పొలం తగాదా ఘర్షణలో ఎలాంటి పాపం తెలియన వ్యవసాయ కూలీ హత్యకు గురికాగా మరో వ్యక్తి విషమపరిస్థితులలో కొట్టుమిట్టాడతున్నాడు. సిద్దవటం మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటనతో ఎన్నికలు సమీపించక మునుపే ఫ్యాక్షన్ పడగ విప్పుతోందంటూ ప్రజలు ఆందోళనలో పడ్డారు.
సిద్దవటం, న్యూస్‌లైన్: మండలంలోని కడపాయపల్లె గ్రామ పంచాయతీ మంగనవాండ్లపల్లెలో పొలంగట్ల తగాదా విషయమై ఒక వ్యక్తి దారుణ హత్యకు గురి కాగా, మరో వ్యక్తి ప్రాణాప్రాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు మంగనవాండ్లపల్లెలో సూరయ్యయాదవ్‌కు, నారపురెడ్డి యానాదిరెడ్డికి మధ్య ఎనిమిది నెలలుగా భూతగాదాలు నడుస్తున్నాయి. ఆ సమయంలో యానాదిరెడ్డిసోదరుడు యల్లారెడ్డిని పొలంగట్లవద్ద సూరయ్య, అతని కుమారులు, అల్లుడు కత్తితో దాడి చేశారు.
ఈ సంఘటన మరువకముందే శుక్రవారం ఉద యం యానాదిరెడ్డి పొలం చుట్టూ కంచె వేసేందుకు కూలీలతో గుంతలు తీస్తుం డగా సూరయ్య తన కుమారులు సుబ్బయ్యయాదవ్, సురేష్‌కర్ణా, అల్లుడు సోము చిన్నపాలకొండయ్య, కుమార్తె సునీత, మరో వ్యక్తి శ్రీనివాసులు యానాదిరెడ్డిపై, కూలీలపై ఘర్షణకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో జడా సాలయ్య అనే కూలీకి కత్తితో గుండెకు రెండు పోట్లకు గురి కాగా పొలంలోనే కుప్పకూలిపోయాడు. యానాదిరెడ్డి కూడా నాలుగు కత్తిపోట్లకు గురయ్యాడు. ఘర్షణలో సూరయ్యకు స్వల్పగాయాలయ్యాయి.
సాలయ్యను, యానాదిరెడ్డిలను కడప రిమ్స్‌కు తరలించే యత్నంలో బండికణం వద్దకు రాగానే సాలయ్య మృతిచెందారు. యానాదిరెడ్డిని కడప రిమ్స్‌కు తరలించగా అక్కడ ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు తిరుపతికి తరలించాల్సిందిగా సూచించారు. విష యం తెలుసుకున్న ఒంటిమిట్ట సీఐ రెడ్డప్ప, రాజంపేట రూరల్‌సీఐ వెంకటేశ్వర్లు, సిద్దవటం, ఒంటిమిట్ట ఎస్‌ఐలు గురునాథ్, జావిద్, సిద్దవరం ట్రైనీ ఎస్‌ఐ అన్వర్‌బాషా, ఏఆర్‌పోలీసులు, స్పెషల్‌పార్టీ పోలీసులు గ్రామానికి చేరుకుని ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా శాంతియుత వాతావరణం నెలకొల్పేం దుకు కృషి చేస్తున్నారు.
ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా సంఘటన అనంతరం నింధితులు పోలీసు రక్షణతో వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే తాము ఎవ్వరినీఅదుపులోకి తీసుకోలేదని పోలీసులు పేర్కొం టున్నారు. హత్య సంఘటనతో కడపాయపల్లెలో ఫ్యాక్షనిజం మళ్లీ మొదలవుతుందని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
పోలీసు పికెట్‌ఏర్పాటు
భూతగాదాలతో చోటు చేసుకున్న హత్య సంఘటనతో ఫ్యాక్షన్ గ్రామమైన మంగనవాండ్లపల్లెలో ఘర్షణలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసు పికిటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఒంటిమిట్ట, రాజంపేట, సిద్దవటం, నందలూరు పోలీసులతో పాటు ఏఆర్, స్పెషల్‌పార్టీకి చెందిన దాదాపు 50మందికి పైగా పోలీసులు హత్య అనంతరం మంగనవాండ్లపల్లెకు చేరుకున్నారు. నింధితుడు సూరయ్యయాదవ్ నివాసగృహం వద్ద, పరిసర ప్రాం తాలను పోలీసులు పరిశీలించారు. హత్యకు దారి తీసిన సంఘటన పట్ల ఆరా తీశారు. అలాగే సూరయ్య రైస్‌మిల్, ఎంపీపీ స్కూల్ సమీపంలో, మం గనవాండ్లపల్లె ఆలయం వద్ద మరి కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలలో ఘర్షణపూరితమైన వాతావరణం నెలకొనకుండా పోలీసు పికిటింగ్ ఏర్పాటు చేశారు.
కడపాయపల్లెలో దారుణ హత్య
Published Sat, Jan 18 2014 2:24 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
Advertisement