Special party police
-
భారీగా గంజాయి పట్టివేత?
అనంతపురం సెంట్రల్ : జిల్లా వ్యాప్తంగా భారీగా గంజాయి నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. రెండురోజులుగా స్పెషల్‌పార్టీ పోలీసులు దాడులు చేస్తున్నారు. కేవలం తాడిపత్రి పట్టణంలోనే నాలుగు సంచుల్లో నిల్వ చేసిన గంజాయిని పట్టుకున్నట్లు తెలిసింది. అలాగే అనంతపురం నగరంలో వన్‌టౌన్ పోలీసులు కూడా గంజాయి విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ దాడులపై పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడించలేదు. -
కాల్పుల మోత
ఓబులవారిపల్లె: శేషాచలం అడవుల్లో బుధవారం మరో ఎన్కౌంటర్ జరిగింది. స్పెషల్‌పార్టీ పోలీసులు జరిపిన కాల్పుల్లో తమిళనాడుకు చెందిన ఇరువురు ఎర్రచందనం కూలీలు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. శేషాచలం అడవుల్లోని నీచుగుంత ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరికివేస్తున్నట్లు సమచారం అందడంతో స్పెషల్‌బ్రాంచ్ ఎస్ఐ రమేష్‌బాబు స్పెషల్‌పార్టీ పోలీసులను అప్రమత్తం చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీ పోలీసులు ఉదయం 6 గంటల ప్రాంతంలో నీచుగుంత ప్రాంతంలో కూంబింగ్‌కు దిగారు. చెట్లు నరుకుతున్న శబ్ధాలు గ్రహించిన ఆర్ఎస్ఐ రాజు సాయుధబలగాలతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులను చూడగానే ఎర్రకూలీలు రాళ్లు, కర్రలు, గొడ్డళ్లతో దాడికి దిగారు. దీంతో పోలీసులు వారి దాడులను ప్రతిఘటించారు. ఎర్రకూలీలు జరిపిన దాడిలో ఇరువురు కానిస్టేబుళ్లు స్వల్పంగా గాయపడటంతో ఆత్మ రక్షణ కోసం గాల్లో రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అయినా ఎర్రకూలీలు దాడులను ఆపలేదు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఎర్రచందనం తరలింపునకు అడ్డాగా నీచుగుంత: ఎన్కౌంటర్ జరిగిన పరిసరాలను గమనిస్తే ఎర్రచందనం స్మగ్లింగుకు నీచుగుంత అడ్డాగా ఉంటున్నట్లు స్పష్టమవుతోంది. ఎన్కౌంటర్ స్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నీచుగుంత ప్రాంతం గాదెల అటవీప్రాంతానికి చాలా దూరంలో ఉంది. ఎత్తయిన కొండ ఎక్కి లోతైనదిగువ ప్రాంతానికి వెళ్ళాలి. నీటి సౌకర్యం ఉండటంతో పాటు వంటకు, రాత్రుల్లో ఉండేందుకు అనువుగా ఉంది. ఈ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లు విస్తారంగా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతాన్ని అడ్డాగా ఎంచుకుని ఎర్రచందనం స్మగ్లర్లు కూలీల చేత చెట్లను నరికించి దుంగలను తరలించుకుపోతున్నారు. నీచుగుంత ప్రాంతం అంతా నిత్యావసర వస్తువుల ప్యాకెట్లు, కూలీలకు అవసరమయ్యే ఇతర వస్తువులతో నిండిపోయి ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ ప్రాంతంలో ఎర్రచందనం కూలీలు అనేక రోజులుగా అక్కడే ఉంటున్నట్లు ఘటనాస్థలాన్ని సందర్శించిన రాజంపేట డీఎస్పీ జీవీ రమణ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కూంబింగ్ నిర్వహించే ప్రత్యేక పోలీసు బృందాలుగానీ, అటవీశాఖ అధికారులు కానీ ఈ ప్రాంతంలో సంచరించిన దాఖలాలు ఉంటే ఎర్రచందనం కూలీలుగానీ, స్మగ్లర్లు కానీ ఎక్కువ రోజులు ఇక్కడ ఉండేవారు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో సుమారు 50 గొడ్డళ్లు, అక్కడక్కడా నరికివేసిన ఎర్రచందనం దుంగలు, బియ్యం, బీడీలు, అగ్గిపెట్టెలు తదితర వస్తువులను పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం కూలీల సంచులను తనిఖీ చేయగా గత నెల 11, 30 తేదీల్లో గుత్తి నుంచి తిరుపతికి కొన్న రైలు టిక్కెట్లు లభించాయి. తమిళ తంబీల కోసం తనిఖీలు రాజంపేట: శేషాచలంలోని గాదెల అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల నేపథ్యంలో ఎర్ర కూలీల కోసం పోలీసులు తనిఖీలు చేపట్టారు. సుమారు 50 మంది కూలీలు తప్పించుకుని పోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా రూరల్ సీఐ వై.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రామాపురం వద్ద వాహనాల తనిఖీ చేశారు. లారీలు, బస్సులు, ఆటోలతో పాటు వివిధ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.అనుమానం వచ్చిన వారి గురించి ఆరా తీశారు. -
మళ్లీ బరితెగింపు
రైల్వేకోడూరు రూరల్, న్యూస్‌లైన్: రైల్వేకోడూరు మండలం బాలుపల్లె అటవీ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఎర్రచందనం స్మగ్లర్లు అటవీ సిబ్బందితో పాటు స్పెషల్ పార్టీ పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు గాలిలో కాల్పులు జరపగా స్మగ్లర్లు పారిపోయినట్లు సమాచారం. అయితే పారిపోతున్న వారిలో కొందరిని పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై సీఐ రమాకాంత్ మాట్లాడుతూ సంఘటన జరిగిన విషయం వాస్తవమేనన్నారు. ప్రస్తుతం ఒకరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఎస్పీతో మాట్లాడి పూర్తి వివరాలు ఆదివారం వెల్లడిస్తామన్నారు. కూంబింగ్ నిర్వహిస్తుండగా గుంజనే రు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. -
కడపాయపల్లెలో దారుణ హత్య
పొలం తగాదా ఘర్షణలో ఎలాంటి పాపం తెలియన వ్యవసాయ కూలీ హత్యకు గురికాగా మరో వ్యక్తి విషమపరిస్థితులలో కొట్టుమిట్టాడతున్నాడు. సిద్దవటం మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటనతో ఎన్నికలు సమీపించక మునుపే ఫ్యాక్షన్ పడగ విప్పుతోందంటూ ప్రజలు ఆందోళనలో పడ్డారు. సిద్దవటం, న్యూస్‌లైన్: మండలంలోని కడపాయపల్లె గ్రామ పంచాయతీ మంగనవాండ్లపల్లెలో పొలంగట్ల తగాదా విషయమై ఒక వ్యక్తి దారుణ హత్యకు గురి కాగా, మరో వ్యక్తి ప్రాణాప్రాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు మంగనవాండ్లపల్లెలో సూరయ్యయాదవ్కు, నారపురెడ్డి యానాదిరెడ్డికి మధ్య ఎనిమిది నెలలుగా భూతగాదాలు నడుస్తున్నాయి. ఆ సమయంలో యానాదిరెడ్డిసోదరుడు యల్లారెడ్డిని పొలంగట్లవద్ద సూరయ్య, అతని కుమారులు, అల్లుడు కత్తితో దాడి చేశారు. ఈ సంఘటన మరువకముందే శుక్రవారం ఉద యం యానాదిరెడ్డి పొలం చుట్టూ కంచె వేసేందుకు కూలీలతో గుంతలు తీస్తుం డగా సూరయ్య తన కుమారులు సుబ్బయ్యయాదవ్, సురేష్కర్ణా, అల్లుడు సోము చిన్నపాలకొండయ్య, కుమార్తె సునీత, మరో వ్యక్తి శ్రీనివాసులు యానాదిరెడ్డిపై, కూలీలపై ఘర్షణకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో జడా సాలయ్య అనే కూలీకి కత్తితో గుండెకు రెండు పోట్లకు గురి కాగా పొలంలోనే కుప్పకూలిపోయాడు. యానాదిరెడ్డి కూడా నాలుగు కత్తిపోట్లకు గురయ్యాడు. ఘర్షణలో సూరయ్యకు స్వల్పగాయాలయ్యాయి. సాలయ్యను, యానాదిరెడ్డిలను కడప రిమ్స్‌కు తరలించే యత్నంలో బండికణం వద్దకు రాగానే సాలయ్య మృతిచెందారు. యానాదిరెడ్డిని కడప రిమ్స్‌కు తరలించగా అక్కడ ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు తిరుపతికి తరలించాల్సిందిగా సూచించారు. విష యం తెలుసుకున్న ఒంటిమిట్ట సీఐ రెడ్డప్ప, రాజంపేట రూరల్‌సీఐ వెంకటేశ్వర్లు, సిద్దవటం, ఒంటిమిట్ట ఎస్ఐలు గురునాథ్, జావిద్, సిద్దవరం ట్రైనీ ఎస్ఐ అన్వర్‌బాషా, ఏఆర్పోలీసులు, స్పెషల్‌పార్టీ పోలీసులు గ్రామానికి చేరుకుని ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా శాంతియుత వాతావరణం నెలకొల్పేం దుకు కృషి చేస్తున్నారు. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా సంఘటన అనంతరం నింధితులు పోలీసు రక్షణతో వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే తాము ఎవ్వరినీఅదుపులోకి తీసుకోలేదని పోలీసులు పేర్కొం టున్నారు. హత్య సంఘటనతో కడపాయపల్లెలో ఫ్యాక్షనిజం మళ్లీ మొదలవుతుందని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పోలీసు పికెట్ఏర్పాటు భూతగాదాలతో చోటు చేసుకున్న హత్య సంఘటనతో ఫ్యాక్షన్ గ్రామమైన మంగనవాండ్లపల్లెలో ఘర్షణలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసు పికిటింగ్ను ఏర్పాటు చేశారు. ఒంటిమిట్ట, రాజంపేట, సిద్దవటం, నందలూరు పోలీసులతో పాటు ఏఆర్, స్పెషల్‌పార్టీకి చెందిన దాదాపు 50మందికి పైగా పోలీసులు హత్య అనంతరం మంగనవాండ్లపల్లెకు చేరుకున్నారు. నింధితుడు సూరయ్యయాదవ్ నివాసగృహం వద్ద, పరిసర ప్రాం తాలను పోలీసులు పరిశీలించారు. హత్యకు దారి తీసిన సంఘటన పట్ల ఆరా తీశారు. అలాగే సూరయ్య రైస్‌మిల్, ఎంపీపీ స్కూల్ సమీపంలో, మం గనవాండ్లపల్లె ఆలయం వద్ద మరి కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలలో ఘర్షణపూరితమైన వాతావరణం నెలకొనకుండా పోలీసు పికిటింగ్ ఏర్పాటు చేశారు. -
శేషాచలం జల్లెడ
=స్పెషల్ పార్టీ పోలీసుల కూంబింగ్ =స్మగ్లర్లు, కూలీల కోసం =బృందాలుగా గాలింపు =అడవిలోకి ఎవరూ వెళ్లొద్దంటూ నిషేధాజ్ఞలు సాక్షి, తిరుమల: ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీల కోసం సోమవారం స్పెషల్ పార్టీ పోలీసులు తిరుమల శేషాచలం కొండల్ని జల్లెడ పట్టారు. ఆదివారం ఉదయం స్మగ్లర్లు, కూలీల దాడిలో ఇద్దరు ఫారెస్ట్ అధికారులు హతమవటం, మరో ముగ్గురు సిబ్బంది గాయపడిన విషయం తెలిసిందే. దీంతో నిందితుల కోసం స్పెషల్‌పార్టీ పోలీ సులు గాలింపు వేగవంతం చేశారు. దట్టమైన అడవిలో కూం బింగ్ నిర్వహిస్తున్నారు. తిరుమల చుట్టూ అటవీప్రాంతాల్లోకి ఎవ్వరూ వెళ్లరాదని పోలీసులు, అటవీశాఖ అధికారులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. కూంబింగ్‌లో చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లా, కర్నూలు జిల్లాలకు చెందిన పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. శేషాచల కొండలకు పడమర దిశలో ఉన్న తలకోన, ఎర్రవారిపాళెం, భాకరాపేట, రంగంపేట నుంచి తిరుపతి వరకు స్పెషల్‌పార్టీ పోలీసులు బృందాలుగా విడిపోయి అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇక తూర్పు దిశలో కరకంబాడి, మామండూరు, బాలపల్లి, రైల్వే కోడూ రు, రాజంపేట సమీప అటవీమార్గంలోని గ్రామాల నుంచి అడవిలోకి వెళ్లి స్పెషల్ పార్టీ పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. స్పెషల్ పార్టీ ఓఎస్డీ ఉదయ్‌కుమార్, డీఎస్పీ ఇలియాస్‌బాషా గాలింపు బృందాలకు నేతృత్వం వహించారు. మొత్తం ఎనిమిది బృందాలు అడవిలోకి వెళ్లాయి. ప్రతి బృందంలోనూ ఏకే47, ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ రైఫిళ్లు, గ్రైనేడ్లు, ఇతర ఆయుధాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, జరిగిన సంఘటనపై చిత్తూరు జిల్లా పోలీసు అధికారులు, తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు సమీక్షించారు. సంఘటన ఎలా జరిగింది? ఫారెస్ట్ అధికారుల వెంట సాయుధ పోలీసులు ఉంటే ఏవిధంగా ఉండేది? ఇద్దరు అధికారుల ప్రాణనష్టం? తదితర అంశాలపై చర్చించారు. భవిష్యత్‌లో ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది అడవిలోకి వెళ్లే ప్రతి సందర్భంలోనూ పోలీసులు వెంట ఉండాలనే విషయంపై కూడా కూలంకూషంగా చర్చించారు. మరోవైపు శేషాచల అడవులకు ఆనుకునే ఉన్న నల్లమల అడవుల్లో కూడా కర్నూలు జిల్లా స్పెషల్‌పార్టీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ? ఇద్దరు ఫారెస్ట్ అధికారులను హతమార్చి, మరో ముగ్గురిని తీవ్రంగా గాయపరిచిన ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీల్లో తమిళనాడుకు చెందిన నలుగురిని స్పెషల్ పార్టీ పోలీసులు పట్టుకున్నారు. వీరితోపాటు సుమారు 50 మంది కూలీలను పట్టుకున్నా ఆదివారం జరిగిన ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న నలుగురిని గుర్తించారు. సంఘటనలో పాల్గొన్న వారిని నేడో రేపో ఎన్కౌంటర్ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.