'రూ.26 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్' | integrated school of Rs. 26 crores says pydikondala manikyalarao | Sakshi
Sakshi News home page

'రూ.26 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్'

Published Wed, Sep 9 2015 6:40 PM | Last Updated on Sun, Sep 3 2017 9:04 AM

'రూ.26 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్'

'రూ.26 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్'

తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వెల్లడించారు. ఆయన బుధవారం తాడేపల్లిగూడెంలో విలేకరులతో మాట్లాడారు. రూ.26 కోట్లు వెచ్చించి నిర్మించే ఈ పాఠశాలలో కార్పొరేట్‌కు దీటుగా విద్యనందిస్తామని చెప్పారు.

నిరుపేదల బాలల్లో డ్రాపౌవుట్స్‌ను నివారించేందుకు అన్ని వసతులను ఈ పాఠశాలలో కల్పిస్తామని తెలిపారు. అలాగే, తాడేపల్లిగూడెంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను కూడా ఏర్పాటుచేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కేంద్రంలో విద్యావంతులైన యువతీ యువకులకు భాష, వృత్తి పరమైన అంశాలపై నిపుణులచే శిక్షణ ఇస్తారని మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement