బాలికలదే హవా..! | Intermediate results Girls Dominant | Sakshi
Sakshi News home page

బాలికలదే హవా..!

Published Tue, Apr 29 2014 12:32 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

బాలికలదే హవా..! - Sakshi

బాలికలదే హవా..!

జయ నామ సంవత్సరంలో విడుదలైన తొలి ఫలితాల్లో విజయకేతనం ఎగురవేసిన విద్యార్థినులు చదువుల రాణులమని మరో సారి నిరూపించుకున్నారు.

 గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: జయ నామ సంవత్సరంలో విడుదలైన తొలి ఫలితాల్లో విజయకేతనం ఎగురవేసిన విద్యార్థినులు చదువుల రాణులమని మరో సారి నిరూపించుకున్నారు. సోమవారం విడుదలైన ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో జిల్లాస్థానం గతేడాది కంటే దిగజారింది. గత రెండేళ్లుగా రాష్ట్రస్థాయిలో నాలుగోస్థానంలో నిలుస్తూ వచ్చిన జిల్లాస్థానం ఈ దఫా ఐదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతేడాది ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో జిల్లాలో 62.89  శాతం ఉత్తీర్ణత నమోదుకాగా ప్రస్తుతం 63 శాతం నమోదైంది.
 
 గత విజయనామ సంవత్సరంలో సాధించిన విజయాన్ని పునరావృతం చేస్తూ విద్యార్థినులు జయనామ సంవత్సరంలో మరోసారి ఫలితాల్లో పైచేయి సాధించారు. గత మార్చి నెలలో జూనియర్ ఇంటర్ పరీక్షలు రాసిన 47,714 మంది విద్యార్థుల్లో 29,962 మంది ఉత్తీర్లులయ్యారు. 26,145 మంది బాలురకు 15,429 మంది(59శాతం), 21,569 మంది  బాలికలకు 14,533 మంది(67 శాతం) ఉత్తీర్ణత సాధించారు. వృత్తివిద్యాకోర్సుల పరీక్షలు రాసిన 900 మందిలో 444 మంది పాస్‌కాగా, 49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలు, సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్స్‌లో ఉత్తమ ఫలితాలు నమోదయ్యాయి. కార్పొరేట్ కళాశాలల విద్యార్థులు ఈ ఏడాది ఫలితాల సాధనలో దుమ్మురేపారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ విభాగాల్లో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించారు.
 
 ఎంఈసీలో స్టేట్‌టాపర్‌గా శ్రీమేధ విద్యార్థిని
 ఎంఈసీలో శ్రీమేధ విద్యాసంస్థల విద్యార్థిని చిట్టే అఖిలాండేశ్వరి 500 మార్కులకు 492 మార్కులు సాధించగా, రాష్ట్రస్థాయిలో టాప్ మార్కు ఇదేనని సంస్థ యాజమాన్యం ప్రకటించింది. మాస్టర్‌మైండ్స్ విద్యాసంస్థలకు చెందిన పగడాల రాజ్యలక్ష్మి, ఎండీ ఉమ్మల్ హబీబా, బమ్మిడి పృద్వీరాజ్, మాచా లక్ష్మీ ప్రసన్న, ఎ.వినోద్‌కుమార్, పాదర్తి వినీత్ ఎంఈసీలో 491 మార్కులు సాధించారు. ఎంపీసీలో భాష్యం విద్యాసంస్థల విద్యార్థి బొల్లం సాయిరామ లక్ష్మణ అభినవ్ 470 మార్కులకు 466, బైపీసీలో నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థిని కె. శ్రీ శ్రావణి 440 మార్కులకు 436 సాధించి జిల్లా టాపర్లుగా నిలిచారు. ఎన్నారై అకాడమీ విద్యార్థులు ఎంపీసీ విభాగంలో సీహెచ్ నాగ తేజస్వి, ఎంకేసీ సత్యనారాయణ, షేక్ గౌస్ బాషా, డి.నాగశ్రావణి 465 మార్కులు సాధించారు.
 
 ప్రభుత్వ కళాశాల్లో అత్యుత్తమ ఫలితాలు
 ప్రథమ సంవత్సర ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాయి. అచ్చంపేట (80.28 శాతం), సిరిపురం (79 శాతం), చందోలు (61.09 శాతం) ప్రభుత్వ జూనియర్ కళాశాశాలలు వరుసగా రెండో ఏడాది తొలి మూడుస్థానాల్లో నిలిచాయి. ఎయిడెడ్ విభాగంలో సెయింట్ జోసఫ్ జూనియర్ కళాశాల-నల్లపాడు (73 శాతం), కేఎస్ జూనియర్ కళాశాల (63.33 శాతం), రెడ్డి కళాశాల-గుంటూరు (49 శాతం)తో తొలిమూడుస్థానాల్లో నిలిచా యి. ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల పరిధిలో బాపట్లలోని డెఫ్ అండ్ డెంబ్ కళాశాల నూరు శాతం, నాగార్జున సాగర్ 97.13 శాతం, సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ళలో అచ్చంపేట (100 శాతం), సత్తెనపల్లి (97 శాతం), అమరావతి (92 శాతం) సాధించాయి. దాచేపల్లి, కారంపూడి, చీకటీగలపాలెం (వినుకొండ) మోడల్ స్కూల్స్ జూనియర్ కళాశాలలు తొలి మూడుస్థానాల్లో నిలిచాయి.
 
 జిల్లాలో గత ఐదేళ్లలో నమోదైన ఉత్తీర్ణత శాతాలు
 2009-10          - 53.44 శాతం
 2010-11          - 61 శాతం
 2011-12          - 61 శాతం
 2012-13          - 62.89 శాతం
 2013-14          - 63 శాతం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement