మాచర్లలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఫైటింగ్! | Internal differences in Macherla of Guntur | Sakshi
Sakshi News home page

మాచర్లలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఫైటింగ్!

Published Sun, Jun 29 2014 11:00 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Internal differences in Macherla of Guntur

మాచర్ల: గుంటూరు జిల్లా మాచర్లలో తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.  గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు యాదంటి మల్లికార్జునరావుపై తెలుగు యువత విభాగానికి చెందిన నాయకుడు లచ్చయ్య చౌదరి వర్గం దాడి చేసింది. 
 
గతకొద్దికాలంగా అంతర్గత విభేధాలు ఉన్నాయని, అయితే వీరిద్దరి గ్రూపుల మధ్య రేషన్ షాపుల కేటాయింపు మరింత చిచ్చు పెట్టిందని ఆపార్టీకి చెందిన నేతలే అంటున్నారు. ఇటీవల యాదంటి అనుచరులకే రేషన్‌ షాపులు కేటాయించడంపై ఘర్షణ తీవ్రస్థాయికి చేరుకుంది. దాంతో లచ్చయ్య వర్గం యాదంటిపై దాడి చేసినట్టు సమాచారం. తనపై దాడి చేశారంటూ  జిల్లా ఉపాధ్యక్షుడు యాదంటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement