సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో ఆదివారం జరుగనున్న తెలంగాణ సకల జనభేరి బహిరంగ సభకు ఇందూరు నుంచి భారీగా తెలంగాణవాదులు తరలివెళ్లనున్నారు. జనాల తరలింపునకు తెలంగాణ జేఏసీ భాగస్వామ్యపక్షాలు సన్నాహాలు పూర్తి చేశాయి. ఇందులో టీఆర్‌ఎస్ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. పది రోజులుగా జిల్లా రాజకీయ జేఏసీ భాగస్వామి పక్షాలు, తెలంగాణ వాదులు విస్తృత ప్రచార కార్యక్రమాలతో పాటు సభలు, సమావేశాలు నిర్వహించారు. ఈ నేపథ్యం లోనే జిల్లా నుంచి 25 వేల మందిని జనభేరి సభకు తరలించనున్నారు. నిజామాబాద్ నగరంలో వారం రోజుల వ్యవధిలో జనభేరి బహిరంగ సభ విజయవంతం కోసం రెండు సన్నాహాక సభలు నిర్వహించగా టీఎన్‌జీఓఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రతిని ధులు అద్దంకి దయాకర్, ప్రముఖ కళాకారుడు రసమ యి బాలకిషన్‌తో పాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు హాజరయ్యారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, సమావేశాలు, ఆందోళనలు, మానవహారాల తో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించి ప్రచారం చేశారు.
టీఆర్‌ఎస్‌తో సహా ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, కార్మిక, ప్రజా సంఘాలు, అన్ని జేఏసీలు జనభేరి జయప్రదం కోసం పలు కార్యక్రమాలు చేపట్టా యి. మరోవైపు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీని వాసరెడ్డి,ఏనుగు రవీందర్‌రెడ్డి, గంప గోవర్ధన్, నియోజకవర్గం ఇన్‌చార్జులు బస్వా లక్ష్మీనర్సయ్య, ఎ జీవన్‌రెడ్డి, భూపతిరెడ్డి, సురేందర్‌రెడ్డి, బంగారు నవనీతల తోపాటు పార్టీ జిల్లా ఇన్‌చార్జి కరిమిళ్ల బాబూరావులు జనసమీకరణ కోసం విస్తృతంగా జిల్లాలో పర్యటిం చారు. న్యూడెమోక్రసీతో పాటు ఉద్యోగ, విద్యార్థి, జేఏ సీ ప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహిం చారు. సకల జనభేరి సభకు ప్రజలను తరలించడానికి 385 వాహనాలను టీఆర్‌ఎస్ జిల్లా నాయకత్వం సమకూర్చింది. జిల్లా నుంచి జనాన్ని సమీకరించేందుకు ఇన్‌చార్జి బాధ్యతలను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డికి పార్టీ అధినేత కేసీఆర్ అప్పగించారు. పోచారం జనసమీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు.
నిజామాబాద్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌చార్జులు, ఎమ్మెల్యేలతో పాటు టీజాక్ ప్రతినిధులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల నుంచి నాలుగు వేల మంది, ఇతర నియోజకవర్గాల నుంచి 15 వందల మందిని హైదరాబాద్ సభకు తరలించటానికి ఏర్పా ట్లు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నియోజకవర్గ ఇన్‌చార్జులు వాహనాలను సమకూర్చుకోవడంతో పా టు సభకు తరలివచ్చే ప్రజలకు అన్ని విధాల సౌకర్యాలను కల్పించే బాధ్యతలను తీసుకున్నట్టు తెలుస్తోం ది. జనసమీకరణలో ఇన్‌చార్జులు పోటీపడుతున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చసాగుతోంది. నియోజక వర్గాల వారీ గా 40 వాహనాలకు తగ్గకుండా ఏర్పాటు చేయటంతోపాటు అవసరాన్ని బట్టి అదనంగా టాటాసుమోలు, తుఫాన్ వంటి వాహనాలను అందుబాటులో ఉంచుతున్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు ప్రస్తుతం కీలక సమయం కావటం వల్లనే సకల జనసభను టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
అదేవిధంగా టీజేఏసీకి అదనంగా 25 వాహనాలను సమకూర్చారు. ఈ వాహనాల్లో ప్రధానంగా ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తరలి వెళ్లనున్నారు. ఈ మేరకు టీఆర్‌ఎస్ నుం చి 20 వేల మంది, తెలంగాణ జేఏసీతోపాటు న్యూడెమోక్రసీ, సీపీఐలు కలసి ఐదువేల మందిని హైదరాబాద్‌కు తరలించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. టీజేఏసీలో భాగస్వామ్యపక్షమైన భారతీయ జనతాపార్టీ కూడా హైదరాబాద్‌కు జనసమీకరణపై దృష్టిసారిం చినట్టు ఆపార్టీ వర్గాలు తెలిపాయి. తెలుగుదేశం పార్టీ కూడా జనభేరికి మద్దతు ప్రకటించినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
సకల జన భేరికి కదులుతున్న ఇందూరు
Published Sun, Sep 29 2013 4:59 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
Advertisement
Advertisement