ఏటీఎం విత్‌డ్రాలో రూ.7వేలు మోసం
పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
పలమనేరులో కార్డు చేతిలోపెట్టి ఉడాయించిన ఘనుడు
పలమనేరు: ఏటిఎంలో డబ్బు డ్రా చేసి ఇవ్వాలని ఓ మహిళ క్యూలో ముందున్న వ్యక్తికి ఏటీఎం కార్డు ఇవ్వడంతో అతను ఆమె అకౌంట్‌లోని మొత్తం సొమ్మును డ్రాచేసి మోసగించిన సంఘటన శుక్రవారం పలమనేరులో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. పట్టణంలోని కొత్తపేటకు చెందిన దాము భార్య భారతి స్థానిక బజారువీధిలోని ఏటీఎంలో రూ.1000 డబ్బు డ్రా చేసుకునేందుకు వెళ్లింది. అయితే ఏటీఎం కార్డును ఉపయోగించి డబ్బును డ్రా చేసుకునేది తెలీక క్యూలో తన ముందున్న ఓ వ్యక్తికి కార్డును ఇచ్చిన రూ.1000 డ్రాచేసి ఇవ్వాల్సిందిగా కోరింది. ఆమె కార్డును దాని వెనుకనున్న పిన్ నెంబర్‌ను తెలుసుకున్న అపరిచిత వ్యక్తి తొలుత బ్యాలెన్స్‌ను చూసి అందులో రూ.8,300 ఉండగా, 8వేలను డ్రా చేశాడు.
ఆమెకు రూ.1000, ఏటీఎం కార్డును చేతిలో పెట్టి ఏడు వేలతో అక్కడి నుంచి జారుకున్నాడు. వెంటనే ఆమె మొబైల్ ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ రావడంతో దాన్ని అక్కడే ఉన్న మరో వ్యక్తికి చూపెట్టి తన ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో చూడమని కోరింది. అయితే రూ.300 మాత్రమే బ్యాలెన్స్ అందులో ఉందని, ఎస్‌ఎంఎస్‌ను చూసిన వ్యక్తి ఆమెకు తెలిపాడు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితురాలు చుట్టుపక్కల చూసినా అపరిచిత వ్యక్తి కనిపించలేదు. దీంతో జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సాయం చేయమంటే మోసం చేశాడు
Published Sat, Feb 14 2015 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 PM
Advertisement
Advertisement