
సాక్షి, పోలవరం: ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆదివారం పోలవరంలో పర్యటించారు. ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు పోలవరం చేరుకున్న అనిల్‌కుమార్‌కు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, జిల్లా అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రాజెక్ట్ పనులను మంత్రి పరిశీలించారు. ఆ తర్వాత ఆర్‌అండ్ ఆర్, పోలవరం ప్రాజెక్ట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి అనిల్‌కుమార్ మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్ట్ పనులు 2021కల్లా పూర్తవుతాయి. ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా, కోర్టు కేసులు వేసినా నవంబర్‌లో పనులు మొదలుపెడతామని చెప్పాం. మాట నిలబెట్టుకున్నాం. ఆర్‌అండ్‌బీ కు సంబంధించి 10వేల పిటిషన్‌లు వచ్చాయి. వాటిని ప్రత్యేక అధికారి ద్వారా పరిశీలిస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లు పనులు పూర్తి అవుతాయి. సాక్షాత్తూ కేంద్రం నుంచి వచ్చిన బృందమే అన్నీ సజావుగా సాగుతున్నాయని చెప్పింది అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment