'చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలి' | Jalil Khan Demand for CBI Enquiry on Chandrababu Naidu Assets | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలి'

Published Tue, Sep 17 2013 2:17 PM | Last Updated on Sat, Jul 28 2018 4:59 PM

Jalil Khan Demand for CBI Enquiry on Chandrababu Naidu Assets

వైఎస్ జగన్‌ బెయిల్‌ను అడ్డుకునేందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జలీల్‌ఖాన్‌ ఆరోపించారు. తన ఆస్తుల చిట్టాను తారుమారు చేసిన చాణిక్యుడు చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
 

తన మొత్తం కుటుంబ ఆస్తి రూ.62.30 కోట్లేనని చంద్రబాబు నాయుడు సోమవారం వెల్లడించారు. తన పేరిట రూ. 42.06 లక్షల ఆస్తులు ఉన్నాయని ఆయన ప్రకటించారు. తన భార్య భువనేశ్వరికి రూ48.85 కోట్లు, తన కుమారుడు లోకేష్ కు రూ.9.73 కోట్లు, కోడలు బ్రహ్మణికి రూ. 3.3 కోట్లు విలువ చేసే ఆస్తులున్నట్టు చంద్రబాబు చెప్పారు.  అయితే చంద్రబాబు ప్రకటించిన ఆస్తులు కాకి లెక్కలనీ వైఎస్సార్ కాంగ్రెస్ నేత జూపూడి ప్రభాకర్ ఆరోపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement