ఉన్నత విద్యాసంస్థలపై ‘హెచ్‌ఆర్‌డీ’ సర్వే | Institutions of higher education on the 'HRD' Survey | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్యాసంస్థలపై ‘హెచ్‌ఆర్‌డీ’ సర్వే

Published Sun, Sep 7 2014 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM

Institutions of higher education on the 'HRD' Survey

నవంబర్ 30 లోగా వివరాలివ్వాలని సూచన
 
హైదరాబాద్: ఉన్నత విద్యాసంస్థల స్థితిగతులపై కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ జాతీయ స్థారుులో ప్రత్యేక సర్వే చేపట్టింది. 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించిన సర్వేను గత జూన్ 17 నుంచి ప్రారంభించింది. ‘అఖిల భారత ఉన్నత విద్యా సర్వే’ పేరుతో నిర్వహించే ఈ సర్వే ఆన్‌లైన్‌లో జరుగుతోంది. నవంబర్ 30వ తేదీలోగా కాలేజీలు ఉన్నత విద్యారంగానికి సంబంధించిన విధాన నిర్ణయాలు, విద్యారంగంలో పరిశోధన,తదితర సమాచారం ఉపకరిస్తుందని మానవవనరుల శాఖ పేర్కొంది. ఉన్నత విద్యాసంస్థల సర్వేలో 2012-13 విద్యాసంవత్సరంలో ఏపీ నుంచి కొన్ని సంస్థలే సమాచారాన్ని పోర్టల్‌లో పొందుపరిచాయి. 47వర్సిటీలకు గాను 26 మాత్రమే  స్పందించాయి.

4814 కాలేజీలకు 37 శాతమే సమాచారాన్ని ఇచ్చాయి. 1784 కాలేజీలు మానవ వనరుల శాఖకు అందించారుు. సాంకేతిక విద్య కాలేజీలు, టీచర్ ట్రైనింగ్ సంస్థలు, నర్సింగ్, పీజీడీఎం సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాతీయ విద్యాసంస్థలు అరకొరగా స్పందించారుు. ఈ కేటగిరీలో 1,366 సంస్థలుండగా 243 స్పందించారుు. 191 సాంకేతిక విద్యా కాలేజీల్లో 23 మాత్రమే  అప్‌లోడ్ చేశాయి. 480 టీచర్ ట్రైనిం గ్ సంస్థల్లో 112  స్పందించాయి. నర్సింగ్ కాలేజీల్లో 654కిగాను 112 వివరాలిచ్చాయి. పీజీడీఎం సంస్థలు 31, జాతీయ విద్యా సంస్థలు 10 ఉండగా ఒక్కటి కూడా సమాచారాన్ని ఇవ్వలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement