‘పట్టిసీమ’పై అసెంబ్లీ సాక్షిగా గళమెత్తిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
‘పశ్చిమ’ అన్నదాతల హర్షాతిరేకాలు
ఎలాగైనా కట్టితీరుతామన్న సర్కారు మొండి వైఖరిపై ఆగ్రహావేశాలు
వైఎస్ జగన్ అండతో పోరుబాటకు రైతుల నిర్ణయం
కృష్ణా డెల్టాకు తరలించే ఆ నీటిని మధ్యలో స్టోరేజీ లేకుండా ఎక్కడ నిల్వ చేస్తారని జగన్ మోహన్‌రెడ్డి సూటిగా సర్కారును నిలదీశారు. ప్రకాశం బ్యారే జి సామర్థ్యం 3 టీఎంసీల కంటే తక్కువేనని గుర్తు చేశారు. వర్షాకాలంలో దాదాపు ఒకే సమయంలో గోదావరి, కృష్ణా నదులకు వరదలు వస్తాయని, అప్పుడు ముంచుకొచ్చే ఈ వరద నీటిని ఎక్కడ నిల్వ చేస్తారని ప్రశ్నిం చారు. ఆ నీటిని నిల్వ చేసుకునేందుకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తలపెట్టారని, 194 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బహుళ ప్రయోజనాలుగల పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వేగవంతం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం అందరం కలసి కేంద్రంపై ఒత్తిడి తీసుకువద్దామని కోరారు. అంతేగానీ తాత్కాలిక ప్రయోజనాల కోసం రూ.వందలాది కోట్లు వృథా చేసి పట్టిసీమ పథకం చేపట్టొద్దని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ఆయన సూటిగా చేసిన ఈ వ్యాఖ్యలతో ఇక్కడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం మొండిపట్టుపై ఆందోళన
మూడు నెలల క్రితం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఆందోళన చెందుతున్న ఇక్కడి రైతులు ఇటీవల సర్కారు భూముల సర్వే చేస్తుండటంతో కంటిమీద కునుకు లేకుండా కాలం గడుపుతున్నారు. కేవ లం భూముల సర్వే కారణంగానే రెం డు రోజుల క్రితం ఆందోళనకు గురైన బంగారుపేటకు చెందిన రైతు కర్రి శంకరయ్య గుండెపోటుతో మృత్యువాత పడ్డారు. ఇక్కడి రైతుల మానసిక వ్యథకు ఇదో ఉదాహరణ మాత్రమే. అయినా రైతుల కడగండ్లను ఏమాత్రం పట్టించుకోని సర్కారు పట్టిసీమ ఎత్తిపోతలపై మొండిగానే ముందుకు వెళ్తామని ప్రకటించింది. బుధవారం శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ ఎవరేం చేసినా, ఎంతమంది వ్యతిరేకించినా పట్టిసీమ నిర్మాణంలో వెనకడుగు వేసేదిలేదని, ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో చంద్రబాబు తాజా ప్రకటనతో ఇక్కడి రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండతో పట్టిసీమ నిర్మాణానికి వ్యతిరే కంగా పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని రైతులు భావిస్తున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఇప్పటికే కొనసాగిస్తున్న తమ ఆందోళనను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండతో తీవ్రతరం చేయాలని నిర్ణయించారు.
పోలవరంపై రు‘బాబు’
ఇదిలావుండగా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం చంద్రబాబు శాసనసభలో మాట్లాడుతూ.. 2009 నుంచి 2014 వరకు ప్రాజెక్టు నిర్మాణం జాప్యం మీ వల్లనే అంటూ వైఎస్సార్ సీపీ సభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాల కాలంగా శంకుస్థాపనకే నోచుకోని బహుళార్థ సాధక పోల వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సాహసోపేతంగా ప్రారంభిం చారు. వైఎస్ హయాంలో కుడి, ఎడమ కాలువల పనులతోపాటు హెడ్‌వర్క్స్‌లో భాగంగా స్పిల్ వే, ట్విన్ టన్నెల్స్, కుడి కనెక్టవిటీస్, ఎడమ కనెక్టవిటీస్ నిర్మాణ పనులు మొదల య్యాయి. కాంట్రాక్టు సంస్థ అనుకున్నంత వేగంగా పనులను చేయకపోవడంతో విడివిడిగా ఇచ్చిన స్పిల్ వే, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం, పవర్ హౌస్ టెండర్లను వైఎస్ రాజశేఖరరెడ్డి రద్దు చేశారు. ఈ మూడు ప్యాకేజీలను కలిపి ఒకే ప్యాకేజీగా టెండరు ఇవ్వాలని నిర్ణయిం చారు.
అయితే, వైఎస్ హఠాన్మరణం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు మూడేళ్లకుపైగా కాలయాపన చేసి ప్రాజెక్టు నిర్మాణాన్ని నీరుగార్చింది. ఎట్టకేలకు ఏడాదిన్నర క్రితం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం స్పిల్ వే, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం, పవర్ హౌస్ పనులను ఒకే ప్యాకేజీగా ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీకి అప్పగించింది. ఆ సంస్థ సామర్థ్యంపై అనుమానాలు వెల్లువెత్తే విధంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. టీడీపీ సర్కారు కొలువుదీరిన అనంతరం పది నెలల కాలంలో పనులు కనీసమాత్రంగా కూడా జరగడం లేదు. ఈ క్రమంలో పోలవరం నిర్మాణ పనుల జాప్యంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గాని, వైఎస్సార్ సీపీ సభ్యులకు గానీ ఏం సంబంధమని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పోలవరం నిర్మాణం జాప్యం మీ వల్లనే అంటూ బాబు చేసిన వ్యాఖ్య హాస్యాస్పదంగా ఉందని విమర్శిస్తున్నారు. కోస్తా జిల్లాల్లోని బీడువారిన భూములను సస్యశ్యామలం చేయడంతోపాటు విద్యుత్ కొరతను తీర్చగలిగే సామర్థ్యమున్న, రాయలసీమకు తాగునీటి అవసరాలు తీర్చే పోలవరం నిర్మాణం ఇంతవరకు వచ్చిందంటే అది కేవలం మహానేత పుణ్యమేనని వైఎస్సార్ సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
వద్దు బాబూ.. వద్దు
Published Thu, Mar 19 2015 1:37 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement