jalilkhan
-
నవ్విపోదురు గాక.. మాకేంటి సిగ్గు
నగరపాలక సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. ఉన్న అప్పులు చాలవన్నట్లు కొత్తగా మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం రూ.137 కోట్లు, జేఎన్ఎన్యూఆర్ఎం గృహ నిర్మాణాలు, ఇతర ప్రాజెక్టుల పూర్తికి రూ.100 కోట్ల రుణం కోసం ప్రయత్నాలు సాగిస్తోంది. రూ.73 కోట్ల మేర మొండి బకాయిలు పేరుకుపోయాయి. టాప్ డిఫాల్టర్స్ లిస్ట్‌లో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఉండటం పాలకుల పనితీరును తేటతెల్లం చేస్తోంది... ► అప్పుల ఊబిలో నగరపాలక సంస్థ ► ఆదాయానికి గండికొడుతున్న టీడీపీ ► ప్రజాప్రతినిధులు కొత్త అప్పుల కోసం ప్రయత్నాలు ముమ్మరం విజయవాడ సెంట్రల్ : నవ్విపోదురుగాక మాకేంటి సిగ్గు అనే చందంగా టీడీపీ పాలకుల పనితీరు తయారైంది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నగరపాలక సంస్థ ఆదాయానికి పాలకులు మరింత గండికొడుతున్నారు. ఏళ్ల తరబ డి పన్ను బకాయిలు చెల్లించకుండా ఆట లాడుతున్నారు. సుమారు రూ.73.39 కోట్ల మేర మొండి బకాయిలు ఉన్నట్లు రెవెన్యూ అధికారులే లెక్కతేల్చారు. టాప్ 100 డిఫాల్టర్స్‌లో చోటుదక్కించుకున్న ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) రూ.9,44,505, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ రూ.14,86,358 మేర పన్నుబకాయిలు చెల్లించాల్సి ఉం ది. గడిచిన రెండేళ్లుగా బకాయిలు చెల్లిం చలేదని సమాచారం. సకాలంలో పన్ను బకాయిలు చెల్లించి నగరపాలక సంస్థ ఆర్థికాభివృద్ధికి తోడ్పడండి అంటూ ప్రచారాన్ని హోరెత్తించే అధికారులు పాలకుల నుంచి పన్నులు వసూలు చేయలేక అగచాట్లు పడుతున్నారు. జలీల్‌ఖాన్ ఇటీవలే రూ.2లక్షలు చెల్లించి మిగతా మొత్తాన్ని బకాయి పెట్టినట్లు తెలుస్తోంది. అదేమంటే మాది ఉమ్మడి ఆస్తి, నా తమ్ముడు వాటా తాలూకు బకాయి ఉందంటూ రెవెన్యూ అధికారులకు కథ చెప్పినట్లు తెలుస్తోంది. ఎంపీ కేశినేని వైపు కన్నెత్తి చూసే సాహసాన్ని అధికారులు చేయడం లేదు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు రూ.2 లక్షలపైనే బకాయి ఉన్నారు. 2016–17 సంవత్సరానిదే కాబట్టి కట్టేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. అప్పుమీద అప్పు కాంగ్రెసోళ్ళు అప్పులు చేసి కార్పొరేష¯ŒSను నాశనం చేశారని పదేపదే తిట్టిపోసే టీడీపీ పాలకుల నోట అప్పుల పాట వినిపిస్తోంది. జేఎ¯ŒSఎన్యూఆర్ఎం ప్రాజెక్ట్‌లోని గృహనిర్మాణాలు, ఇతర పథకాల పూర్తి కోసం రూ.100 కోట్లు హడ్కో నుంచి రుణం తీసుకొనేందుకు ఇటీవలే కౌన్సిల్లో తీర్మానం చేశారు. మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా బందరు, ఏలూరు రోడ్డులో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ప్రత్నామ్నాయ రహదారులు, వంతెనల నిర్మాణం కోసం రూ.137 కోట్లు అవసరం అవుతాయని తేల్చారు. ఇందుకోసం అప్పు చేయాలని ప్రభుత్వం నగర పాలక సంస్థకు సూచించింది. మెట్రోరైలు ప్రాజెక్ట్‌కు నగరపాలక సంస్థకు సంబంధం ఏమిటన్నది అంతుబట్టని విషయం. రూ.137 కోట్లు అప్పు తీసుకున్నట్లైతే కార్పొరేష¯ŒS ఆర్థిక పరిస్థితి చిధ్రం అవుతోంది. ఇప్పటికే రూ.284 కోట్ల అప్పులో ఉంది. జెఎన్ఎన్యూఆర్ఎం, మెట్రోరైలు అప్పులు కలిపి రూ. 237 కోట్లు వెరసి రూ.521 కోట్లకు అప్పు ల చేరుతోంది. కార్పొరేషన్ ఆదాయం మొత్తం వడ్డీలు కట్టేందుకే సరిపోతుంది. పుష్కర నిధుల్లో కోత కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.186 కోట్లలో ఇప్పటి వరకు రూ.91 కోట్లే విడుదలయ్యాయి. మిగితా రూ.95 కోట్లలో కోతపెట్టాలనే యోచన లో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రోడ్లు, డ్రెయినేజ్ పనులు ఇంకా పెండింగ్‌లో ఉండగా వాటిని పక్కన బెట్టేయమని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పుష్కరాలను పురస్కరించుకొని చేపట్టిన రోడ్ల విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు రూ.17.16 కోట్లు ఇప్పటికీ మంజూరు చేయలేదు. వీటి విడుదల కోరుతూ మేయర్ శ్రీధర్ ఆర్థికమంత్రి, ఎంఏయూడీ ప్రిన్సిపుల్ సెక్రటరీ, డీఎంఏల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. అప్పు కాదు గ్రాంటు మెట్రో రైలు ప్రాజెక్ట్‌కు రూ.137 కోట్లను ప్రభుత్వం గ్రాంట్‌గా మంజూరు చేస్తోంది. ఇందుకోసం ఎలాంటి అప్పు చేయడం లేదు. జెఎన్ఎన్యూఆర్ఎం పథకం పూర్తి కావాలంటే అప్పు చేయక తప్పదు. త్వరలోనే కృష్ణాపుష్కరాల నిధులు విడుదల అవుతాయి. కోనేరు శ్రీధర్ మేయర్, నగరపాలక సంస్థ. -
జలీల్‌ఖాన్‌కు మతి భ్రమించింది
వైఎస్సార్సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ నేత బియ్యపు మధుసూదనరెడ్డి శ్రీకాళహస్తి రూరల్ : విజయవాడ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు వుతి భ్రమించి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రావుచంద్రారెడ్డి టీడీపీలో చేరతారని చెబుతున్నారని వైఎస్సార్సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయుకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయున మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామాచంద్రారెడ్డి నీతి, నియమాలతో కూడిన రాజకీయంచేస్తూ ప్రజల అభిమానాన్ని పొందారని తెలిపారు. నిత్యం అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబునాయుడు దగ్గరకు వెళ్లే ప్రసక్తే లేదని చెప్పారు. రాజకీయాల్లో చంద్రబాబునాయుడుకు సమానంగా ఉన్న పెద్దిరెడ్డి ఆయన దగ్గరకు వెళ్లి పనిచేయాల్సిన కర్మ పట్టలేదన్నారు. ఒకరిపై ఆరోపణలు చేసే ముందు ఆలోచన చేసి మాట్లాడాలని తెలిపారు. జలీల్‌ఖాన్ అసత్య ఆరోపణలపై కోర్టుకు వెళ్లి పరువు నష్ట దావా వేస్తామని హెచ్చరించారు. -
విలేకరులపై దాడి దుర్మార్గం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ గుంటూరు రూరల్ : ప్రాణాలకు సైతం తెగించి ప్రజలకు సమాచారాన్ని అందించేందుకు నిత్యం కృషి చేసే విలేకరులపై ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తన అనుచరులతో దాడి చేయటం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. సోమవారం అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విప్ జారీ చేసేందుకు పార్టీ నాయకులు, సమాచారం మేరకు విలేకరులు అక్కడికి వచ్చారని, విప్ ఇవ్వలేదని అబద్ధం ఆడేందుకు తన మనుషులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఇటువంటి హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విప్‌ను అందుకోవాల్సి వస్తుందనే భయంతో జలీల్‌ఖాన్ ఈ విధంగా మతిస్థిమితం లేని పనులు చేస్తున్నాడన్నారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి ఇటువంటి వికృత చర్యలకు పాల్పడుతున్న జలీల్‌ఖాన్, అతని అనుచరులపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా విలేకరులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విప్‌ను జారీ చేసేందుకు వచ్చిన వారిపై దాడి చేయటం, ఆపై వారిపై కేసులు పెట్టి నమోదు చేయించటం విప్‌ను అందుకున్నానని జలీల్ ఖాన్ చెప్పకనే చెప్పినట్టని తెలిపారు. విప్‌ను అందుకున్నారని చెప్పటానికి జలీల్‌ఖాన్ పెట్టిన కేసు ప్రధాన ఆధారమన్నారు. నిజాన్ని రాసేందుకు ప్రజలకోసం పోరాడే విలేకరులపై దాడి జరిగిందంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంటగలిసినట్టేనని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ముందా!
జలీల్‌ఖాన్ వెళ్లాక పశ్చిమానికి పట్టిన పీడ విరగడైంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యులు విజయవాడ : పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే సత్తా అధికార పార్టీకి ఉందా? అని వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా వ్యవహారాల ఇన్చార్జి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాలు విసిరారు. పార్టీ మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో రాజీ నామా చేయించే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. బుధవారం చిట్టినగర్‌లో వైఎ స్సార్ సీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు రాజధాని పేరిట భూవ్యాపారం చేస్తూ కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారన్నారు. నదుల అనుసంధానం పేరిట దోపిడి, పట్టిసీమ పనుల్లో కాంట్రాక్టర్‌కు మేలు కలిగేలా 27 శాతం పెంచుతూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారన్నారు. నిబంధనలను పక్కన పెట్టి అసెంబ్లీని నడిపిస్తున్నారని, 29వ తేదీన బడ్జెట్‌కు అను కూలంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలతో ఓటు వేయించుకునే సత్తా టీడీపీకి ఉందా అని ప్రశ్నించారు. పశ్చిమంలో వైఎస్సార్ సీపీకి తిరుగులేదు పార్టీ నగర వ్యవహారాల ఇన్చార్జి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి తిరుగులేదని నిరూపితమైందన్నారు. వైఎస్సార్ సీపీకి వెన్నుపోటు పొడిచి పార్టీ మారిన ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి మాట్లాడుతూ మైనార్టీలను టీడీపీ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తానని విభజన చట్టంలో పేర్కొన్నప్పటికీ, ఒక రూపాయి తీసుకురాలేకపోయారన్నారు. నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ.. పశ్చిమం నుంచి ఎవరిని బరిలోకి దింపినా వారికి 40 వేల పైబడి మెజారిటీ వస్తుందని కార్యకర్తల ఉత్సాహాన్ని చూస్తే అర్థమవుతోందన్నారు. పార్టీ రాజ కీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ జలీల్‌ఖాన్ వెంట గన్‌మెన్, కారు డ్రైవర్, మరో ఇద్దరే వెళ్లారని ఎద్దేవాచేశారు. జలీల్ఖాన్ను గెలిపించే సత్తా ఉందా? యువజన విభాగం రాష్ర్ట అధ్యక్షుడు వంగవీటి రాధా మాట్లాడుతూ జలీల్‌ఖాన్‌తో రాజీనామా చేయించి అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీకి తిరిగి గెలిపించుకునే సత్తా ఉందా అని ప్రశ్నించారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి మాట్లాడుతూ పార్టీలో పదవులు అనుభవించి కార్యకర్తలను, నమ్మిన పార్టీకి వెన్నుపోటు పొడిచిన గలీజ్ఖాన్ పీడ విరగడైందన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, సిగ్గు, లజ్జ ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికల్లో గెలవాలని సవాల్ విసిరారు. గుంటూరు జిల్లా పరిషత్ పార్టీ ఫ్లోర్‌లీడర్ దేవళ్ల రేవతి, పార్టీ నాయకులు బండి నాగేంద్ర పుణ్యశీల, బేగ్, కాలే పుల్లారావు అశోక్‌యాదవ్, కర్నాటి రాంబాబు పాల్గొన్నారు. పశ్చిమ వైఎస్సార్ సీపీలో నూతనోత్తేజం పశ్చిమ నియోజకవర్గ సమావేశం క్యాడర్లో నూతనోత్తేజం నింపింది. ‘ప్రతి వీధిలోనూ పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నారు. ఎంత మంది జలీల్‌ఖాన్‌లు పార్టీ పోయినా క్యాడర్ మాత్రం చెక్కుచెదరదు. క్యాడర్ గురించి మీరు ఆలోచించకుండా మేం చేయాలో చెప్పిండి’ అంటూ ఓ కార్యకర్త ప్రసంగించారు. క్యాడర్లో ఆత్మ విశ్వాసం నింపటమే లక్ష్యంగా పార్టీ ముఖ్యులు కసరత్తు చేశారు. నగర పరిశీలకుడు లేళ్ల అప్పిరెడ్డి, ఉత్తర, దక్షిణ కృష్ణా అధ్యక్షులు కొలుసు పార్థసారథి, కొడాలి నాని శ్రేణులతో మాట్లాడి అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారు. పార్టీ ముఖ్య నేతలకు పశ్చిమ నియోజకవర్గ క్యాడర్ ఆపూర్వ స్వాగతం పలికారు. పార్టీ జిల్లా వ్యవహారాల పరిశీలకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పార్టీ నాయకులు గజమాలతో సత్కరించారు. -
నమ్మకద్రోహి జలీల్‌ఖాన్
వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు 6న విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని నిర్ణయం వన్‌టౌన్ : టిక్కెట్ ఇచ్చిన పార్టీని, ఓట్లు వేసిన ప్రజలను, కష్టపడి గెలిపించిన కార్యకర్తలకు ద్రోహం చేసి అమ్ముడుపోయిన జలీల్‌ఖాన్ నమ్మకద్రోహి అని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. జలీల్‌ఖాన్ పార్టీని వీడటం వలన పార్టీకి గ్రహణం వీడిందని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య నాయకుల సమావేశం వన్‌టౌన్‌లోని మాఇల్లు ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగింది. నగర పాలక సంస్థ పార్టీ ఫ్లోర్‌లీడర్ బండి పుణ్యశీల మాట్లాడుతూ టిక్కెట్ ఇచ్చి గెలిపించిన పార్టీని, కార్యకర్తలను మోసం చేసి జలీల్‌ఖాన్ తెలుగుదేశంలో చేరటం దుర్మార్గమన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామా దేవరాజు మాట్లాడుతూ పార్టీ శ్రేణులందరూ కష్టపడి జలీల్ఖాన్ను గెలిపిం చుకుంటే ఈ విధమైన వెన్నుపోటు పోడవటం దారుణమన్నారు. కాగా 6న జరిగే నియోజకవర్గ సమావేశాన్ని జయప్రదంచేయాలన్నారు. 36వ డివిజన్ పార్టీ కన్వీనర్ గౌస్‌మొహిద్దీన్ అధ్యక్షత వహించగా కార్పొరేటర్లు జమల పూర్ణమ్మ, సంధ్యారాణి, బీజాన్బీ, ఎస్సీ సెల్ రాష్ట్ర నేత బూదాల శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ ఆవాల మారుతి, స్థాయీ సంఘం మాజీ అధ్యక్షుడు దాడి అప్పారావు, సీనియర్ నేత కంపా గంగాధరరెడ్డి, డివి జన్ నాయకులు మనోజ్‌కొఠారి, పోతిరెడ్డి సు బ్బారెడ్డి, పప్పుల రమణారెడ్డి, పరకాల జోషి, కర్నాటి రాంబాబు, శ్రీకాంత్, సంగీత్‌బాబు, ఎద్దు సురేష్, పోలురెడ్డి, పాండు, తమ్మిన నరసింహారావు, ఛటర్జీ, అశోక్ పాల్గొన్నారు. నాయకుల రక్తాన్ని పీల్చి పిప్పి చేశాడు జలీల్‌ఖాన్ వైఎస్సార్ సీపీ నాయకుల రక్తాన్ని పీల్చిపిప్పి చేసి గెలిచారని 50వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయకుమార్ అన్నారు. కేవలం తనకు ముడుపు లు ఇచ్చే వారిని పక్కన పెట్టుకొని మంతనాలు చేశారే తప్ప కార్యకర్తలకు ఎప్పు డూ అండగా లేరన్నారు. జలీల్ వెళ్లిపోవడంతో పార్టీ మరింత పటిష్టమైందన్నారు. - బుల్లా విజయకుమార్, 50వ డివిజన్ కార్పొరేటర్ ప్రజలకు చేసిందేమీ లేదు జలీల్‌ఖాన్ పార్టీలో ఉండి ఇక్కడి ప్రజలకు కానీ, కార్యకర్తలకు గానీ చేసిందేమి లేదని 40వ డివిజన్ కార్పొరేటర్ ఆసీఫ్ అన్నారు. గడిచిన రెండు సంవత్సరాలుగా తనకు ఓట్లు వేసిన ప్రజలకు ఏమి చేయలేదని జలీల్‌ఖానే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. అలాగే పార్టీని వీడిపోయిన ఆయన గురించి మాట్లాడటం వృథా అని పేర్కొన్నారు. ఆసీఫ్, 40వ డివిజన్ కార్పొరేటర్ -
కుక్కకాటుపై స్పందించరేం!
అసెంబ్లీలో జలీల్‌ఖాన్ ధ్వజం కొల్లేరు సమస్యపై చిత్తశుద్ధితో వ్యవహరించాలని సూచించిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని రోజాపై గోరంట్ల వ్యాఖ్యలను ఖండించిన పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కృష్ణానదిలో మురుగునీరు కలవకుండా నిరోధించాలన్న గద్దె జవాబులకే పరిమితమైన జిల్లా మంత్రులు నగరంలో ఒక బాలుడిని కుక్కలు కరిస్తే.. ప్రభుత్వాస్పత్రిలో మందులే అందుబాటులో లేకపోవడాన్ని చూస్తే ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుస్తోంది. కుక్కకాటుకు మందు లేకుండా ఆస్పత్రులు నడుస్తున్నాయి. నగరంలో కుక్కలు స్వైరవిహారం చేస్తుంటే పాలకులు పట్టించుకోవడం లేదు. అని పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మంగళవారం అసెంబ్లీలో గళమెత్తారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతున్నప్పుడు అసెంబ్లీలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లేకపోవడం గమనార్హం. విజయవాడ : ఐదురోజులపాటు జరిగిన రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల్లో పలు సమస్యలపై జిల్లా ఎమ్మెల్యేలు చర్చించారు. రాష్ట్ర అసెంబ్లీలో జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, డెప్యూటీ స్పీకర్ ఉన్నప్పటికీ జిల్లాకు అవసరమైన అనేక అంశాలపై స్పందించలేదు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ శాసనసభ్యులు.. కొల్లేరు, సీఆర్డీఏ, ఆస్పత్రుల్లో మందుల కొరత తదితర అంశాలపై అధికారపక్షాన్ని నిలదీశారు. సీఆర్డీఏ బిల్లుపై చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ శాసనసభ డెప్యూటీ ఫ్లోర్‌లీడర్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) మాట్లాడుతూ రైతుల భూములతో ప్రభుత్వం వ్యాపారం చేయడం మంచిది కాద న్నారు. పైగా అక్కడ నివసిస్తున్న పేదలు, వ్యవసాయకూలీలు, కార్మికులు, చేతివృత్తుల వారి గురించి సీఆర్డీఏ బిల్లులో ఎటువంటి ప్రస్తావనా లేకపోవడాన్ని నిలదీశారు. వారికి అన్యాయం చేయాలని చూస్తే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. రాజధాని కోసం భూములు సేకరించే తాడేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలను విన్నామని, వారు చెబుతున్న ప్రకారం అక్కడ భూములు లేని పేదలు, కౌలు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పారు. వారికి తగిన విధంగా ప్రభుత్వం భారీస్థాయిలో సాయం అందించకుంటే పోరాటాన్ని ఉధృతం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కొల్లేరు కాంటూరు అంశంపై చర్చలో భాగంగా నాని మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి తీర్మాన కాపీలు ఇచ్చారని, ఇప్పుడేదో ప్రత్యేకంగా కొల్లేరుపై ఐదు నుంచి మూడు వరకు కాంటూరును తగ్గిస్తున్నట్లు చెప్పుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని తెలిపారు. ఇప్పటికైనా చిత్తశుద్ధితో కాంటూరు కుదింపు చేసి అక్కడి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. గోరంట్ల వ్యాఖ్యలకు ఖండన వైఎస్సార్సీపీ పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ మహిళలపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని ప్రశ్నించారు. టీడీపీ నాయకులకు మహిళలపై ఏపాటి గౌరవం ఉందో అర్థమవుతోందన్నారు. తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ నగరంలోని మురుగునీరు కృష్ణానది, కాలువల్లో కలుస్తుండటంతో మంచినీరు కలుషితమవుతోందన్నారు. జిల్లాలోని పలు మండలాల్లో ఉన్న ప్రజలు ఈ నీటినే తాగుతున్నారని, ఇందువల్ల తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మురుగునీటిని కాలువల్లో కలపకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మంత్రులు కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరావు ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. మిగిలిన ఎమ్మెల్యేలు కుర్చీలకే పరిమితమయ్యారు. -
మాది ప్రజాపక్షం
విజయవాడ ‘పశ్చిమ’ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ విజయవాడ, న్యూస్‌లైన్ : అక్రమాలు చేయడం, మాయమాటలు చెప్పడం వల్లే టీడీపీ అధినేత చంద్రబాబుకు గెలుపు సాధ్యమైందని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ చెప్పారు. ప్రజాతీర్పును గౌరవిస్తామని, ప్రజాపక్షం వహించి వారి సమస్యలపై ఆలుపెరుగని పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. తారాపేటలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జలీల్‌ఖాన్ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కొత్తగా స్థానికేతరులను ఓటర్లుగా చేర్పించి అధర్మ రాజకీయాలకు పాల్పడిందని గుర్తుచేశారు. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న చంద్రబాబు ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలని విచ్చలవిడిగా నగదు పంపిణీ చేసి అక్రమ పద్ధతులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఒంటరి పోరాటం చేసిన వైఎస్సార్ సీపీని ఎదుర్కోలేక చంద్రబాబు మోడీని, పవన్‌కల్యాణ్‌లతో జతకట్టి అధర్మ యుద్ధానికి పాల్పడ్డారన్నారు. చంద్రబాబు నేడు సీమాంధ్రకు మేలు చేస్తారంటే నమ్మే పరిస్థితి లేదన్నారు. బెజవాడను రాజధాని చేయాలి చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుపై ఏమాత్రం గౌరవం ఉన్నా, సీమాంధ్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉన్నా అన్ని అర్హతలున్న విజయవాడను కొత్త రాష్ట్రానికి రాజధాని చేయాలని జలీల్‌ఖాన్ డిమాండ్ చేశారు. విజయవాడ-గుంటూరు మధ్యనే హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్యేలందరినీ సమదృష్టితో చూసి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. నియోజకవర్గ సమస్యలపై పోరాడతా.. నగరంలో ట్రాఫిక్ సమస్య ప్రధానంగా ఉందని జలీల్‌ఖాన్ చెప్పారు. తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎన్‌హెచ్-9, ఎన్‌హెచ్-5ను కలపాలని, అవసరమైన చోట్ల ఫ్లైవోవర్లు నిర్మించాలని అసెంబ్లీలో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని గుర్తుచేశారు. నగరాన్ని బుడమేరు ముంపు సమస్య వెంటాడుతోందని, దాని శాశ్వత పరిష్కారానికి ఆయనపై ఒత్తిడి తీసుకొస్తానని వివరించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంలో నాటి పాలకులు అనేక అవకతవకలకు పాల్పడ్డారని, దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టి త్వరితగతిన దాని నిర్మాణం పూర్తి చేస్తానన్నారు. అందరి అండతోనే గెలిచా.. తనకు మైనార్టీ, ఎస్సీ వర్గాలతోపాటు ఆర్యవైశ్యులు, నగరాలు, బీసీలు, ఎస్టీలు తదితర వర్గాల ప్రజలు అండగా నిలిచారని, వారి అభ్యున్నతి కోసం పాటుపడతానని జలీల్‌ఖాన్ వివరించారు. -
సమైక్య బంద్ సంపూర్ణం
=ఆగిన ఆర్టీసీ బస్సులు = వాయిదాపడిన పరీక్షలు సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పిలుపుమేరకు శుక్రవారం జిల్లావ్యాప్తంగా బంద్ జరిగింది. అనేకచోట్ల జనజీవనం స్తంభించింది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, తెలుగుదేశం పార్టీలు కూడా బంద్ నిర్వహించాయి. సమైక్యవాదులు బస్ డిపోల ముందు బైఠాయించడంతో ఎక్కడి బస్సులు అక్కడ నిలిచిపోయాయి. జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. జిల్లాలోని విద్యాసంస్థలు, బ్యాంకులు, వర్తక, వాణిజ్య దుకాణాలు, హోటళ్లు, పెట్రోల్ బంక్‌లు, గ్యాస్ కంపెనీలు, మునిసిపల్ కార్యాలయాలు పూర్తిగా మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు సాయంత్రం వరకు తిరగకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ‘బంద్ కారణంగా ఈరోజు పాఠశాలకు సెలవు’ అని బోర్డులు పెట్టి మరీ సహకరించాయి. విజయవాడలో ఎన్జీవోలు తెల్లవారుజాము నుంచే బస్టాండ్ ఎదుట బైఠాయించి బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. తెలుగు ప్రజలను ఏ ప్రాతిపదికన విభజిస్తున్నారో చెప్పకుండా అడ్డగోలుగా నిర్ణయం తీసుకోవడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ విమర్శించారు. తెలుగుజాతి ముక్కలు కాకుండా చూడటానికి చిత్తశుద్ధితో పని చేస్తున్న ఏకైక నేత వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని చెప్పారు. బంటుమిల్లి చౌరస్తాలో వ ంటావార్పు నిర్వహించారు. పెడనలో 216 జాతీయ రహదారిపై బైఠాయించారు. కంచికచర్లలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. టీడీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కలిదిండి సెంటరులో వైఎస్సార్సీపీ నాయకులు టైర్లు అంటించి నిరసన తెలియజేశారు. జగ్గయ్యపేటలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు, సమైక్యవాదులు తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి కార్యాలయాన్ని మూసివేయించి అక్కడే ధర్నా చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ, విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ విధానం రద్దు కోరుతూ హనుమాన్‌జంక్షన్‌లో శుక్రవారం ఆందోళన చేశారు. బంద్ వల్ల ఆర్టీసీకి రూ.90 లక్షల మేర నష్టం ఏర్పడిందని అధికారులు తెలిపారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో... పెనమలూరు మండలంలో సమన్వయకర్తలు తాతినేని పద్మావతి, పడమట సురేష్‌బాబు, పామర్రులో ఉప్పులేటి కల్పన, తిరువూరు నియోజకవర్గంలో బండ్రపల్లి వల్లభాయ్, నూజివీడులో మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, నందిగామలో డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, కైకలూరులో దూలం నాగేశ్వరరావు, మైలవరంలో జోగి రమేష్, యువ నేత జ్యేష్ఠ శ్రీనాధ్, అవనిగడ్డలో సింహాద్రి రమేష్‌బాబుల ఆధ్వర్యంలో రాస్తారోకోలు, బంద్ కార్యక్రమాలు నిర్వహించారు. జగ్గయ్యపేటలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తన్నీరు నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు షేక్ మదార్‌సాహెబ్ ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. -
'చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలి'
వైఎస్ జగన్ బెయిల్‌ను అడ్డుకునేందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జలీల్‌ఖాన్ ఆరోపించారు. తన ఆస్తుల చిట్టాను తారుమారు చేసిన చాణిక్యుడు చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తన మొత్తం కుటుంబ ఆస్తి రూ.62.30 కోట్లేనని చంద్రబాబు నాయుడు సోమవారం వెల్లడించారు. తన పేరిట రూ. 42.06 లక్షల ఆస్తులు ఉన్నాయని ఆయన ప్రకటించారు. తన భార్య భువనేశ్వరికి రూ48.85 కోట్లు, తన కుమారుడు లోకేష్ కు రూ.9.73 కోట్లు, కోడలు బ్రహ్మణికి రూ. 3.3 కోట్లు విలువ చేసే ఆస్తులున్నట్టు చంద్రబాబు చెప్పారు. అయితే చంద్రబాబు ప్రకటించిన ఆస్తులు కాకి లెక్కలనీ వైఎస్సార్ కాంగ్రెస్ నేత జూపూడి ప్రభాకర్ ఆరోపించారు.