ఆయిల్‌ బంకుల ఆకస్మిక సమ్మె | Indian Oil swift Strike in Andhra Pradesh | Sakshi

ఇండియన్‌ ఆయిల్‌ బంకుల ఆకస్మిక సమ్మె

Nov 3 2017 10:52 AM | Updated on Sep 3 2019 9:06 PM

Indian Oil swift Strike in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై విధించిన అదనపు వ్యాట్‌ తగ్గింపుపై జరుగుతున్న జాప్యం ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు, పెట్రో డీలర్లకు మధ్య గొడవకు దారితీసింది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) కొనుగోళ్లకు సంబంధించి అధిక టార్గెట్లను విధిస్తోందంటూ ఐవోసీ పెట్రోల్‌ బంకు డీలర్లు బుధవారం రాత్రి నుంచి ఆకస్మిక సమ్మెకు దిగారు. లక్ష్యాలకు అనుగుణంగా కొనుగోళ్లు చేయనందుకు ఐవోసీ ఒకటో తేదీన డీలర్లకు ఆయిల్‌ సరఫరా నిలిపివేసిందని, దీనికి నిరసనగా తాము ఐవోసీ పెట్రోల్‌ బంకులను మూసివేసి సమ్మెకు దిగినట్లు నారాయణ ప్రసాద్‌ తెలిపారు. రంగంలోకి దిగిన ఐవోసీ అధికారులు చర్చలు జరిపి సమస్యను పరిష్కరించడంతో సమ్మెను విరమించుకుంటున్నట్లు డీలర్లు చెప్పారు.

ఆయిల్‌ కంపెనీల సవరణలపై న్యాయపోరాటం
సాక్షి, హైదరాబాద్‌: కనీస వేతనాల చెల్లింపు, సౌకర్యాలు లేకుంటే జరిమానాల విధింపుపై ఆయిల్‌ కంపెనీలు తెచ్చిన సవరణలను సవాల్‌ చేస్తూ ఉభయ రాష్ట్రాల పెట్రోల్‌ డీలర్ల సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఇరు రాష్ట్రాలతో పాటు కేంద్రం, ఆయిల్‌ కంపెనీలను ఆదేశిస్తూ హైకోర్టు నోటీసులిచ్చింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement