నేటి నుంచి ఇంటర్ పరీక్షలు | Inter exams from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

Published Wed, Mar 11 2015 2:57 AM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM

Inter exams from today

 ఏలూరు సిటీ :ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు సజావుగా సాగేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు చర్యలు చేపట్టారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అర్ధగంట ముందుగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్మీడియెట్ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి బి.వెంకటేశ్వరరావు కోరారు. ప్రథమ సంవత్సరం ఇంటర్ పరీక్ష నేటితో ప్రారంభమవుతుంది. ఈ పరీక్షలకు సంబంధించి ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. విద్యార్థులకు అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలందించేందుకు ప్రథమ చికిత్స శిబిరం, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. విద్యార్థులెవరూ పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు తీసుకురావద్దని అధికారులు కోరుతున్నారు.
 
 ఫస్ట్ ఇంటర్ విద్యార్థులు 33,394 మంది
 బుధవారం నిర్వహించే ఫస్టియర్ పరీక్షకు జిల్లాలో 33,394 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ పరీక్షలకు  సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది 68109 మంది పరీక్షలు రాయనున్నారు. ఇక ఫస్ట్ ఇంటర్ విద్యార్థులు 33394 మంది ఉండగా వారిలో జనరల్ కోర్సులకు సంబంధించి 30297 మంది ఉంటే బాలురు 13687 మంది, బాలికలు 16610 మంది, వోకేషనల్ కోర్సులకు సంబంధించి 3097 మందిలో బాలురు 1735, బాలికలు 1362 మంది పరీక్షలు రాస్తారు. సెకండ్ ఇంటర్ పరీక్షలకు 34715మంది హాజరుకానుండగా వారిలో జనరల్ విద్యార్థులు 30907మంది ఉంటే బాలురు 14296 మంది, బాలికలు 16611మంది, వోకేషనల్ 3808 మందిలో బాలురు 2018, బాలికలు 1790మంది ఉన్నారు.
 
 పరీక్షల షెడ్యూల్ ఇదే
 ఫస్ట్ ఇంటర్ పరీక్ష టైం టేబుల్
  11న  సెకండ్ లాంగ్వేజ్ -1,  13న ఇంగ్లిష్  -1
  16న గణితం-1 ఎ,  బొటనీ -1, సివిక్స్-1, ఫిజియాలజీ -1
  18న గణితం -1 బీ, జువాలజీ -1, హిస్టరీ-1
  20న ఫిజిక్స్ -1, ఎకానమిక్స్ -1, క్లాసికల్ లాంగ్వేజ్-1
  24న కెమిస్ట్రీ -1, కామర్స్ -1, సోషియాలజీ -1,
  ఫైన్స్‌ఆర్ట్స్, మ్యూజిక్ -1
  26 న జియాలజీ -1, హోమ్ సైన్స్ -1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ -1,
     లాజిక్ -1, బ్రిడ్జి కోర్సు గణితం -1
  30 న మోడ్రన్ లాంగ్వేజ్ -1, జాగ్రఫీ -1
 సెకండ్ ఇంటర్ టైంటేబుల్
  12న లాంగ్వేజ్ పేపరు-2,  14న ఇంగ్లిష్ పేపరు-2
  17న గణితం పేపరు-2ఎ, బోటనీ పేపరు-2,
    సివిక్స్ పేపరు-2, ఫిజియాలజీ-2
  19న గణితం-2 బీ, జువాలజీ -2, హిస్టరీ-2
  23న  ఫిజిక్స్ -2, ఎకనమిక్స్-2, క్లాసికల్ లాంగ్వేజ్ -2
  25న  కెమిస్ట్రీ-2, కామర్స్-2, సోషియాలజీ -2.
    ఫైన్స్‌ఆర్ట్స్, మ్యూజిక్-2
  27న  జియాలజీ -2, హోమ్‌సైన్సు-2, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2,
     లాజిక్-2, బ్రిడ్జికోర్సు గణితం-2
  31న మెడ్రన్ లాంగ్వేజ్-2, జాగ్రఫీ-2
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement