జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: తెలంగాణపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్రపూరిత వైఖరిని నిరసిస్తూ శనివారం టీజేఏసీ తలపెట్టిన 24 గంటల బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్‌లో అన్నివర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచే విద్య, వ్యాపారసంస్థలు, పెట్రోల్‌బంక్‌లు, సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా మూతబడ్డాయి. బంద్‌కు టీఆర్‌ఎస్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీలు మద్దతు తెలిపాయి. ప్రభుత్వ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఆయా ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు.
జిల్లాలోని షాద్‌నగర్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, గద్వాల, మహబూబ్‌నగర్, నారాయణపేట్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తెలంగాణ ప్రజలపై సీఎం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ ఎక్కడికక్కడ ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఏపీఎన్‌జీఓల సభకు ఎలా అనుమతి ఇచ్చారని, తెలంగాణ వారికి ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నించారు. నిరంకుశంగా వ్యవహరిస్తున్న సీఎంకు పరాభవం తప్పదని హెచ్చరించారు.
జిల్లా కేంద్రలో...
టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు సయ్యద్ ఇబ్రహీం, పార్టీ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావుఆర్యా ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. సీపీఐ ఎంల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ సీపీఎం ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు.అలాగే ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. మహబూబ్‌నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి మోటర్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ పీఆర్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు నేతృత్వంలో మోటర్‌సైకిల్‌ర్యాలీ నిర్వహించారు.
జిల్లావ్యాప్తంగా
అచ్చంపేట నియోజకవర్గంలో బంద్ స్వ చ్ఛందంగా కొనసాగింది. స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట బీజేపీ, టీఆర్‌ఎస్ నేతలు ధర్నా నిర్వహించారు. లింగాలలో టీఎంయూ ఆధ్వర్యం లో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. అ చ్చంపేట ఆర్టీసీ బస్టాండ్‌లో వంటావార్పు ని ర్వహించి అన్నదానం చేశారు. అంబేద్కర్ చౌ రస్తాలో డీజీపీ దినేష్‌రెడ్డి, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్రపటాలకు పిండప్రదానం చేశారు.
బంద్ నేపథ్యంలో అలంపూర్‌లో టోల్‌పా ్లజా వద్ద హైటెన్షన్ నెలకొంది. హైదరాబాద్‌లో జరిగిన సెవ్ ఆంధ్రప్రదేశ్ సభకు సీమాంధ్ర ఉ ద్యోగులు ఇక్కడి నుంచి వెళ్లడంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎమ్మార్పీఎస్ నాయకులు పోలీసుల వ్యూహాన్ని ఛేదించుకుని వచ్చి టోల్‌ప్లాజా వద్ద నిరసన తెలిపారు.
గద్వాల పట్టణంలో బంద్ ప్రశాంతంగా జ రిగింది. జేఏసీ, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ర్యా లీలు నిర్వహించారు. ధరూరు, గట్టు, మల్దకల్‌లలో బంద్ ప్రశాంతంగా ముగిసింది.
కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. భోజన విరామ సమయంలో ధర్నాలు నిర్వహించారు. హైదరాబాద్‌లో వి ద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీకి నిరసనగా తలకొండపల్లిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
కొల్లాపూర్‌లో నిర్వహించిన బంద్ స్వచ్ఛం దంగా జరిగింది. జేఏసీ, టీఆర్‌ఎస్ నాయకు లు పట్టణంలో ర్యాలీలు నిర్వహించారు.
వ్యా పార దుకాణాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. మక్తల్ పట్టణంలో టీజేఏసీ, బీజేపీ, టీఆర్‌ఎస్, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు డి పోలకే పరిమితం కావడంతో ప్రయాణికు లు ఇబ్బందులు పడ్డారు.
స్థానిక అంబే ద్కర్ చౌరస్తాలో ఉద్యమకారులు రాస్తారోకో చేపట్టారు. నాగర్‌కర్నూల్‌లో స్థానిక ఆర్టీసీ డిపో ఎదు ట ప్రధాన రహదారిపై వంటావార్పు కార్యక్ర మం నిర్వహించి సహపంక్తి భోజనాలు ఏర్పాటుచేశారు. బిజినేపల్లి, పాలెం, మంగనూర్, వట్టెం, వడ్డెమాన్ గ్రామాల్లో విద్యార్థులు శాంతి ర్యాలీలు నిర్వహించారు.
కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి, బొం రాస్‌పేట్, మద్దుర్, దౌల్తాబాద్ మండలాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. టీఆర్‌ఎస్, జే ఏసీ నాయకులు కొడంగల్‌లో బైక్‌ర్యాలీ నిర్వహించారు.
జడ్చర్లలో ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛం దంగా బంద్ పాటించాయి. నేతాజీ చౌక్‌లో తె లంగాణవాదులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ ను దహనం చేశారు. టీజేఏసీ నాయకులు తు ఫాన్ సినిమా పోస్టర్‌ను దహనం చేశారు. హై వేపై బూరెడ్డిపల్లి సమీపంలో ఇండియన్ ఆ యిల్ పెట్రోల్‌బంక్ వద్ద రాస్తారోకో నిర్వహిం చారు.
దేవరకద్ర నియోజకవర్గంలో స్థానిక టీజేఏసీ చైర్మన్ మురళీధర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి నాయకత్వంలో తె లంగాణవాదులు బంద్ కొనసాగించారు. మోటారు సైకిళ్ల ర్యాలీలు నిర్వహించారు.
బంద్ స్వచ్ఛందం
Published Sun, Sep 8 2013 5:49 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement