లంకావీ సముద్ర జలాల్లో ఐఎన్‌ఎస్ కద్మత్
విశాఖసిటీ: లంకావీ ఇంటర్నేషనల్ మారీటైమ్ అండ్ ఏరోస్పేస్ ఎగ్జిబిషన్–2019లో పాల్గొనేందుకు భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కద్మత్ మలేషియా చేరుకుంది. లంకావీ పోర్టుకు సోమవారం చేరుకున్న కద్మత్‌కు ఆ దేశ నౌకాదళం ఘన స్వాగతం పలికింది. వరుసగా 15వ సంవత్సరం లీమా ప్రదర్శనను మలేషియా నౌకాదళం నిర్వహిస్తోంది. ఏడు రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. ప్రదర్శనలో భాగంగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కూడా నిర్వహిస్తున్నట్లు ఆ దేశ నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. 29 నౌకాదళాలకు చెందిన నౌకలు ఈ ప్రదర్శనలో పాలుపంచుకోనున్నాయి. సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలతో పాటు నౌకాదళ విన్యాసాలు, యుద్ధ విమానాల ప్రదర్శనలు, ఆయా దేశాలకు చెందిన యుద్ధ నౌకల సందర్శన, నౌకాదళ కార్యకలాపాలపై చర్చలు, సమావేశాలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment