సాక్షి ప్రత్యేక ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించడానికి శనివారం జిల్లాకు వస్తున్నారు. ప్రజాసంకల్పయాత్రలో జిల్లాలో అశేష జనాదరణ పొందిన జననేత ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి రెట్టించిన ఉత్సాహంతో అడుగిడుతున్నారు. సిక్కోలులోని అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయబావుటా ఎగురవేసే లక్ష్యంతో ఆయన ఎన్నికల సమరానికి శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ఎంపికలోనూ అన్ని సమీకరణలను పరిగణనలోకి తీసుకున్నారు.
ఎలాంటి అసంతృప్తికి ఆస్కారం లేకుండా చూశారు. పార్టీ అభ్యర్థులు ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పలా సలో శనివారం జరిగే తొలి ఎన్నికల ప్రచార సభలో పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పా ల్గొంటున్నారు. శనివారం ఉదయం 9.30 గం టలకు హెలికాప్టర్‌లో పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అనంతరం పలాస ఇందిరా చౌక్ జంక్షన్ వద్ద జరిగే ఎన్ని కల ప్రచార సభలో ఆయన ప్రసంగించనున్నారు. మంత్రులు, అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఈ ఐదేళ్లలో సాగించిన అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగాలను జగన్‌మోహన్‌రెడ్డి మరో సారి శ్రీకాకుళం జిల్లా వాసులకు గుర్తు చేయనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలను, పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న సంక్షేమ పథకాలను ఆయన సభలో వివరించనున్నారు. పలాస సభ ముగించుకుని జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ జిల్లా పాడేరు ఎన్నికలో సభలో ప్రసంగించడానికి హెలికాప్టర్‌లో వెళతారు.
నీ రాక కోసం..
ప్రజాసంకల్పయాత్రలో ఆయన నవంబర్ 25న పాలకొండ నియోజకవర్గంలోని వీరఘట్టం మండలం కడకెల్ల వద్ద జిల్లాలోకి ప్రవేశించారు. అప్పట్నుంచి జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ దాదాపు రెండున్నర నెలల పాటు ప్రజాసంకల్పయాత్ర కొనసాగించారు. అడుగడుగునా సిక్కోలు ప్రజలు జననేతకు బ్రహ్మరథం పట్టారు. జనవరి 9న ఇచ్ఛాపురంలో అత్యంత అట్టహాసంగా లక్షలాది మంది జనసందోహం నడుమ ఈ ప్రజాసంకల్పయాత్రను ముగించారు. ఇప్పటికే ఐదేళ్లలో టీడీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యే ప్రజాప్రతినిధుల ఆగడాలు, అకృత్యాలకు జిల్లా ప్రజలు ఎంతగానో విసిగివేసారిపోయి ఉన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని తపిస్తున్నారు. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం హాజరై మద్దతు తెలుపుతున్నారు. ఇచ్ఛాపురంలో ప్రజా సంకల్పయాత్ర ముగింపు అనంతరం తొలిసారిగా జిల్లాకు వస్తున్న జగన్‌కు సంఘీభావం తెలపడానికి, నీవెంటే మేమున్నామని చాటి చెప్పడానికి వీరు పలాస ఎన్నికల సభకు స్వచ్ఛందంగా తరలిరావడానికి సిద్ధమవుతున్నారు. జననేత ప్రసంగాన్ని వినాలని ఎంతగానో తహతహలాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment