పెరిగిన రైల్వే చార్జీలు | Increased railway charges | Sakshi
Sakshi News home page

పెరిగిన రైల్వే చార్జీలు

Published Mon, Oct 7 2013 2:52 AM | Last Updated on Fri, Sep 1 2017 11:24 PM

Increased railway charges

 సాక్షి, హన్మకొండ : ఇంధన సర్దుబాటు పేరుతో రైల్వేశాఖ స్వల్పంగా ప్రయాణ చార్జీలను పెంచింది. ఈ పెంపును స్లీపర్, ఆపై ఉండే ఏసీ తరగతులకే పరిమితం చేయడంతో సామాన్యులపై కొంత భారం తగ్గింది. ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్, గరీబ్థ్,్ర రాజధాని, శతాబ్ధి, దురంతో రైళ్లకు సంబంధించి స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ, చైర్ కార్లలో ప్రస్తుతం ఉన్న టికెట్ ధరపై 2 శాతం చార్జీలను పెంచింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఈ చార్జీలు అమల్లోకి వచ్చాయి. ఇంతకు ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు పెరిగిన చార్జీ డబ్బులను ప్రయాణ సమయంలో టీసీలకు చెల్లించాల్సి ఉంటుంది.  జిల్లాలో రైలు ప్రయాణం చేస్తున్న వారిలో ఎక్కువ మంది ప్రయాణికులు ప్యాసింజర్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్ టికెట్‌పై ప్రయాణం చేసే వారు కావడంతో వీరికి చార్జీల భారం నుంచి మినహాయింపు ఉంటుంది. కానీ ఢిల్లీ, చెన్నై, తిరుపతి, షిర్డీ దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారిపై చార్జీల పెంపు భారం పడుతుంది.
 
 వరంగల్ నుంచి వివిధ ప్రాంతాలకు 
 సూపర్ ఫాస్ట్ రైళ్లకు సంబంధించి చార్జీలు
 స్లీపర్‌క్లాస్ థర్డ్‌ఏసీ రూ.లలో
 హైదరాబాద్ 165-168 505-515 
 న్యూఢిలీ 545-556 1425-1452
 చెన్నై 330-336 1200-1224
 తిరుపతి 315-321 1150-1173
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement