Covid-19: పుక్కిలించిన సెలైన్‌తో కరోనా టెస్ట్‌ | NEERI Developed New Method For Corona Testing With Saline Tube | Sakshi
Sakshi News home page

Covid-19: పుక్కిలించిన సెలైన్‌తో కరోనా టెస్ట్‌

Published Fri, May 28 2021 2:11 PM | Last Updated on Fri, May 28 2021 2:16 PM

NEERI Developed New Method For Corona Testing With Saline Tube - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థ అయిన నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌ఈఈఆర్‌ఐ)నీరి సంస్థ కరోనా టెస్టింగ్‌కు కొత్త విధానాన్ని కనిపెట్టింది. సెలైన్‌ ట్యూబ్‌తో 3 గంటల్లో కరోనా టెస్టింగ్‌ ఫలితాన్ని తెలియజేసే విధానాన్ని ఆవిష్కరించింది. ఈ విధానంలో నోట్లో పుక్కిలించిన సెలైన్‌తో ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌ చేస్తారు. అత్యాధునిక ల్యాబ్‌ అవసరం లేకుండా.. అతి తక్కువ ఖర్చుతో టెస్ట్‌ చేసుకోవచ్చు.

ఈ ఆవిష్కరణ వల్ల గ్రామీణ, గిరిజన ప్రాంతాల వారికి మరింత సౌలభ్యం చేకూరనుంది. దీని వల్ల సొంతంగా ఇంట్లోనే టెస్ట్‌ చేసుకోవచ్చు. నీరి ఆవిష్కరించిన ఈ నూతన టెస్టింగ్‌ పద్దతికి ఐసీఎంఆర్‌ సంస్థ కూడా ఆమోదం తెలిపింది. తర్వలోనే ఇది మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది.

చదవండి: Covid-19 Self-Testing: ఇంట్లోనే కరోనా టెస్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement