
కేంద్ర సంస్థలను రంగంలోకి దింపండి
డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలు దేశవ్యాప్తంగా వారి కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. వీటిని నియంత్రించడంలో రాష్ట్రస్థాయి సంస్థలు విఫలమవుతున్న నేపథ్యంలో కేంద్ర సంస్థలు రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ తయారుచేసే ముఠాలు విదేశాల నుంచి, ముఖ్యంగా జర్మనీ నుంచి ముడిసరుకును దిగుమతి చేసుకుంటున్నాయని విజయసాయిరెడ్డి తెలిపారు. మెథంపెటమైన్, కెటమైన్, ఎఫిడ్రిన్, ఆంఫెటమైన్ తదితర రూపాల్లో డ్రగ్స్‌ను ఇక్కడ సరఫరా చేస్తున్నారని వివరించారు.
డ్రగ్స్ ముఠాల మాయలో పడి పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కూడా మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 20 ప్రముఖ కార్పొరేట్ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాల యాజమాన్యాలకు సమాచారం అందినట్లు ఆయన పేర్కొన్నారు. ఇటీవలే 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి 700 యూనిట్ల ఎల్‌ఎస్‌డీ, 35 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారని వివరించారు.