లైన్‌లో పడాలంటే.. సెలైన్ ఉండాల్సిందే
జ్వరం వచ్చినపుడు డాక్టర్ ఇంజెక్షన్ వేస్తాడంటే చాలు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. చిన్న పిల్లలైతే మరీనూ.. అయితే కంబోడియా ప్రజలు మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటారు. ఇంజెక్షన్లు, సెలైన్లు ఎక్కించుకోవడం అంటే వారికి మహా ఇష్టం. ఎంతగా అంటే బైక్‌పై వెళ్తూకూడా ఓ సెలైన్ బాటిల్ వారి వెంట ఉంచుకుంటారు. రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే వారు కూడా ఓ సెలైన్ బాటిల్ పట్టుకు తిరుగుతారు. దీనికి కారణం సరిగా తెలియదు కానీ సెలైన్ల వల్ల వారిలో ఏదో తెలియని శక్తి వస్తుందని వారి నమ్మకం.