’వావ్ మాస్కో’ వీడియో ఆర్ట్ కాంటెస్ట్ కూడా...
హాజరుకానున్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన 14 మంది ఫొటోగ్రాఫర్లు
సాక్షి, సిటీబ్యూరో: ‘టెరిటరీ ఆఫ్ ది ఫ్యూచర్ మాస్కో 2030’లో భాగంగా మాస్కోలో ‘బిగ్ సిటీస్ ఇన్ మాస్కో’ ఫొటో ఎగ్జిబిషన్, వీడియో ఆర్ట్ కాంటెస్ట్ ‘వావ్ మాస్కో’ అనే రెండు ఈవెంట్లను నిర్వహించనున్నారు. ఈ ఎగ్జిబిషన్‌కు బ్రిక్స్ దేశాల నుంచి 14 మంది ప్రముఖ ఫొటోగ్రాఫర్‌లు హాజరుకానున్నారు. వీడియో ఆర్ట్ కాంటెస్ట్ వావ్ మాస్కో విజేత నగరంపై షార్ట్ ఫిల్మ్ తీయనున్నారు.
ఈ ఈవెంట్‌ను ఫొటో వీసా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ఫొటోగ్రఫీ ఆర్ట్ డైరెక్టర్, అనేక అంతర్జాతీయ ఫొటోగ్రఫీ, కాంటెంపరరీ ఆర్ట్ ఎగ్జిబిషన్‌ల మోడరేటర్ ఇరినా చ్మిరేవా నిర్వహించనున్నారు. ఎగ్జిబిషన్‌తో పాటు ఫోరమ్ ఫెస్టివల్ అతిథులు ప్రాజెక్ట్ క్యూరేటర్, ఫొటోగ్రాఫర్‌లతో పబ్లిక్ లెక్చర్లు, మాస్టర్ క్లాసులు ఉంటాయి. వీరు ఫొటోగ్రఫీ విభిన్న శైలులు, సాంకేతికతలపై మాట్లాడతారు. ఎగ్జిబిషన్‌లో పాల్గొనే వారు మాస్కో చిత్రాలను తీసుకుంటారు. ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్‌లతో పాటు భారత్, చైనా, ఇండోనేíÙయా, బ్రెజిల్, రష్యా నుంచి పది మంది ఔత్సాహిక చిత్ర నిర్మాతలను మాస్కో స్వాగతించనుంది.
ఫోరమ్ ఫెస్టివల్ ‘టెరిటరీ ఆఫ్ ది ఫ్యూచర్ మాస్కో 2030’ ఫ్రేమ్‌వర్క్‌లో నిర్వహించనున్న వావ్ మాస్కో వీడియో ఆర్ట్ కాంటెస్ట్‌లో వీరు ఫైనలిస్టులుగా ఉంటారు. 12 దేశాల నుంచి 294 మంది ఫైనలిస్టుల ఎంపిక జరుగుతుంది. అంతర్జాతీయ జ్యూరీ ఆగస్టు 15న వేడుకలో విజేతను నిర్ణయిస్తారు. విజేతకు బహుమతితో పాటు మాస్కో గురించి ఒక లఘు చిత్రాన్ని రూపొందించే అవకాశం ఇస్తారు. మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్‌లో భాగంగా ఈ చిత్రాన్ని ఆగస్ట్ 24న జర్యాడే పార్క్‌లోని స్మాల్ యాంఫి థియేటర్‌లో ప్రదర్శించనున్నారు. ఈ ఫెస్టివల్ 39 రోజుల పాటు జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment