exibition
-
‘బిగ్ సిటీస్ ఇన్ మాస్కో’.. ఫొటో ఎగ్జిబిషన్!
సాక్షి, సిటీబ్యూరో: ‘టెరిటరీ ఆఫ్ ది ఫ్యూచర్ మాస్కో 2030’లో భాగంగా మాస్కోలో ‘బిగ్ సిటీస్ ఇన్ మాస్కో’ ఫొటో ఎగ్జిబిషన్, వీడియో ఆర్ట్ కాంటెస్ట్ ‘వావ్ మాస్కో’ అనే రెండు ఈవెంట్లను నిర్వహించనున్నారు. ఈ ఎగ్జిబిషన్‌కు బ్రిక్స్ దేశాల నుంచి 14 మంది ప్రముఖ ఫొటోగ్రాఫర్లు హాజరుకానున్నారు. వీడియో ఆర్ట్ కాంటెస్ట్ వావ్ మాస్కో విజేత నగరంపై షార్ట్ ఫిల్మ్ తీయనున్నారు.ఈ ఈవెంట్‌ను ఫొటో వీసా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ఫొటోగ్రఫీ ఆర్ట్ డైరెక్టర్, అనేక అంతర్జాతీయ ఫొటోగ్రఫీ, కాంటెంపరరీ ఆర్ట్ ఎగ్జిబిషన్ల మోడరేటర్ ఇరినా చ్మిరేవా నిర్వహించనున్నారు. ఎగ్జిబిషన్‌తో పాటు ఫోరమ్ ఫెస్టివల్ అతిథులు ప్రాజెక్ట్ క్యూరేటర్, ఫొటోగ్రాఫర్లతో పబ్లిక్ లెక్చర్లు, మాస్టర్ క్లాసులు ఉంటాయి. వీరు ఫొటోగ్రఫీ విభిన్న శైలులు, సాంకేతికతలపై మాట్లాడతారు. ఎగ్జిబిషన్లో పాల్గొనే వారు మాస్కో చిత్రాలను తీసుకుంటారు. ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్లతో పాటు భారత్, చైనా, ఇండోనేíÙయా, బ్రెజిల్, రష్యా నుంచి పది మంది ఔత్సాహిక చిత్ర నిర్మాతలను మాస్కో స్వాగతించనుంది.ఫోరమ్ ఫెస్టివల్ ‘టెరిటరీ ఆఫ్ ది ఫ్యూచర్ మాస్కో 2030’ ఫ్రేమ్‌వర్క్‌లో నిర్వహించనున్న వావ్ మాస్కో వీడియో ఆర్ట్ కాంటెస్ట్‌లో వీరు ఫైనలిస్టులుగా ఉంటారు. 12 దేశాల నుంచి 294 మంది ఫైనలిస్టుల ఎంపిక జరుగుతుంది. అంతర్జాతీయ జ్యూరీ ఆగస్టు 15న వేడుకలో విజేతను నిర్ణయిస్తారు. విజేతకు బహుమతితో పాటు మాస్కో గురించి ఒక లఘు చిత్రాన్ని రూపొందించే అవకాశం ఇస్తారు. మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్‌లో భాగంగా ఈ చిత్రాన్ని ఆగస్ట్ 24న జర్యాడే పార్క్‌లోని స్మాల్ యాంఫి థియేటర్లో ప్రదర్శించనున్నారు. ఈ ఫెస్టివల్ 39 రోజుల పాటు జరగనుంది. -
నేటి నుంచి ఆర్ట్–ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్..
గచ్చిబౌలి: మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో మూడు రోజులపాటు ఆర్ట్–ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 50 మంది ప్రముఖ ఫొటోగ్రాఫర్లు రూపొందించిన ఫొటోలను ప్రదర్శిస్తారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై ఆదివారం వరకూ ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు.ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, కార్యదర్శి శృతిఓజా, సాంస్కృతిక, భాషాశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ప్రారంభిస్తారు. ఇంటరీ్మడియట్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ కంట్రోలర్, ఆర్జేడీ బి జయప్రదబాయి, ఎస్ఐవీఈ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ జ్యోష్ణారాణి పాల్గొంటారు. 10 గంటల నుంచి 6 గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. -
‘మై గ్లామ్’లో మోడళ్లు..
స్థానిక రోడ్ నెం.1లోని పాప్ అప్ స్పేస్‌లో మై గ్లామ్ ఎగ్జిబిషన్ గురువారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు నిర్వహించే ప్రదర్శనలో వజ్రాభరణాలను మోడల్స్ ధరించి ర్యాంప్‌పై తళుక్కుమన్నారు.దేశ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన డిజైనర్లు రూపొందించిన వజ్రాభరణాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు సుచరిత, మనోజ్ తెలిపారు. – బంజారాహిల్స్ఇవి చదవండి: బస్కింగ్.. జోష్! -
నుమాయిష్ డ్రోన్ విజువల్స్
-
లక్కీఛాన్స్ ! ఫ్రీగా విమాన టిక్కెట్లు పొందే అవకాశం
దుబాయ్‌లో జరుగుతున్న ఎక్స్‌ప్లో 2020 షోకి హాజరయ్యే వారికి ఎయిర్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఎక్స్‌ప్లోలో ఇండియన్ పెవిలియన్‌కి హాజరయ్యే వారికి రౌండ్ ట్రిప్ విమాన టిక్కెట్లు ఫ్రీగా ఆఫర్ చేస్తోంది. ఎక్స్‌ప్లో 2020కి సంబంధించి ఇండియన్ పెవిలియన్‌కి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. దుబాయ్‌లో ఎక్స్‌ప్లో 2020 అంగరంగ వైభవంగా జరుగుతోంది. గడిచిన 50 రోజుల్లో జుమారు 3.50 లక్షల మంది ఈ ఎక్స్‌ప్లోను సందర్శించారు. ఇండియా నుంచి కూడా ఎంట్రప్యూనర్లు, స్టార్టప్‌లు పెట్టిన వారు ఇందులో పాల్గొంటున్నారు. దీంతో ఇండియా నుంచి దుబాయ్‌కి ప్రయాణాలు పెరిగాయి. ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించి ఇండియన్ పెవిలియన్ చేరుకున్న వారు తమ బోర్డింగ్ పాసులను అక్కడే ఏర్పాటు చేసిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (ఏఐఈ)కియోస్క్‌లో వేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రతీ నెల లక్కీ డ్రా తీసి ఇద్దరు విజేతలకు ఫ్రీ విమాన ప్రయాణాన్ని ఆఫర్ ఏఐఈ చేస్తోంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లక్కీడ్రాలో విజేతలు ఇండియాలో ఈ రెండు నగరాల మధ్య అయినా ఉచితంగా ఒకసారి ప్రయాణం చేయవచ్చు. అయితే ఆ నగరాల మధ్య ఏఐఈ సర్వీసులు ఉండాలనే కండీషన్‌ను విధించింది. దుబాయ్ ఎక్స్‌ప్లో మొత్తం పన్నెండు అంశాలతో ఇండియన్ పెవిలియన్ ఏర్పాటు చేశారు. -
ఇండియాలో ఫ్లైయింగ్ కారు... వచ్చేది ఎప్పుడంటే ?
సాక్షి, వెబ్‌డెస్క్: దేశమంతటా ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంటే అందుకు భిన్నంగా ఏకంగా ఆకాశంలో ఎగిరే కారు తయారీలో బిజీగా ఉన్నాయి స్టార్టప్ కంపెనీలు. అందులో ఇండియాకి చెందిన ఓ కంపెనీ అయితే అక్టోబరులో తమ తొలి మోడల్ కారును ప్రదర్శనకు సిద్ధం చేస్తోంది. అక్టోబరు 5 కల్లా సిద్ధం చెన్నై బేస్డ్ వినత ఎయిరో మొబిలిటీ కంపెనీ ఎగిరే కార్ల తయారీలో మరో కీలక ఘట్టాన్ని దాటేసింది. ఎగిరే కారు కాన్సెప్టుకు సంబంధించి పూర్తి డిజైన్ని పూర్తి చేసింది. ఇప్పుడు కారు నిర్మాణ పనుల్లో బిజీగా ఉంది. అన్నీ అనుకూలిస్తే 2021 అక్టోబరు 5న లండన్‌లో జరిగే హెలిటెక్ ఎగ్జిబిషన్లో ఈ కారు దర్శనం ఇవ్వనుంది. ఇద్దరు ప్యాసింజర్లు వినత ఎయిరో మొబిలిటీ రూపొందిస్తోన్న ఫ్లైయింగ్ కారు బరువు 1100 కేజీలు ఉంటుంది. మొత్తంగా 1300 కేజీల బరువును మోయగలదు. ఇందులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించే వీలుంటుంది. వర్టికల్‌గా టేకాఫ్ ల్యాండింగ్ అవడం ఈ ఫ్లైయింగ్ కారు ప్రత్యేకత. ఈ కారులో హైబ్రిడ్ ఇంజన్ ఏర్పాటు చేస్తున్నారు. కారు ఎగిరేందుకు బయో ప్యూయల్ని ఉపయోగించుకుంటుంది. అదే విధంగా సందర్భాన్ని బట్టి ఎలక్ట్రిక్ ఎనర్జీని కూడా వాడుకుంటుంది. 3,000 అడుగుల వరకు ఈ కారు పైకి ఎగిరేందుకు కో యాక్సియల్ క్వాడ రోటర్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కారు ప్యానెల్లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నట్టు కంపెనీ చెబుతోంది. ఈ కారు నేల నుంచి 3,000 అడుగుల ఎత్తు వరకు ప్రయాణించగలదు. ఒక్క సారి ఫ్యూయల్ నింపితే వంద కిలోమీటర్లు లేదా గంట సేపు ప్రయాణం చేయగలదు. అత్యధిక వేగం గంటకు 120 కిలోమీటర్లుగా ఉంది. ఫస్ట్ ఏషియన్ ఇప్పటి వరకు ఫ్లైయింగ్ కార్లకు సంబంధించి యూరప్, అమెరికా కంపెనీలదే పై చేయిగా ఉంది. ఏషియా నుంచి హ్యుందాయ్ సంస్థ కూడా ఫ్లైయింగ్ కారు టెక్నాలజీపై పరిశోధనలు చేస్తోంది. అయితే డిజైన్ పూర్తి చేసి అక్టోబరు కల్లా ప్రోటోటైప్ సిద్ధం చేసిన మొదటి ఏషియా కంపెనీగా రికార్డు సృష్టించేందుకు వినత సిద్ధమవుతోంది. -
సీఎం వైఎస్ జగన్ పెన్సిల్ స్కెచ్ ఎగ్జిబిషన్
-
లీమా–2019లో ‘ఐఎన్ఎస్ కద్మత్’
విశాఖసిటీ: లంకావీ ఇంటర్నేషనల్ మారీటైమ్ అండ్ ఏరోస్పేస్ ఎగ్జిబిషన్–2019లో పాల్గొనేందుకు భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ కద్మత్ మలేషియా చేరుకుంది. లంకావీ పోర్టుకు సోమవారం చేరుకున్న కద్మత్‌కు ఆ దేశ నౌకాదళం ఘన స్వాగతం పలికింది. వరుసగా 15వ సంవత్సరం లీమా ప్రదర్శనను మలేషియా నౌకాదళం నిర్వహిస్తోంది. ఏడు రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. ప్రదర్శనలో భాగంగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కూడా నిర్వహిస్తున్నట్లు ఆ దేశ నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. 29 నౌకాదళాలకు చెందిన నౌకలు ఈ ప్రదర్శనలో పాలుపంచుకోనున్నాయి. సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలతో పాటు నౌకాదళ విన్యాసాలు, యుద్ధ విమానాల ప్రదర్శనలు, ఆయా దేశాలకు చెందిన యుద్ధ నౌకల సందర్శన, నౌకాదళ కార్యకలాపాలపై చర్చలు, సమావేశాలు జరగనున్నాయి. -
20 శవాలతో ఎగ్జిబిషన్
-
శవాలతో ఎగ్జిబిషన్
సిడ్ని : ఈ ఎగ్జిబిషన్‌లోకి అడుగు పెట్టగానే మనషుల శవాలు స్వాగతం పలుకుతాయి. శరీర భాగాలు మిమ్మల్ని భయపెడతాయి. మన శరీరం లోపలి నిర్మాణం ఎలా ఉంటుంది. అవయవాలు ఎలా పనిచేస్తాయి. ఏ పని చేసినపుడు ఏ కండరం కదులుతుంది. ఇలా ఒకటేమిటి ఎన్నో విషయాలు అక్కడ తెలుసుకోవచ్చు. ఏకంగా 20 శవాలు, 200లకు పైగా విడి శరీర భాగాలను ప్రదర్శనలో ఉంచారు. సిడ్నీ నగరంలో మనషుల శవాలతో, శరీర భాగాలతో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. మనిషి శరీర భాగాల పనితీరు ఎలా ఉంటుందన్న దానిపై ఓ అవగాహన కల్పించడమే ఈ ప్రదర్శన ముఖ్య ఉద్ధేశమని నిర్వాహకులు తెలిపారు. డాక్టర్లు చెప్పిన శవాల సంగతులు.. ఈ ప్రదర్శనలో ఉంచిన శవాలను చక్కగా తీర్చిదిద్దిన డాక్టర్లు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అసలు ఆ శవాలు ఇష్టపూర్వకంగా ప్రదర్శనకు ఇచ్చినవి కావని, అవి చైనాకు చెందిన ఓ నిషేధిత ఫాలున్ గాంగ్ తెగకు చెందినవిగా భావిస్తున్నట్లు వారు తెలిపారు. వారందరూ మరణ శిక్ష విధించబడిన ఖైదీలు అయ్యిండొచ్చన్నారు. వారిని తీవ్రంగా హింసించడం వల్లే వారు మరణించారని తెలిపారు. ప్రదర్శన నిర్వాహకుడు టామ్ జాలర్ మాట్లాడుతూ.. శవాలకు సంబంధించిన విషయంలో ఎలాంటి తప్పు జరగలేదని, సహజంగా మరణించిన వారి శవాలను మాత్రమే ప్రదర్శనకు ఉంచినట్లు చెప్పారు. ఏది ఏమైనప్పటికి ఈ శవాల ప్రదర్శనను చూడ్డానికి ప్రజలు మాత్రం చాలా ఆసక్తి చూపుతున్నారు. -
బుద్ధుని జాతక కథల చిత్ర ప్రదర్శన
విజయపురి సౌత్: స్థానిక లాంచీస్టేషన్లో శుక్రవారం జిల్లా సోషల్ వెల్ఫేర్ జాయింట్ కలెక్టర్, టూరిజం ఇన్చార్జి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అమరావతి బుద్ధ విగ్రహం రూపకర్త రేగుళ్ల మల్లికార్జునరావు బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించి ఆయన గీసిన చిత్రాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల సంవత్సరాల కిందట ఏ ఆంధ్రప్రదేశలో బౌద్ధం పరిఢవిల్లిందని చెప్పారు. అప్పట్లోనే అమరావతిలోని బౌద్ధ స్థూపంపై ఆంధ్రులు బుద్దుని జీవిత కథలు, జాతక కథలు, ఆనాటి మానవ జీవనానికి సంబంధించిన శిల్పాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆంధ్రా శిల్పుల గొప్పతనం గురించి వారు చెక్కిన శిల్పాలను చిత్రాలుగా గీసి ఇప్పటికే సింగపూర్, చైనా, భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో 75 ప్రదర్శనలు ఇచ్చినట్లు తెలిపారు. లాంచీస్టేషన్లో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను పలువురు పర్యాటకులు ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో లాంచీ యూనిట్ మేనేజర్ వి.సూర్యచందర్‌రావు, సిబ్బంది ఉన్నారు. -
ప్రాధాన్యతా రంగాలపై త్వరలో ఎగ్జిబిషన్
ఏలూరు (మెట్రో) జిల్లాలో రైతులకు ఉపయోగపడే విధంగా ప్రాధాన్యతా రంగాల శాఖలతో డిసెంబరు నెలలో భారీ ఎత్తున ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆనపు జాయింట్ కలెక్టర్ షరీఫ్ చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో బుధవారం వ్యవసాయం, మత్స్యశాఖ, ఉద్యానవనశాఖ, పశుసంవర్ధక శాఖ, ఏపి డైయిరీ, మార్కెటింగ్ ప్రాధాన్యతా రంగాల అధికారులతో ఎజెసి షరీఫ్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రైతులందరికీ అందుబాటులో ఉండే ప్రాంతంలో వ్యవసాయ, ఉద్యానవనం, మత్స్యశాఖ రైతులకు ఉపయోగపడే విధంగా ఉపకరణాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి వివిధ కంపెనీలను భాగస్వాములను చేయనున్నట్లు చెప్పారు. కంపెనీలు ఎగ్జిబిషన్లో వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, స్ప్రేయర్లు వంటివి ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన స్టాల్స్ ఏర్పాటు చేసి అందించనున్నట్లు చెప్పారు. అధికారులు కిందిస్థాయి సిబ్బందికి సమావేశాలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయికి వెళ్లి రైతులకు అవసమరైన సహాయ సహకారాలు సూచనలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయి అధికారులు కూడా తరచూ క్షేత్రస్థాయికి వెళ్లి రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి సూచనలు అందించాలన్నారు. ఈ సమావేశంలో సిపిఒ డిడీ సాంబశివరావు, వ్యవసాయశాఖ జెడి సాయిలక్ష్మీశ్వరి, పశుసంవర్ధకశాఖ జెడి జ్ఞానేశ్వర్, ఫిషరీస్ డిడి జాకబ్ భాషా, ఉద్యానవనశాఖ ఎడిలు విజయలక్ష్మి, దుర్గేష్, మార్కెఫెడ్ జిల్లా మేనేజరు నాగమల్లిక పాల్గొన్నారు. -
గురువుల సామర్థ్యాల ప్రదర్శన
ఏలూరు సిటీ : జిల్లా వ్యాప్తంగా టీచర్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం) ప్రదర్శనను జిల్లావిద్యాశాఖ శుక్రవారం చేపట్టింది. అన్ని మండల కేంద్రాల్లో టీఎల్ఎం ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆయా మండలాల పరిధిలోని జెడ్పీ, మండలపరిషత్, ప్రభుత్వ, మునిసిపల్, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులంతా తాము బోధించే పాఠ్యాంశాలకు సంబంధించి టీఎల్ఎంలను తయారు చేసి ఈ ప్రదర్శనల్లో ఉంచారు. ఏలూరు మండలానికి సంబంధించి అర్భన్ స్కూల్స్‌కు స్థానిక ఎన్‌ఆర్‌పేటలోని సెయింట్ థెరిస్సా బాలికోన్నత పాఠశాల, రూరల్ స్కూల్స్ సత్రంపాడు, శనివారపుపేట జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఏలూరు ఉప విద్యాధికారి డి.ఉదయ్‌కుమార్ టీఎల్ఎం ప్రదర్శనలను పర్యవేక్షించగా, జిల్లా విద్యాధికారి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి టీఎల్ఎం ప్రదర్శనలు పరిశీలించారు. విద్యార్థికి అర్థమయ్యేలా వినూత్నమైన అంశాలతో ప్రాజెక్టులు తయారు చేయాలని అధికారులు ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఈ టీఎల్ఎం ప్రదర్శనల్లో వినూత్నమైన ప్రాజెక్టుల జాడ కన్పించలేదు. ఇటీవల కాలంలో ప్రభుత్వ ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తూ ఉపాధ్యాయులపై పనిభారాన్ని విపరీతంగా పెంచేయటంతో టీచర్లపై ఒత్తిడి పెరగడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. -
‘జాతీయ స్థాయి’కి సాత్విక్
మద్దిరాల (చిలకలూరిపేట రూరల్): తుపాకులతో టెర్రరిస్టులను మాత్రమే చంపవచ్చు, విలువలతో కూడిన విద్యతో టెర్రరిజాన్ని రూపుమాపవచ్చు. నేటి విద్యావిధానంలో విలువలకు తక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులు కూడా టెర్రరిస్టులుగా మారుతున్నారు. మహాత్మాగాంధీ స్వాతంత్య్రం కోసం అహింసా విధానాన్ని పాటించారు. పెన్ను, పుస్తకం, ఉపాధ్యాయుడితో కలిసి టెర్రరిజాన్ని రూపుమాపవచ్చని ఇటీవల నోబుల్ బహుమతి పొందిన మలాలా యూసఫ్ జాయ్ ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని కేంద్రీయ విద్యాలయమైన జవహర్ నవోదయకు చెందిన విద్యార్థి సాత్విక్ ప్రదర్శించిన ఎగ్జిబిషన్ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో జరిగిన క్లస్టర్ పోటీల్లో విజేతగా, ఆంధ్ర, కేరళ, కర్ణాటక, తెలంగాణ, పాండిచ్చేరి ఐదు రాష్ట్రాల విద్యార్థులకు రీజనల్ స్థాయిలో సైతం విజేతగా నిలిచాడు. త్వరలో జాతీయస్థాయిలో నిర్వహించే పోటీలకు ఎంపికయ్యాడు.మండలంలోని మద్దిరాల గ్రామంలో నవోదయ పాఠశాలలో సీహెచ్ సాత్విక్ పదోతరగతి విద్యను అభ్యసిస్తున్నాడు. ఈనెల 18, 19వ తేదీలలో శ్రీకాకుళంలో జరిగిన క్లష్టర్ పోటీల్లో, 23,24 తేదీలలో తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో నిర్వహించిన రీజనల్ పోటీల్లో పాల్గొన్నాడు. రెండు పోటీలను సోషల్ సైన్స్ విభాగంలో అధ్యాపకుడు బ్రహ్మానందరెడ్డి సూచనలు, సలహాలతో ఎగ్జిబిషన్‌ను ప్రదర్శించి ప్రతిభను కనబరచాడు. వ్యవసాయ కూలీ కుటుంబంలో మెరిసిన విద్యార్థి.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఆరవ తరగతి ప్రవేశానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణుడై 2012–13 విద్యా సంవత్సరంలో జిల్లాలోని పెదకాకాని మండలం తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన అనుదీప్– శాంతి దంపతుల కుమారుడు సీహెచ్ సాత్విక్ ప్రవేశం పొందాడు. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సాత్విక్‌ను ప్రిన్సిపాల్ ఎన్‌వీడీ విజయకుమారి జ్ఞాపిక, సర్టిఫికెట్లను అందించారు. డిప్యూటీ ప్రిన్సిపాల్ రాఘవయ్య, అధ్యాపకుడు బ్రహ్మానందరెడ్డి, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. -
రాయల్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్
నరసరావుపేట ఈస్ట్: సర్వ సంస్కతుల సమ్మెళనం భారతదేశం. ఆయా సంస్కృతులను ప్రతిబింబించేలా వివిధ ప్రాంత ప్రజలు వినియోగించే వస్తువులను రాయల్ ఎగ్జిబిషన్ క్రాఫ్ట్ బజార్ ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ ప్రజలకు అందుబాటులో ఉంచింది. పట్టణంలోని ఎస్ఎస్అండ్ ఎన్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లో పలు వస్తువులు స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కాశ్మీర్‌నుంచి కన్యాకుమారి వరకు వివిధ ప్రజలు వినియోగించే దాదాపు 50 వేల రకాల వస్తువులను ఎగ్జిబిషన్లో ఉంచారు. హైదరాబాద్ మంచి ముత్యాలు, నాగాలాండ్ డ్రై ప్లవర్స్, బెంగాళి (కలకత్తా) చీరలు, మైసూర్ రోజ్ వుడ్ సామాగ్రి, టెర్రికోట మట్టిబొమ్మలు, ఢిల్లీ రెడీమెడ్ వస్త్రాలు ఇలా పలు వస్తువులు ధరల్లో లభ్యమవుతుండటంతో ఈ క్రాప్ట్ బజార్‌కు విశేష ప్రజాదరణ వస్తోంది. వై.వెంకటేశ్వరెడ్డి, వై.శ్రీనివాసరెడ్డి సమిష్టి కృషితో రెండేళ్ల క్రితం నుంచి ఈ రాయల్ క్రాఫ్ట్ బజార్ ఏర్పాటైంది. -
విశాఖలో అంతర్జాతీయ సాగర ఉత్పత్తుల ప్రదర్శన
సాక్షి, విశాఖపట్నం :విశాఖ నగరం మరో అంతర్జాతీయ కార్యక్రమానికి వేదికవుతోంది. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివద్ధి సంస్థ (ఎంపెడా) భారత సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్‌తో కలిసి వచ్చే నెల 23 నుంచి 25 వరకు అంతర్జాతీయ సీఫుడ్ షోను నిర్వహించనుంది. నగరంలోని పోర్టు డైమండ్ జూబ్లీ స్టేడియంలో ఈ ప్రదర్శన జరగనుంది. విశాఖలో 2001లో తొలిసారి సీఫుడ్ షో జరిగిందని, 15 ఏళ్ల తర్వాత మళ్లీ వచ్చే నెలలో నిర్వహిస్తున్నామని ఎంపెడా చైర్మన్ ఎ.జయాతిలక్ తెలిపారు. శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇది ఆసియాలోనే అతి పెద్ద సీఫుడ్ షో అని చెప్పారు. సుమారు 65 విదేశీ సంస్థల ప్రతినిధులు పాల్గొనే ఈ ప్రదర్శనలో సీఫుడ్ ప్రాసెసింగ్ యంత్రాల తయారీదారులు, సర్టిఫికేషన్లు, ప్రాసెసింగ్ ఇంగ్రీడియెంట్లు, కోల్డుచైన్ సిస్టంలు, లాజిస్టిక్స్, సీఫుడ్ పరిశ్రమ భాగస్వాముల యంత్ర, వస్తు సామగ్రి ప్రదర్శిస్తారని తెలిపారు. భారత మత్స్య పరిశ్రమ ఉత్పత్తి, శక్తి సామర్థ్యాలను ప్రపంచ దేశాలకు తెలియజేయడం ఈ షో లక్ష్యమన్నారు. దేశంలో పాటించే భద్రతతో కూడిన సుస్థిర ఆక్వా కల్చర్, సముద్ర మత్స్యపరిశ్రమలో సాంకేతికాభివద్ధి, సుస్థిర వేట, మత్స్యకారులు, ఆక్వా రైతులు, సీఫుడ్ ఎగుమతిదార్లు పాటించే విధానాలను తెలియజేస్తారని చెప్పారు. ఎగుమతుల విలువ రెట్టింపు! ప్రస్తుత ఎగుమతుల ఫలితాలను బట్టి భారత విలువ ఆధారిత మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల విలువ రెండింతలు పెరిగే అవకాశం ఉందని ఎంపెడా చైర్మన్ తెలిపారు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.30,420.83 కోట్ల (4.7 బిలియన్ డాలర్ల) విలువైన 9,45,892 టన్నుల మత్స్య ఉత్పత్తులు మన దేశం నుంచి ఎగుమతి చేశామన్నారు. 2020 నాటికి భారత సముద్ర, ఆక్వా కల్చర్ ఉత్పత్తుల ఎగుమతుల టర్నోవర్ 10 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో ఎల్–వెనామీ రొయ్య కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. భారత సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏఐ) జాతీయ అధ్యక్షుడు వి.పద్మనాభం మాట్లాడుతూ సెప్టెంబర్‌లో జరిగే సీఫుడ్ షోకు ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించామన్నారు. సమావేశంలో ఎంపెడా కార్యదర్శి బి.శ్రీకుమార్, ఎస్ఈఏఐ సెక్రటరీ జనరల్ ఇలియాస్ సేట్, ట్రెజరర్ కె.జి.లారెన్స్ పాల్గొన్నారు. -
సేవ కోసం సరికొత్తగా...