గూడూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా వైస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ జైల్లో చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా గూడూరులో జాతీయరహదారిపై పొటుపాళెం క్రాస్‌రోడ్డు వద్ద ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చెంతాటి బాలచెన్నయ్య, నాయకుడు శ్రీకిరెడ్డి భాస్కర్‌రెడ్డి నాలుగు రోజులు గా చేపట్టిన ఆమరణదీక్షను పోలీసులు గురువారం భగ్నం చేశారు.
వైద్యులు వచ్చి వారిని పరీక్షించి పల్స్, సుగర్ స్థాయి పడిపోయినట్టు ధ్రువీకరించారు. రూరల్ సీఐ వేమారెడ్డి, ఎస్‌ఐలు నాగేశ్వరరావు, దశరథరామారావు, మారుతీకృష్ణ తమ సిబ్బందితో దీక్షా శిబిరం వద్దకు అంబులెన్స్‌ను తీసుకొచ్చారు. ఒక్కసారిగా బాలచెన్నయ్య, భాస్కర్‌రెడ్డిని అంబులెన్స్‌లోకి ఎక్కించారు.
వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు వారిని బలవంతంగా నెట్టి గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. బాలచెన్నయ్య, భాస్కర్‌రెడ్డికి బలవంతంగా చికిత్స అందించారు. అనంతరం వారిని నెల్లూరుకు తరలించారు. అంతకు ముందు బాలచెన్నయ్యకు వైఎస్సార్‌సీపీ నేత నేదురుమల్లి పద్మనాభరెడ్డి, దొరవారి సత్రం పీఏసీఎస్ అధ్యక్షుడు బాలచంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు.
బాలచెన్నయ్య దీక్ష భగ్నం
Published Fri, Aug 30 2013 4:37 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM
Advertisement
Advertisement