
అమీర్‌పేట (హైదరాబాద్): కుంగుబాటుతో సెలైన్‌లో విషం ఎక్కించుకుని ఓ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. కడప జిల్లా బద్వేలుకు చెందిన రాజ్‌కుమార్ (29) బీకేగూడ మున్సిపల్ పార్కు సమీపంలో ఉంటూ అమీర్‌పేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. శుక్రవారం గదిలోనే ఉన్న రాజ్‌కుమార్ తన స్నేహితుడితో మనసు బాగోలేదని చెప్పి ఫోన్ చేశారు.
కొద్దిసేపటి తర్వాత స్నేహితుడు తిరిగి ఫోన్ చేయగా ఫోన్ ఎత్తలేదు. అదే ఆస్పత్రిలో పనిచేసే మరో వైద్యుడు శ్రీకాంత్‌కు సమాచారం ఇవ్వడంతో ఇంటికి వచ్చి చూడగా సెలైన్ పెట్టుకుని బెడ్‌పై కనిపించారు. సెలైన్ తీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రి సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గదికి చేరుకుని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment