బాబూ.. ఇంత మోసమా?
- ఎమ్మార్పీఎస్ నాయకుల ఆవేదన
గుడివాడ అర్బన్ : సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ఎస్సీ వర్గీకరణ చేస్తానంటూ మమ్మల్ని నమ్మించి..మా వల్ల లబ్ధిపొంది ముఖ్యమంత్రి అయిన తరువాత మమ్మల్ని మరిచారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిథి లాం దానియేలు ఆవేదన వ్యక్తం చేశారు.
శనివారం స్థానిక గుడ్‌మాన్‌పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల సమయంలో మాదిగల ఓట్లకోసం చంద్రబాబు ఎన్నోసార్లు ‘నేను ముఖ్యమంత్రి అయ్యాక...వర్గీకరణ చేస్తాను’ అంటూ బహిరంగసభల్లో చెప్పారని గుర్తుచేశారు. మాదిగలంతా ఏకతాటిపై నిలబడి ఆయనను ముఖ్యమంత్రి చేస్తే ఇప్పుడు వర్గీకరణ ఊసెత్తడం లేదని మండిపడ్డారు. గొర్రె లాజరస్, కంచర్ల సుధాకర్, వేసిపోగు సుందరయ్య, బలసాని యోహాను, వేల్పుల నాగబాబు పాల్గొన్నారు.
కన్వీనర్ల నియమాకం...
ఎమ్మార్పీఎస్, ఎంఈఎఫ్‌లకు జిల్లా, నియోజకవర్గాలకు కన్వీనర్లుగా నియమించినట్లు లాం దానియోలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా కన్వినర్‌గా రాచేటి మురళీ, కో-కన్వీనర్‌గా దిరిశం బాలకోటయ్యను నియమించామన్నారు. నియోజకవర్గు కన్వీనర్లుగా శాలిరాజు(మచిలీపట్నం), కటకాల ప్రసాద్(పెడన), దరిశం శ్రీనివాస్ (అవనిగడ్డ), మన్నేపల్లి ఆదాం (కైకలూరు), వంగవరపు కిరణ్ (గుడివాడ), జువ్వనపూడి సురేంద్రకుమార్ (పామర్రు), పల్లెపాము కుటుంబరావు(నూజివీడు), వీరమళ్ల రాంబాబు(తిరువూరు), కోవెలపల్లి కిషోర్(పెనమాలూరు), బెజవాడ పుల్లయ్య(నందిగామ), మన్నే విజయకుమార్(మైలవరం), పి.ఆదాం(జగ్గయ్యపేట)ను నియమించామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర కో-కన్వీనర్‌గా కైతేపల్లి దాస్, అరుంధతి మాదిగ మహిళా సమాఖ్య జిల్లా కన్వీనర్‌గా ముల్లంగి రాణి, కో-కన్వీనర్లుగా జుజ్జువరపు ప్రశాంతి, దేవరపల్లి అరుణను నియమించారు.