పుత్తూరులో ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రం నుంచి వస్తున్న విద్యార్థులు
చిత్తూరు, పుత్తూరు: పరీక్షలంటేనే విద్యార్థులు మానసిక వత్తి డికి గురవుతారు. అలాంటిది పదేపదే తనిఖీల పే రుతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తుండడంతో తీవ్రమైన మానసిక క్షోభకు గురువుతున్న ట్లు తెలిసింది. పట్టణంలోని ఎస్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియ ర్ కళాశాలతోపాటు హిమజ, వేదవ్యాస, సాయిజ్యోతి జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు ప్రా రంభం నుంచి నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలు ఇన్వి జిలేటర్లు, పరీక్ష కేంద్రం ఉన్నతాధికారులను ప్రలోభాలతో లొంగదీసుకుని, పోటీ కళాశాలకు చెందిన విద్యార్థులను మానసిక క్షోభకు గురి చేసే ఎత్తుగడలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
మైండ్ గేమ్
ఫలానా కళాశాల విద్యార్థి మెరిట్ సాధిస్తారనే సమాచారం సేకరించిన ప్రైవేట్ కళాశాలలు పరీక్ష కేంద్రంలో ఆ మెరిట్ విద్యార్థుల ఏకాత్రగతను దెబ్బతీసేలా స్కెచ్ వేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పరీక్ష కేంద్రం అధికారులు, ఇన్విజిలేటర్లుతో ‘తనిఖీలు’ చేయాలని రహస్య అవగాహనతో తమ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయని తెలిసింది. మెరిట్ విద్యార్థులను పదేపదే తనిఖీ చేస్తూ వారి ఏకాగ్రతకు దెబ్బతీసే సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జంబ్లింగ్‌కు మంగళం
ఎస్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాత్రం జంబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఒకేషనల్ విద్యార్థులకు ఈ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. రెగ్యులర్ కోర్సు విద్యార్థులతో పాటు ఒకేషనల్ విద్యార్థులకు జంబ్లింగ్‌లో విధానంలో పరీక్షలు నిర్వహించడానికి బదులు ఒకేషనల్ విద్యార్థులందరినీ మూడు తరగతి గదుల్లో కూర్చోబెట్టి పరీక్షలను నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీంతో కళాశాల అధికారులే పరోక్షంగా మాస్ కాపీయింగ్‌కు సహకారం ఇచ్చినట్‌లైంది. ఇకనైనా ఇంటర్మీడియెట్ బోర్డు ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి వీటికి చెక్ పెట్టాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.
♦ నారాయణవనంకు చెందిన విద్యార్థి పుత్తూరులోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. పట్టణంలోని ఎస్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్నాడు. ఇన్విజిలేటర్ తనిఖీల పేరుతో అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారని, మిగిలిన పరీక్షలకు హాజరుకానని తల్లిదండ్రుల వద్ద తనగోడు వెళ్లగక్కాడు.
♦ పుత్తూరుకు చెందిన ఓ విద్యార్థిని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తోంది. ఈమె తండ్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉద్యోగి. గణితం పరీక్ష రోజు బాలికకు చెమటలు పట్టాయి. పరీక్ష కేంద్రం ఉన్నతాధికారి బాలిక పరీక్ష రాస్తున్న గదిలోకి వెళ్లి బాలిక తండ్రి పేరు చెప్పి ఆయన కుమార్తె ఎవరని ప్రశ్నించారు. దీంతో బిత్తరపోయిన ఆ మళ్లీ మిగిలిన పరీక్షలకు హాజరుకానని భీష్మించుకు కూర్చుంది. తండ్రి నచ్చ చెప్పడంతో హాజరవుతోంది. బాలిక తండ్రికి పరీక్ష కేంద్రం ఉన్నతాధికారికి ఏవో మనస్పర్థలు ఉండడంతోనే ఇలా బాలికను ఇబ్బంది పెట్టారని ఇంటర్మీడియెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
♦ ఇంటర్మీడియెట్ బోర్డు నిబంధనల ప్రకారం తప్పనిసరిగా జంబ్లింగ్ పద్ధతిలోనే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలి. అయితే ఎస్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాత్రం నిబంధనలకు తిలోదకాలిచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకేషనల్ విద్యార్థులను మూడు తరగతి గదుల్లో కూర్చోబెట్టి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీంతో మాస్ కాపీయింగ్ జోరుగా సాగుతోందని ప్రచారంలోకి వచ్చింది.
అలాంటిదేమీ లేదు
మాస్ కాపీయింగ్ ఏమీ లేదు. ఒకేషనల్ విద్యార్థులకు కూడా జంబ్లింగ్ విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నాం.–జయసూర్య, ప్రిన్సిపల్, ఎస్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, పుత్తూరు
Comments
Please login to add a commentAdd a comment