All India survey on higher education
-
స్టెమ్ కోర్సుల్లో మహిళల ముందడుగు
సాక్షి, అమరావతి: ఒకప్పుడు సంప్రదాయ కోర్సులకే పరిమితమవుతూ వచ్చిన మహిళలు ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సాంకేతిక, వృత్తిపరమైన కోర్సులవైపు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్‌తో కూడిన స్టెమ్ (ఎస్టీఈఎం) కోర్సుల్లో వారి చేరికలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఆలిండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఐష్) కొద్దికాలం కిందట విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో స్టెమ్ కోర్సుల్లో మహిళల సంఖ్య భారీగా పెరిగింది. సాంకేతిక విద్యాకోర్సులు అమలవుతున్న ఐఐటీలు, ఎన్ఐటీలు తదితర జాతీయ విద్యాసంస్థల్లో వీరి చేరికల శాతం 2016–17లో 8 మాత్రమే ఉండగా 2020–21 నాటికి 20కి పెరిగింది. 2021–22 విద్యాసంవత్సరంలో ఇది 22.1 శాతానికి చేరింది. సాంకేతిక విద్యాకోర్సుల్లో మహిళల చేరికలను పెంచేందుకు కేంద్రప్రభుత్వం కూడా వారికోసం 2017 నుంచి సూపర్ న్యూమరరీ కోటాను ప్రవేశపెట్టింది. జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరుతోపాటు అర్హత సాధించడంలోను మహిళల శాతం తక్కువగా ఉండేది. దీనివల్ల ఐఐటీల్లో వారిసంఖ్య స్వల్పంగా ఉండేది. సూపర్ న్యూమరరీ కోటాను పెట్టడంతో గత ఐదేళ్లలోనే వారి చేరికలు 20 శాతానికి పెరిగాయి. ఎన్ఐటీల్లో అయితే వారి చేరికలు 23 శాతంగా ఉండడం గమనార్హం. ఐఐటీల్లో 2017లో చేరిన మహిళలు 995 మందే కాగా 2021లో ఆ సంఖ్య 2,990కి చేరింది. -
జగనన్న విద్యా దీవెన: విద్యారంగంలో పెరిగిన చేరికల నిష్పత్తి
విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, అభివృద్ధి చర్యలు, సంక్షేమ కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన లాంటి పథకాలతో ఉన్నత విద్యారంగంలో చేరికల నిష్పత్తి గణనీయంగా పెరిగింది. గరిష్ట చేరికల నిష్పత్తి (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో)లో జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో విద్యార్థుల చేరికలు రెట్టింపు స్థాయికి మించి ఉండటం గమనార్హం. ఏపీకి దరిదాపుల్లో కూడా ఇతర రాష్ట్రాలేవీ లేవు. ఇటీవల కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన జాతీయ ఉన్నత విద్య (ఏఐఎస్హెచ్ఈ) 2019 – 20 సర్వే గణాంకాలు ఇవే అంశాలను స్పష్టం చేస్తున్నాయి. – సాక్షి, అమరావతి ఐదేళ్ల గణాంకాలు చూస్తే... ఏఐఎస్హెచ్ఈ గణాంకాల ప్రకారం జాతీయ స్థాయిలో 18 – 23 ఏళ్ల వయసున్న ప్రతి వంద మందిలో 2015–16లో గరిష్ట చేరికల నిష్పత్తి 24.5 ఉండగా 2019–20 నాటికి 27.1కి చేరుకుంది. ఐదేళ్లలో చేరికలు 10.61 శాతానికి పెరిగాయి. అదే ఆంధ్రప్రదేశ్‌లో గణాంకాలు పరిశీలిస్తే 30.8 నుంచి నిష్పత్తి 35.2కి పెరిగింది. అంటే ఉన్నత విద్యనభ్యసించే వారు ఐదేళ్లలో 14.5 శాతం మేర పెరిగారు. చివరి రెండేళ్లలో ఉన్నత విద్యలో చేరికలను విశ్లేషిస్తే పెరుగుదల శాతం అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. 2018–19, 2019–20లలో జాతీయస్థాయిలో చేరికలు 3.04 శాతం కాగా ఏపీలో 8.6గా ఉన్నట్లు ఏఐఎస్హెచ్ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ హయాంలో 2016– 18 మధ్య ఉన్నత విద్యలో చేరికలు 4.85 శాతం తగ్గాయి. ఇతర రాష్ట్రాలకన్నా మెరుగ్గా.. ఉన్నత విద్యారంగంలో గరిష్ట చేరికల గణాంకాలను పరిశీలిస్తే మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడులలో 2018–19, 2019–20లలో పెరుగుదల 5 శాతం లోపే ఉండడం గమనార్హం. ఇదే సమయంలో తెలంగాణలో చేరికల శాతం ఏకంగా మైనస్‌లోకి దిగజారింది. 2018–19, 2019–20 గణాంకాలు పరిశీలిస్తే తెలంగాణలో 1.6 శాతం మేర తగ్గుదల ఉంది. విద్యార్థినుల చేరికల్లో పెరుగుదల... గత ఐదేళ్లుగా ఉన్నత విద్యారంగం గరిష్ట చేరికల్లో విద్యార్థినుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఏపీలో 2018–19లో విద్యార్థుల జీఈఆర్ 35.8 కాగా 2019–20లో 38.3గా నమోదైంది. అంతకు ముందు ఏడాది కన్నా 2019–20లో ఏడు శాతం మంది విద్యార్థులు అదనంగా ఉన్నత విద్యలో చేరినట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఏపీలో విద్యార్థినుల చేరికల నిష్పత్తి 2018–19లో 29.0 కాగా 2019–20లో 32.2గా ఉంది. రాష్ట్రంలో ఉన్నతవిద్యలో విద్యార్థినుల చేరికలు ఒక్క ఏడాదిలో 11.03 శాతానికి పెరగడం గమనార్హం. అదే జాతీయస్థాయి జీఈఆర్ గణాంకాలు చూస్తే విద్యార్థినుల చేరికల్లో పెరుగుదల 2.28 శాతమే ఉంది. కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణల్లో 2018–19, 2019–20లలో విద్యార్థుల చేరికలు 4 శాతం లోపు, విద్యార్థినుల చేరికలు 6 శాతం లోపే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీల్లోనూ గణనీయ పురోగతి.. ఉన్నత విద్యలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల చేరికల్లోనూ ఏపీలో గణనీయ పురోగతి ఉన్నట్లు ఏఐఎస్హెచ్ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018–19, 2019–20లలో చేరికల గణాంకాలు చూస్తే ఎస్సీలు 7.5 శాతం పెరగ్గా ఎస్టీల చేరికలు 9.5 శాతానికి పెరిగాయి. అదే జాతీయ స్థాయిలో గత రెండేళ్లలో ఎస్సీల్లో 1.7 శాతం, ఎస్టీల్లో 4.5 శాతం మాత్రమే పెరుగుదల ఉండడం గమనార్హం. ఇదే సమయంలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల చేరికల్లో తగ్గుదల కనిపిస్తోంది. పిల్లల చదువులపై తల్లిదండ్రుల్లో భరోసా.. ’గత రెండేళ్లలో ఉన్నత విద్యారంగంలో విద్యార్థుల చేరికల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలే దీనికి ప్రధాన కారణం. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడకుండా ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకుంటోంది. జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తుండగా వసతి దీవెన కింద వసతి, భోజనం, ఇతర ఖర్చులకు అయ్యే మొత్తాన్ని విద్యార్థుల తల్లులకు నేరుగా అందిస్తోంది. దీంతో పిల్లల చదువులపై తల్లిదండ్రులకు భరోసా నెలకొంది. ఆర్థికపరమైన సమస్యలు లేకపోవడంతో విద్యార్థులు ఉన్నత విద్యాకోర్సుల్లో చేరగలుగుతున్నారు. ఉన్నత విద్యారంగంలో గరిష్ట చేరికల నిష్పత్తి 2024 నాటికి 70కి పెంచడంతోపాటు 2035 నాటికి 90కి చేర్చాలన్నది ప్రభుత్వం లక్ష్యం. రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాలతో ఈ లక్ష్యాన్ని సునాయాసంగా సాధించగలమనే నమ్మకం ఉంది’ – ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ -
మనోళ్లు అదుర్స్
సాక్షి, హైదరాబాద్:దేశవ్యాప్తంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తరువాత తెలుగు రాష్ట్రాల విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. విద్యార్థులే కాదు ప్రైవేటు కాలేజీలు కూడా తెలుగు రాష్ట్రాల్లో అధికంగానే ఉన్నట్లు ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏఐఎస్హెచ్ఈ) తేల్చింది. 2018–19 సంవత్సరానికి సంబంధించిన సర్వే వివరాలను ఇటీవల ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యను 2,64,65,449 మంది విద్యార్థులు చదువుతుండగా వారిలో ఉత్తరప్రదేశ్‌లోనే 47,91,749 మంది (18.10 శాతం) చదువుతున్నారు. అలాగే మహారాష్ట్రలో 29,57,491 మంది (11.17 శాతం) చదువుతుండగా తెలంగాణ, ఆం«ధ్రప్రదేశ్‌ల నుంచి 24,17,378 మంది (9.13 శాతం) ఉన్నట్లు సర్వే వివరించింది. ఇందులో డిగ్రీ నుంచి మొదలుకొని పీహెచ్డీ వరకు విద్యార్థులు ఉన్నట్లు వెల్లడించింది. కాలేజీల సంఖ్యలో ఉత్తరప్రదేశ్ టాప్.. దేశవ్యాప్తంగా ఉన్నతవిద్యను అందించే కాలేజీల్లో ఉత్తరప్రదేశ్ టాప్‌లో నిలిచింది. అక్కడ అత్యధికంగా 6,447 కాలేజీలు ఉన్నట్లు సర్వే పేర్కొంది. ఆ తరువాత స్థానంలో తెలుగు రాష్ట్రాలే నిలిచాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4,497 కాలేజీలు ఉండగా అందులో ఆంధ్రప్రదేశ్‌లో 2,521 కాలేజీలు, తెలంగాణలో 1,976 కాలేజీలు ఉన్నాయి. మూడో స్థానంలో మహారాష్ట్ర (4,340 కాలేజీలు) నిలిచింది. ప్రైవేటు కాలేజీల్లో ద్వితీయ స్థానం.. దేశవ్యాప్తంగా ప్రైవేటు కాలేజీలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు ద్వితీయ స్థానంలో ఉన్నాయి. ప్రైవేటు కాలేజీల సంఖ్యలోనూ మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది. అక్కడ 5,659 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 4,497 కాలేజీలు ఉండగా అందులో 3,923 ప్రైవేటు కాలేజీలే ఉన్నాయి. తెలంగాణలో 1,700 ప్రైవేటు కాలేజీలు ఉండగా (80 శాతం), ఆంధ్రప్రదేశ్‌లో 2,223 (82 శాతం) ప్రైవేటు కాలేజీలు ఉన్నట్లు సర్వే వివరించింది. ఆ తరువాత స్థానంలో మహారాష్ట్ర (3,589 ప్రైవేటు కాలేజీలు) ఉన్నట్లు పేర్కొంది. -
ఉన్నత విద్యాసంస్థలపై ‘హెచ్ఆర్డీ’ సర్వే
నవంబర్ 30 లోగా వివరాలివ్వాలని సూచన హైదరాబాద్: ఉన్నత విద్యాసంస్థల స్థితిగతులపై కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ జాతీయ స్థారుులో ప్రత్యేక సర్వే చేపట్టింది. 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించిన సర్వేను గత జూన్ 17 నుంచి ప్రారంభించింది. ‘అఖిల భారత ఉన్నత విద్యా సర్వే’ పేరుతో నిర్వహించే ఈ సర్వే ఆన్లైన్లో జరుగుతోంది. నవంబర్ 30వ తేదీలోగా కాలేజీలు ఉన్నత విద్యారంగానికి సంబంధించిన విధాన నిర్ణయాలు, విద్యారంగంలో పరిశోధన,తదితర సమాచారం ఉపకరిస్తుందని మానవవనరుల శాఖ పేర్కొంది. ఉన్నత విద్యాసంస్థల సర్వేలో 2012-13 విద్యాసంవత్సరంలో ఏపీ నుంచి కొన్ని సంస్థలే సమాచారాన్ని పోర్టల్‌లో పొందుపరిచాయి. 47వర్సిటీలకు గాను 26 మాత్రమే స్పందించాయి. 4814 కాలేజీలకు 37 శాతమే సమాచారాన్ని ఇచ్చాయి. 1784 కాలేజీలు మానవ వనరుల శాఖకు అందించారుు. సాంకేతిక విద్య కాలేజీలు, టీచర్ ట్రైనింగ్ సంస్థలు, నర్సింగ్, పీజీడీఎం సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాతీయ విద్యాసంస్థలు అరకొరగా స్పందించారుు. ఈ కేటగిరీలో 1,366 సంస్థలుండగా 243 స్పందించారుు. 191 సాంకేతిక విద్యా కాలేజీల్లో 23 మాత్రమే అప్లోడ్ చేశాయి. 480 టీచర్ ట్రైనిం గ్ సంస్థల్లో 112 స్పందించాయి. నర్సింగ్ కాలేజీల్లో 654కిగాను 112 వివరాలిచ్చాయి. పీజీడీఎం సంస్థలు 31, జాతీయ విద్యా సంస్థలు 10 ఉండగా ఒక్కటి కూడా సమాచారాన్ని ఇవ్వలేదు.