వజ్రపుకొత్తూరు, న్యూస్‌లైన్:
నువ్వలరేవు గ్రామంలో మూడేళ్లకొకసారి జరిగే సామూహిక వివాహాలు ఈ ఏడాది కూడా ఘనంగా జరిగాయి. ఒక వరుడు పరారవడంతో ఆ పెళ్లి ఆగిపోయింది. మిగిలిన 82 జంటలు రాత్రి 11.25 గంటలకు ఒకటయ్యాయి. గత మూడురోజులుగా గ్రామంలో మైక్‌సెట్లు హోరు వినిపిస్తుండగా, శుక్రవారం రాత్రి లైటింగ్ డెకరేషన్‌లతో గ్రామంలోని అన్ని వీధులు దేదీప్యమానంగా వెలిగాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పెళ్లి కుమారులు ముస్తాబై పెళ్లిపీటలపై కూర్చున్నారు. బంధువులు వారికి కానుకలు అందజేశారు.
4 గంటలకు గ్రామంలోని పెద్దలకు, మిత్రులకు తాంబూలాలు ఇచ్చి వారి ఆశీస్సులు పొంది, తిరిగి తమ ఇంటి వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి బంధుమిత్ర సపరివారంగా వధువు ఇంటికి చేరారు. మేళతాళాలతో పురోహితులు వేదమంత్రాల నడుమ ముందుగా పెళ్లికుమార్తె, పెళ్లి కుమారుడు మెడలో తాళి కట్టగా, తరువాత పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి తాళి కట్టాడు. ఆ తరువాత పెద్దలు, పురోహితుల ఆశీస్సులతో పెళ్లి కుమార్తె కన్న వారింటిలోనే ఉంటారు. ఈనెల 9న సారె సామాన్లుతో పెళ్లి కొడుకుతో పాటు అత్తవారింటికి వెళ్తారు. ఈ వివాహ కార్యక్రమాలకు సుర్ల, సుమండి, సున్నాపురం, జాడుపల్లి పరిసర గ్రామాల బంధువులు హాజరయ్యారు.
కల్యాణ వైభోగమే!
Published Sat, Mar 8 2014 2:32 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
Advertisement
Advertisement