పాలకుల విధానాలతోనే అసమానతలు | inequality caused by government policies, says palagummi sainath | Sakshi
Sakshi News home page

పాలకుల విధానాలతోనే అసమానతలు

Published Sat, Aug 2 2014 12:42 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

పాలకుల విధానాలతోనే అసమానతలు - Sakshi

పాలకుల విధానాలతోనే అసమానతలు

ప్రముఖ జర్నలిస్ట్ పాలగుమ్మి సాయినాథ్

వరంగల్: ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల సమాజ ంలో అసమానతలు పెరిగిపోతున్నాయని ప్రముఖ జర్నలిస్ట్ పాలగుమ్మి సాయినాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన ఐదు దశాబ్దాల కంటే.. ఈ రెండు దశాబ్దాల్లోనే ఇది మరింత వేగం పుంజుకున్నదన్నారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ 8వ మహాసభల సందర్భంగా హన్మకొండలో శుక్రవారం రాత్రి ‘వ్యవసాయరంగం- ప్రపంచీకరణ’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్‌లో ఆయన ప్రసంగించారు. ప్రజల నుంచి నీటిని దొంగిలించే కుట్రలు సాగుతున్నాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టు.. ఆయకట్టు పెంచేందుకు కాదని, అక్కడ పరిశ్రమల ఏర్పాటు, సెజ్‌ల నిర్మాణం సాగుతుందన్నారు. రానున్న రోజుల్లో మంచినీరు ఒక మార్కెట్‌గా మారనున్నదన్నారు.   

సామాన్యునికి భద్రత కరువు: షీలాభల్లా

దేశంలో సామాన్యుని జీవనానికి భద్రత కరువైందని వ్యవసాయ శాస్త్రవేత్త షీలాభల్లా ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో స్థూల ఉత్పత్తి పెరుగుతున్నా ఉపాధి అవకాశాలు పెరగడంలేదన్నారు.

దళితులకు ప్రపంచీకరణ చేటు: రాఘవులు

ప్రపంచీకరణ ఫలితంగా దళితులు తీవ్రంగా నష్టపోతున్నారని సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవడంతో ప్రైవేటీకరణ పెరుగుతున్నదని, రానున్న రోజుల్లో ప్రభుత్వ భూమి ఉండకపోవచ్చన్నారు. చంద్రబాబు, కేసీఆర్ ఒకే వర్గానికి చెందిన వారన్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement