించారు. ఈ ఉదంతం అప్పట్లో సంచలనం సృష్టించడంతో వైద్యుల నిర్వాకంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. దీంతో సెలైన్ బాటిల్లోని ద్రావకాన్ని లేబోరేటరీకి పంపారు. పుణేలోని ప్రెసినియస్కాబీ సంస్థ డెక్స్ట్రోస్ 10%(500 ఎంఎల్) సెలైన్ బాటిల్ తయారు చేసింది. పురుగు అవశేషం ఉన్న సెలైన్ బాటిల్ ఎక్కించడంతోనే బాలిక ప్రాణాపాయస్థితికి చేరుకుందని ప్రవల్లిక తల్లిదండ్రులు ఆరోపించడంతో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ముగ్గురు వైద్య నిపుణులతో కమిటీ వేశారు. ఈ నేపథ్యంలో విచారణ కొనసాగుతుండగానే చిన్నారి సాయిప్రవల్లిక కన్నుమూసింది. ప్రవల్లికది సహజ మరణం..: మంత్రి లక్ష్మారెడ్డి గాంధీ ఆసుపత్రిలో మృతిచెందిన ప్రవల్లికది సహజ మరణమని, ఆమెకు ప్రాణాంతక ‘న్యూరో నల్ సెరాయిడ్ లిపో ప్యూసినోసిస్’వ్యాధి ఉందని మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఆమెకు న్యూమోనియా, ఫిట్స్, లంగ్స్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలున్నాయన్నారు. 4 నెలల క్రితం గాంధీలో అడ్మిట్ అయిందని, అప్పుడు కొంత నయమై డిశ్చార్జ్ అయిందని, ఆ తర్వాత ప్రైవేట్ ఆసుపత్రు ల చుట్టూ తిరిగారని చెప్పారు. ఆమె వ్యాధి లక్షణాలను బట్టి 6 నుంచి 12 ఏళ్ల లోపు మరణం తప్పదని తేల్చడంతో తిరిగి గాంధీలో చేర్చారన్నా రు. 63 రోజులుగా ప్రవల్లికకు గాంధీలో వైద్యం జరుగుతోందన్నారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న ఆమె మంగళవారం మృతి చెందిం దన్నారు. తామెవరూ ప్రవల్లిక తల్లిదండ్రులను బెదిరించలేదని, వారికి సాయం చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. కాగా, ప్రవల్లికది సహజ మరణమేనని గాంధీ సూపరింటెండెంట్ జేవీ రెడ్డి తెలిపారు. ఆమెకు వచ్చిన అరుదైన వ్యాధి వల్ల రెండేళ్ల కంటే ఎక్కువ బతకలేదని గతం లోనే వైద్యులు పలు పరీక్షలు చేసిన అనంతరం నిర్థారించినట్లు పేర్కొన్నారు. పురుగు అవశేషం ఉన్న సెలైన్పై విచారణ కొనసాగుతోందని, ఇంకా నివేదిక అందలేదని అన్నారు. మాపైనే కేసు పెడతామని బెదిరించారు మంత్రిపై సాయిప్రవల్లిక తల్లిదండ్రుల ఆరోపణ గాంధీ వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పాప మృతి చెందిందని సాయిప్రవల్లిక తల్లిదండ్రులు భిక్షపతి, సుమలత ఆరోపించారు. పురుగు అవశేషంతో కూడిన సెలైన్ ఎక్కించాక తమ పాప ఆరోగ్యం మరింత క్షీణించిందని, పాపను వేరే ఆసుపత్రిౖMðనా మార్చి కాపాడాలని పలుమార్లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను వేడుకున్నా పట్టించుకోలేదని చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి కాళ్లపై పడి తమ బిడ్డను కాపాడాలని, మెరుగైన వైద్యం చేయించాలని వేడుకుంటే.. ‘తప్పుడు ఆరోపణలు చేస్తూ బదనాం చేయాలని చూస్తున్నారు. మీపై కేసు పెడతాం’అని అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ జరిపి తమకు న్యాయం చేయాల్సిన వారు ఏమాత్రం పట్టించుకోలేదని, రెండు నెలలు కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని ఆసుపత్రిలో పడిగాపులు కాస్తే.. చివరకు బిడ్డ మృతదేహాన్ని అందించారని వారు కన్నీటిపర్యంతమయ్యారు. ఆరోగ్యం బాగాలేకనే మీ బిడ్డ చనిపోయింది.. లొల్లి చేయకుండా తీసుకెళ్లాలని అక్కడి సీఐ ఫోన్లో తమను హెచ్చరించి పంపించారని ఆరోపించారు. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్, ఇతర వైద్య ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఉంటే ప్రవల్లిక బతికేదని, ఇప్పుడు తన కూతురు ప్రాణాలు తెచ్చి ఇవ్వగలరా అని ప్రశ్నించారు. కాగా, విషతుల్యమైన సెలైన్ ఎక్కించడం వల్లే బాలిక మృతి చెందిందని, ఆమె కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు డిమాండ్ చేశారు. -
ఆవేదన నుంచి పుట్టిన ఆవిష్కరణ
• సెలైన్ అరుుపోగానే సైరన్ • జాతీయ ఇన్‌స్పైర్‌కు ఎంపిక • విద్యార్థి, ఉపాధ్యాయురాలి మేధోశ్రమకు ప్రశంసలు గోవిందరావుపేట: ఓ విద్యార్థి.. మరో ఉపాధ్యాయురాలి ఆవేదన నూతన ఆవిష్కరణకు శ్రీకారం చూట్టింది. రోగికి సెలైన్ ఎక్కించే సమయంలో అది ఎప్పుడు అరుుపో తుందోనని ఎదురు చూడకుండా.. సైరన్ మోగేలా చేసిన వీరి ఆవిష్కరణ జాతీయస్థారుు ఇన్‌స్పైర్‌కు ఎంపికైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోవిందరావుపేట మండ లం పస్రా గ్రామానికి చెందిన బొజ్జ ప్రభు లత(14) గోవిందరావుపేట జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువు తోంది. తల్లి అనారోగ్యం బారిన పడిన సమ యంలో సెలైన్ ఎక్కించినప్పుడు అది ఎప్పుడు అరుుపోతుందా అని ఎదురు చూసేది. ఇదే పరిస్థితిని పాఠశాల ఉపాధ్యాయురాలు కొము ర పాలెం జ్యోతి తన సోదరుడి అనారోగ్యం సందర్భంగా ఎదుర్కొంది. ఇరువురూ సెలైన్ అరుుపోగానే సిగ్నల్ వచ్చేలా చేస్తే బాగుం టుందని ఆలోచించి, ఈ మేరకు అలాంటి పరికరం ఆవిష్కరణకు పూనుకున్నారు. పలువురి ప్రశంసలు వీరి ప్రదర్శనను తిలకించిన ఎన్సీఈఆర్టీ ప్రొఫెసర్ సురేష్‌బాబు, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ప్రతినిధి రజని, డీఆర్డీవో శాస్త్రవేత్త కరుణానిధి, పలువురు ఉస్మానియా ప్రొఫెసర్లు నూతన ఆవిష్కరణను అభినందించారు. జిల్లా ఇన్‌స్పైర్‌లో భాగంగా స్టేషన్‌ఘన్‌పూర్ , ఎన్ఐటీ వరంగల్‌లో నిర్వహించిన టెక్నోజి యాన్, హైదరాబాద్‌లో ఎగ్జిబిట్‌ను ప్రదర్శిం చి అన్ని చోట్లా పలువురి ప్రశంసలు పొందారు. తాజాగా జాతీయ ఇన్స్పైర్ పోటీలలో డిసెంబర్ 10, 11 తేదీల్లో ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. జాతీయ స్థారుుకి వెళతాననుకోలేదు.. తమ ఉపాధ్యాయురాలితో కలిసి తయారు చేసిన ఎగ్జిబిట్ జాతీయ స్థారుుకి వెళుతుందని ఊహించలేదని ప్రభులత పేర్కొంది. రోగులకు సేవలందించే క్రమంలో వారి బంధు వులు, నర్సింగ్ స్టాఫ్‌కు ఉపయోగకరంగా ఉండేలా మంచి ఆలోచనకు సహకరించడం ఎంతో సంతృప్తినిస్తోందని జ్యోతి ఆనందం వ్యక్తం చేసింది. ఎలా పనిచేస్తుందంటే.. డ్రిప్ మానిటర్‌ను చిన్న తూకం వేసే స్ప్రింగ్, 9 ఓల్టుల బ్యాటరీ, బజర్, ఎల్ఈడీ, స్విచ్, స్టాండ్, సెలైన్ వంటి పరికరాలతో రూ.300లోపు ఖర్చుతో తయారు చేశారు. స్ప్రింగ్ పరికరానికి అమర్చిన వైర్ల ద్వారా బ్యాటరీ, బజర్‌కు అనుసంధానం చేశారు. స్ప్రింగ్‌కు సెలైన్‌ను పెట్టడం ద్వారా బాటిల్లో ద్రవం తగ్గిన కొద్దీ స్ప్రింగ్ దగ్గరకు వచ్చి 50 ఎంఎల్ ఉండగానే బజర్ మోగు తుంది. దీనిని ఆస్పత్రిలో పేషెంట్ వద్ద కాకుండా వైర్ అమర్చి దూరంగా నర్స్ లుండే ప్రాంతంలో ఉంచేలా ఆధునీ క రించి రాష్ట్రస్థారుు ప్రదర్శనలో ఉం చారు. బజర్ మోగగానే నర్సులు ఆ బెడ్ వద్దకు వెళ్లి సేవలందించే వీలు కలుగుతుంది. -
సెలైన్‌తో మొక్కలకు ప్రాణం
వినూత్న ఆలోచనకు కలెక్టర్ ప్రశంస సోషల్ మీడియాలో పెట్టండి అధికారులకు రోనాల్డ్ రోస్ సూచన జూనియర్ కళాశాలలో హరితహారం జగదేవ్‌పూర్: సెలైన్‌తో మొక్కలను కాపాడుతున్న తీరును కలెక్టర్ రోనాల్డ్ రోస్ ప్రశంసించారు. శనివారం ఆయన జగదేవ్‌పూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. సెలైన్ ఆలోచనను మెచ్చుకున్నారు. ఈ ఆలోచన ఎవరిది? అని కలెక్టర్ ఆరా తీయగా తానేనంటూ కళాశాల లెక్చరర్ మోహన్‌దాస్ ముందుకు రావడంతో అభినందించారు. ఆలోచన బాగుంది, వెంటనే సోషల్ మీడియాలో పెట్టండి అంటూ పక్కనే ఉన్న అధికారులకు ఆదేశించారు. మొక్కలను సెలైన్ డ్రిప్పు పద్ధతి బాగుంది.. మొక్కలకు ఎవరు పేరు పెట్టారు? అంటూ విద్యార్థులను ఆరా తీశారు. ఎవరు నాటిన మొక్కకు వారి పేరే పెట్టుకున్నామని విద్యార్థులు చెప్పడంతో కలెక్టర్ శభాష్ అంటూ మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాల ఐడియా చాలా అద్భుతంగా ఉందని ప్రతి ఒక్కరు ఇలాంటి ప్రయోగాలు చేసి మొక్కలను కాపాడుకోవాలని సూచించారు. అనంతరం ప్రిన్సిపాల్ కళాశాలలో నెలకొన్న సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. అంతకుముందు హరితహారంలో భాగంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో గఢా అధికారి హన్మంతరావు, ఎంపీపీ రేణుక, జెడ్పీటీసీ రాంచంద్రం, ఎంపీడీఓ రామారావు, తహసీల్దార్ పరమేశం, సర్పంచ్ కరుణకర్, ఎంపీటీసీలు వెంకటయ్య, బాలేషంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మో.. సెలైన్..!
సుల్తాన్‌బజార్ సరోజినీదేవి కంటి ఆస్పత్రి ఘటనతో నగరంలోని సర్కారు దవాఖానల్లోకి వెళ్లేందుకు జనం జంకుతున్నారు. నాసిరకం సెలైన్ బాటిల్స్ వల్ల పలువురికి చూపుపోయిన వార్తతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సెలైన్ అవసరమున్న రోగులు బెంబేలెత్తుతున్నారు. సెలైన్ కావాల్సి వస్తే తాము బయటి నుండి తెచ్చుకుంటామని పలువురు రోగులు, వారి బంధువులు వైద్యులకు మొరపెట్టుకుంటున్నారు. సరోజినీదేవి కంటి ఆస్పత్రికి సెలైన్ బాటిళ్లు సరఫరా చేసే హసీబ్ ఫార్మా స్యూటికల్స్ కంపెనీయే సుల్తాన్‌బజార్ ఆస్పత్రిలోనూ రింగర్స్ లాక్టెట్(ఆర్ఎల్) సెలైన్ బాటిళ్లను సరఫరా చేస్తోంది. ఏప్రిల్ నెలలో ఈ ఆస్పత్రికి 29వేల సెలైన్ బాటిళ్లు సరఫరా అయ్యాయి. ప్రస్తుతం ఆ కంపెనీకి చెందిన 13, 500 బాటిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇదే కంపెనీకి చెందిన బాటిళ్లను అధికారులు గురువారం నిలోఫర్ ఆస్పత్రిలో సీజ్ చేసిన విషయం విదితమే. ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్న హసీబ్ కంపెనీకి చెందిన 13, 500 బాటిళ్ల సెలైన్ స్టాక్‌ను డ్రగ్ కంట్రోల్ అధికారుల ఆదేశాలతో బ్లాక్ చేసినట్లు ఆర్ఎంవో డాక్టర్ విద్యావతి తెలిపారు. ప్రస్తుతం ఇన్వేర్ ఫార్మాసిటికల్ కంపెనీకి చెందిన సెలైన్లను రోగులకు అందుబాటులో ఉంచామన్నారు. -
రక్తంలోనూ కల్తీ!
రక్తంలో ‘సెలైన్’ కలుపుతూ నకిలీ ప్యాకెట్ల తయారీ హైదరాబాద్: నిత్యావసరాలే కాదు నిత్యం మన శరీరంలో ప్రవహిస్తూ ప్రాణాన్ని నిలబెట్టే రక్తాన్నీ కల్తీ చేస్తున్నారు.. పాలలో నీళ్లు కలిపినట్లుగా బ్లడ్ బ్యాంకుల నుంచి సేకరించిన రక్తంలో సగం గ్లూకోజ్ (సెలైన్) కలుపుతున్నారు.. ఈ కల్తీ చేసి రక్తాన్ని వేరే ప్యాకెట్లలో నింపి రోగులకు అమ్ముకుంటున్నారు.. అంతా పక్కాగా కనిపించేందుకు ఆ రక్తం ప్యాకెట్లకు బ్లడ్‌బ్యాంకుల నకిలీ స్టిక్కర్లు అతికిస్తున్నారు.. నకిలీ రసీదులూ సృష్టిస్తున్నారు.. మొత్తంగా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇదంతా హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్‌లో ఉన్న ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి నిర్వాకం. ఏడాది నుంచి.. సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి బ్లడ్‌బ్యాంక్‌లో సరూర్‌నగర్‌కు చెందిన నరేందర్ (ఔట్ సోర్సింగ్ ఉద్యోగి) ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ప్రభుత్వమే ఈ బ్లడ్‌బ్యాంక్ ద్వారా ఉచితంగా రక్తాన్ని అందజేస్తుంది. రక్తం అందుబాటులో లేనప్పుడు రోగుల నుంచి డబ్బులు వసూలు చేసి.. బయట ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల నుంచి రక్తం ప్యాకెట్లను కొనుగోలు చేస్తుంటారు. దీనిని ఆసరాగా తీసుకున్న నరేందర్... దాతల నుంచి బ్లడ్‌బ్యాంకుకు వచ్చే రక్తంలో గ్లూకోజ్ (సెలైన్) కలిపి, నకిలీ రక్తం ప్యాకెట్లను తయారు చేస్తున్నాడు. ఇతరబ్లడ్ బ్యాంకుల పేరుతో నకిలీ స్టిక్కర్లు తయారు చేయించి వాటికి అతికిస్తున్నాడు. రోగుల అవసరాన్ని బట్టి ఒక్కో ప్యాకెట్‌ను రూ.1,500 నుంచి రూ.2,000 వరకు అమ్ముకుంటున్నాడు. దాదాపు ఏడాదిగా ఈ వ్యవహారం సాగుతోంది. మరొకరికి బాధ్యతలు అప్పగించడంతో.. నరేందర్ ఇటీవల అనారోగ్యం కారణంగా సెలవు పెట్టాడు. దీంతో అధికారులు ఆ స్థానంలో మరో ల్యాబ్ టెక్నీషియన్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆ ల్యాబ్ టెక్నీషియన్ రక్తనిధిలో నిల్వ చేసిన రక్తం తేడాగా ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని తెలంగాణ వలంటరీ బ్లడ్ బ్యాంక్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. లక్ష్మారెడ్డి తన బృందంతో కలసి సరూర్‌నగర్‌లోని నరేందర్ ఇంటికి వెళ్లి నిలదీశారు. దీంతో నరేందర్ పారిపోయాడు. డ్రగ్ కంట్రోల్ అధికారులకు సమాచారమివ్వగా... వారు గురువారం నరేందర్ ఇంటితో పాటు బ్లడ్‌బ్యాంక్‌లో తనిఖీ చేసి 29 నకిలీ రక్తం ప్యాకెట్లు, నకిలీ స్టిక్కర్లు, రసీదు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. మరో విషయం ఏమిటంటే సాధారణంగా రక్తం ప్యాకెట్లో 250 మిల్లీలీటర్ల రక్తం ఉండాలి, కానీ ఈ ప్యాకెట్లలో 150 మిల్లీలీటర్లు మాత్రమే ఉండడం గమనార్హం. ఈ నకిలీ రక్తాన్ని రోగులకు ఎక్కిస్తే.. గుండె ఫెయిలయ్యే అవకాశం ఉంటుందని, హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటంతో రోగి ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిలోఫర్ ఆస్పత్రి ముందు దళారులు నిలోఫర్ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రం ముందు రక్తం దళారులు తిష్టవేశారు. రోగుల బంధువులెవరైనా ఆస్పత్రి లోనుంచి చీటీ తీసుకుని బయటికి రావడమే ఆలస్యం వారిని చుట్టుముడతారు. ‘రక్తం కావాలా, బ్లడ్ బ్యాంకుకు తీసుకెళతాం..’ అని వెంటపడతారు. వారిని కమీషన్లు ఇచ్చే బ్లడ్ బ్యాంకులకు తీసుకెళతారు. అక్కడ రోగుల బంధువులకు నకిలీ రక్తం ప్యాకెట్లను ఇవ్వడం, అడ్డగోలుగా డబ్బు వసూలు చేయడం చేస్తుంటారు. ఈ ఆగడాలను అరికట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. చర్యలు తీసుకుంటాం.. ‘‘రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ నకిలీ రక్తం అందిస్తున్న వారిపై, ఈ వ్యవహారంలో భాగస్వాములైన వారిపై చర్యలు తీసుకుంటాం. ఔట్సోర్సింగ్ ఉద్యోగి నరేందర్‌పై సుల్తాన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశాం..’’ - రత్నకుమారి, సుల్తాన్‌బజార్ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ -
ఠంచనుగా అదే టైమ్‌కు వాంతులు!
మెడిక్షనరీ ఈ వాంతులు ఎందుకు అవుతాయో తెలియదు. కారణం ఏమిటో అర్థం కాదు. కాసేపు వాంతులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. లేదంటే వికారంగానైనా ఉంటుంది. అలా కొన్ని గంటలు గడిచాక... మళ్లీ అంతా హాయిగా ఉంటుంది. కానీ క్రమం తప్పకుండా రోజూ అదే టైమ్‌కు వాంతులు అవుతుంటాయి. క్రితం రోజు ఎంత సేపు అయ్యాయో, ఆ మర్నాడు సైతం అంతే సమయం పాటు అవుతాయి. అంతేకాదు... ఆ వాంతుల తీవ్రత కూడా అంతే సమానంగా ఉంటుంది. ఇలాంటి చిత్రమైన లక్షణం ఉన్న జబ్బు పేరే... ‘సైక్లిక్ వామిటింగ్ సిండ్రోమ్’. సంక్షిప్తంగా సీవీఎస్ అంటారు. ఇది చిన్నపిల్లల్లో ఎక్కువ. కొందరు పెద్ద వయసు వారలోనూ కనిపిస్తుంది. సాధారణంగా ఈ ‘సీవీఎస్’తో పాటు కడుపునొప్పి, తలనొప్పి, మైగ్రేన్ కూడా కనిపించే అవకాశాలు ఎక్కువ. ఇదమిత్థంగా చికిత్స లేకపోయినా... అవసరాన్ని బట్టి శరీరంలో లవణాలు లోపిస్తే సెలైన్ పెట్టడం వంటివి చేస్తారు. ఈ జబ్బు ఉన్నవారికి జీవనశైలిలో మార్పులను సూచిస్తారు. వాంతులను, వికారాన్ని తగ్గించే మందులైన ‘యాంటీ-ఎమెటిక్’ డ్రగ్స్‌తో చికిత్స చేస్తారు. -
ఓ గాడ్!
హ్యూమర్ ప్లస్ మనిషి సుఖాలు కోరుకుంటాడు. దేవుడు కష్టాలు ఇస్తాడు. దేవుడు సుఖాలు ఇచ్చినప్పుడు మనిషి కోరి కష్టాలు తెచ్చుకుంటాడు. మా మిత్రుడు ఒకాయన యూట్యూబ్ చూసి యోగాసనాలు వేశాడు. తరువాత టైరు, ట్యూబు రెండూ పగిలాయి. పద్మాసనమే పద్మవ్యూహం అయింది. వేశాడు కానీ విడిపించుకోలేకపోయాడు. పాము చుట్టలా ఉన్న ఆయన్ని ఆస్పత్రిలో చేర్చారు. జబ్బుని బట్టి డబ్బు పాత మాట. డబ్బును బట్టి జబ్బు. చేతికి సెలైన్, ముక్కుకి ఆక్సిజన్, సుగర్‌కి ఇన్సులిన్, పిర్రకి పెన్సిలిన్ ఇచ్చి చాంతాడంత ప్రిస్కిప్షన్ ఇచ్చారు. బిల్లు చూసేసరికి ఆసనం దానంతట అదే విడిపోయింది. ‘ఆసం’ అని కుటుంబ సభ్యులు ఆనందంతో చప్పట్లు కొట్టారు. అన్ని చప్పట్లూ అభినంద నలు కాదు. దోమలు పాడుతున్నప్పుడు కూడా చప్పట్లు కొడతాం. పాటగాళ్లతో వచ్చిన ఇబ్బందేమంటే తమది పాటో, పోటో తెలుసుకోలేదు. సరిగమలు నేర్చుకోవడం సులభమే. సరిగా పాడడమే కష్టం. ఒకాయన పాటతో కష్టాలు తెచ్చుకున్నాడు. బాగా పాడుతున్నానని ఆయన అనుకున్నాడు. జనం అనుకోలేదు. కోడిగుడ్లతో కొట్టారు. మొహం ఆమ్లేట్ ఆయింది. నాన్‌వెజ్‌ని నాన్‌స్టాప్‌గా ద్వేషించే వాళ్లావిడ ఇదే అదనుగా విడాకులిచ్చేసింది. మిడిగుడ్లేసుకుని మన వాడు గుడ్డు శాకమేనని వాదించినా శోకమే మిగిలింది. విడాకుల వల్ల మగవాళ్లకి మనశ్శాంతి, ఆడవాళ్లకి గృహశాంతి కలుగుతాయని ఒకాయన ఫిలాసఫీ. దీన్ని నిరూపించడానికి ఆయన అనేకసార్లు వెళ్లిళ్లు చేసుకుని వాటిని పెటాకులు చేసి విడాకుల వరకు వెళ్లాడు. స్త్రీలకు స్వేచ్ఛ ఉండాల్సిందే కానీ అది మగవాళ్ల బానిసత్వానికి దారి తీయకూడదని, బానిస యుగం అంతరించిపోవడం ఒక భ్రాంతి మాత్రమేనని ఇరవై రెండు చాప్టర్లతో ఒక బుక్ రాశాడు. ఫెమినిస్టులు ధర్నా, దాడి చేసి తరువాత నినాదాలతో చావగొట్టి చెవులు మూశారు. దాంతో అతని చాప్టర్ క్లోజ్ అయింది. నిజం నిష్టూరమైందని, ఫెమినిజం అంతకు మించి నిష్టూరమైందని అతను గొణిగాడు కానీ, ఇంకా ఎవరికీ వినిపించలేదు. గోడలకి చెవుల కాలం పోయి, చెవులకే గోడల కాలం వచ్చింది. చిన్నప్పుడు కాలం, దూరం లెక్కలు చదువుకుంటాం కానీ, మారుతున్న కాలం ఎన్నటికీ అర్థం కాదు. ఒకే ఆఫీస్‌లో పని చేస్తున్నవాళ్ల మధ్య వందల కిలోమీటర్ల దూరముంటుంది. ఒకే ఇంట్లో వున్నవాళ్లు రెండు వేర్వేరు ప్రపంచాల్లో జీవిస్తుంటారు. ఎవరి లోకం వాళ్లది. ఎవరి సిద్ధాంతం వాళ్లది. వేదం కంటే ఆయుర్వేదం గొప్పదని ఒకాయన నమ్మి సుగర్ కంట్రోల్ కోసం కనిపించిన ప్రతి ఆకునీ మేక నమిలినట్టు నమిలాడు. ఆకులు మేకులై పేగుల్ని చుట్టుకున్నాయి. సుగర్ సంగతేమో కానీ కడుపులో గరగరమని సౌండ్స్ మొదలయ్యాయి. ఎక్కడ కూచున్నా కడుపు చెడిపోయిన రేడియోలా అరవసాగింది. ఆ ధ్వనికి మొదట ఆయన భార్య, తర్వాత చుట్టుపక్కల వాళ్లు పారిపోయారు. ఆకులో ఆకునై అని పాడుకుంటూ ఎక్కడో ఆయన తిరుగుతున్నాడు. లోకాన్ని మార్చడం ఈజీ. మనల్ని మార్చుకోవడమే కష్టం. ఆత్మజ్ఞానం అంటే ఆత్మగా మారిన తర్వాత జ్ఞానం రావడం. ఈ మధ్య కృష్ణానరగర్లో ఒక ఆత్మ కనిపించింది. బతికున్నంత కాలం సినిమాల్లో యాక్ట్ చేయాలని ప్రయత్నించిందట. చివరికో వేషం వచ్చింది. శవంగా నటించాలి. సంతోషంలో పాత్రలో జీవించే సరికి ఆత్మగా మారాల్సి వచ్చింది. సినిమాలకి పని చేస్తున్న వాళ్లలో ఎవరు మనుషులో, ఎవరు దెయ్యాలో అర్థం కావడం లేదట. అందుకే సినిమాలు చచ్చినా బాగుపడవని చెప్పింది. దేవుణ్ణి మనం కోరుకోవలసింది ఏమంటే బతికే తెలివితేటలు ఎలాగూ ఇవ్వడు. చావు తెలివితేటలు ఇవ్వకపోతే అదే పదివేలు. - జి.ఆర్.మహర్షి -
లైన్లో పడాలంటే.. సెలైన్ ఉండాల్సిందే
జ్వరం వచ్చినపుడు డాక్టర్ ఇంజెక్షన్ వేస్తాడంటే చాలు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. చిన్న పిల్లలైతే మరీనూ.. అయితే కంబోడియా ప్రజలు మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటారు. ఇంజెక్షన్లు, సెలైన్లు ఎక్కించుకోవడం అంటే వారికి మహా ఇష్టం. ఎంతగా అంటే బైక్‌పై వెళ్తూకూడా ఓ సెలైన్ బాటిల్ వారి వెంట ఉంచుకుంటారు. రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే వారు కూడా ఓ సెలైన్ బాటిల్ పట్టుకు తిరుగుతారు. దీనికి కారణం సరిగా తెలియదు కానీ సెలైన్ల వల్ల వారిలో ఏదో తెలియని శక్తి వస్తుందని వారి నమ్మకం. -
షాకిచ్చిన సెలైన్!
కోటబొమ్మాళి, న్యూస్‌లైన్: అనారోగ్యం చేసి ఆస్పత్రికి వెళితే.. కొత్త సమస్య తెచ్చిపెట్టాయి అక్కడి సెలైన్ బాటిళ్లు. వారిని మరింత అస్వస్థత పాల్జేసి ఆందోళనకు గురిచేశాయి. సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది. కోటబొమ్మాళి సామాజిక ఆస్పత్రిలో రోగులకు ఇచ్చిన సెలైన్ వికటించడంతో 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కోటబొమ్మాళి మండలం బలరాంపురం, లఖందిడ్డి, హరిశ్చంద్రపురం గ్రామాలకు చెందిన 15 మంది డయేరియాతో బాధ పడుతూ రెండు రోజులుగా స్థానిక సామాజిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా శనివారం ఉదయం అక్కడి నర్సులు రోగులకు సిప్రాఫ్లాక్ససిన్ ఆర్ఎల్, మెట్రోజల్ ఎన్ఎస్ సెలైన్ ఎక్కించారు. వాటిని ఎక్కించి ఐదు నిమిషాల వ్యవ ధిలో రోగుల్లో విపరీత మార్పు ప్రారంభమైంది. ఒళ్లంతా చెమటలు పట్టి, చలిజ్వరం కమ్మేయడంతో వారంతా లబోదిబోమంటూ విలపించడం ప్రారంభించారు. రోగుల కుటుం బీకులు కొందరిని వేరే ఆస్పత్రులకు తరలించగా, మరికొందరిని ఆస్పత్రి వైద్యులు పరిస్థితి విషమించకుండా విరుగుడు చికిత్స అందించారు. దాంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. చికిత్స కోసం వస్తే నాసి రకం సెలైన్లు ఎక్కించి కొత్త ఆరోగ్య సమస్యలు సృష్టించడంపై రోగులు, వారి కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఉదంతంపై ఆస్పత్రి వైద్యుడు గణేష్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా సెలైన్లు రియాక్షన్ ఇచ్చిన మాట వాస్తవమేనని, అయితే అలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదన్నారు. 15 రోజుల కిందట హైదరాబాద్ నుంచి సెలైన్ బాటిళ్ల స్టాకు వచ్చిందని, వీటి కాలపరిమితి కూడా చాలా ఉందన్నారు. ఆ ధీమాతోనే రోగులకు ఎక్కించామన్నారు. ఇప్పటికే కొంత స్టాకు వినియోగించామని, అయితే తాజా సంఘటనతో మిగిలిన 1500 సెలైన్ బాటిళ్లను సీజ్ చేశామని వివరించారు. పక్క ఆస్పత్రుల నుంచి సెలైన్ బాటిళ్లు తెప్పించి రోగులకు ఇచ్చామని చెప్పారు. ఈ సంఘటన గురించి జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారికి సమాచారం అందజేశామని చెప్పారు. చాలా భయమేసింది డయేరియా చికిత్స కోసం ఆస్పత్రికి వస్తే సెలైన్ ఎక్కించారు. అంతే ఒక్కసారిగా ఒళ్లంతా చెమటలు పట్టాయి. చలిజ్వరం రావడంతో చాలా భయమేసింది. దీంతో ప్రభుత్వాసుపత్రులంటే భయమేస్తోంది. -తిర్లంగి శారద, లఖందిడ్డి సంఘటనపై విచారణ జరపాలి సెలైన్ ఎక్కించిన 5 నిమిషాల్లోనే చలి జ్వరం వచ్చింది. ఏమైపోతానో తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేక ఇక్కడకు వస్తే ఇలా జరిగింది. ఈ సంఘటనపై విచారణ జరపాలి -కూన సోమేశ్వరరావు, హరిశ్చంద్రపురం -
108లో ఆక్సిజన్ లేక బాలింత మృతి
సీతంపేట, న్యూస్‌లైన్: మహానేత వైఎస్ మరణానంతరం 108 సేవలు అంతంతమాత్రంగా ఉండటంతో ఎందరి ప్రాణాలో గాలిలో కలిసిపోతున్నాయి. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీలో శనివారం రాత్రి జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సీతంపేట మండలం మర్రిపాడు కు చెందిన గొర్లె ఉషారాణి రాత్రి ఇంటి వద్దే ఆడబిడ్డను ప్రసవించింది. అయితే.. శిశువు పుట్టిన వెంటనే ఏడవకపోవడం, చలనం లేకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు 108కి ఫోన్ చేశారు. ఈలోగా తల్లి స్పృహ కోల్పోయింది. కొద్దిసేపటికి 108 వాహనం వచ్చినప్పటికీ అందులో ఆక్సిజన్, సెలైన్ ఏమీ లేకపోవడంతో బాధితురాలికి ప్రథమ చికిత్స కూడా అందలేదు. కుటుంబ సభ్యులు వెంటనే మరోసారి 108లో సీతంపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సెలైన్ ఎక్కిస్తుండగా ఆమె కన్నుమూసింది. బిడ్డ మాత్రం క్షేమంగా ఉంది. 108 వాహనంలో ఆక్సిజన్, సెలైన్ ఉండి ఉంటే తన భార్య ప్రాణాలు దక్కేవని మృతురాలి భర్త శివ రోదించారు.