అంతర్జాతీయ ఆర్థిక విధానాలపై ఎంబీఏ విద్యార్థులు పట్టుసాధించాలి
గుడివాడ టౌన్, న్యూస్‌లైన్ : మేనేజ్‌మెంట్ విద్యార్థులు అంతర్జాతీయ ఆర్థిక విధానాలపై పట్టు సాధించాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్ జి.వి.చలం సూచించారు. స్థానిక ఏఎన్నార్ కళాశాల ఎంబీఏ విభాగంలో ‘అంతర్జాతీయ ఆర్థిక నిర్వహణలో వస్తున్న మార్పులు - భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లు’ అంశంపై శనివారం సెమినార్ జరిగింది.
ఈ సందర్భంగా చలం మాట్లాడుతూ అంతర్జాతీయ ఆర్థిక విధానాల్లో వస్తున్న మార్పుల ఫలి తంగా ఎంబీఏ విద్యార్థులకు విస్తారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. దేశీయ ఆర్థిక నిర్వహణతో పోలిస్తే అంతర్జాతీయ ఆర్థిక నిర్వహణ చాలా సంక్లిష్టంగా ఉందన్నారు.
ఆయా దేశాల వ్యాపార చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవడం మంచిదని సూచించారు. భారతదేశంలో ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో విదేశీ ఆర్థిక నిర్వహణ ప్రాముఖ్యత భారీగా పెరిగిందన్నారు. కళాశాల ట్రెజరర్ కె.ఎస్.అప్పారావు, పీజీ కోర్సుల డెరైక్టర్ పి.నరసింహా రావు తదితరులు పాల్గొన్నారు.