జలీల్‌ఖాన్‌కు మతి భ్రమించింది | ysrcp leaders fire on Jalilkhan | Sakshi
Sakshi News home page

జలీల్‌ఖాన్‌కు మతి భ్రమించింది

Published Fri, Apr 15 2016 2:16 AM | Last Updated on Mon, Oct 29 2018 8:24 PM

జలీల్‌ఖాన్‌కు  మతి భ్రమించింది - Sakshi

జలీల్‌ఖాన్‌కు మతి భ్రమించింది

వైఎస్సార్‌సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ నేత బియ్యపు మధుసూదనరెడ్డి

 

శ్రీకాళహస్తి రూరల్ : విజయవాడ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు వుతి భ్రమించి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రావుచంద్రారెడ్డి టీడీపీలో చేరతారని చెబుతున్నారని వైఎస్సార్‌సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయుకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయున మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామాచంద్రారెడ్డి నీతి, నియమాలతో కూడిన రాజకీయంచేస్తూ ప్రజల అభిమానాన్ని పొందారని తెలిపారు.

నిత్యం అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబునాయుడు దగ్గరకు వెళ్లే ప్రసక్తే లేదని చెప్పారు. రాజకీయాల్లో చంద్రబాబునాయుడుకు సమానంగా ఉన్న పెద్దిరెడ్డి ఆయన దగ్గరకు వెళ్లి పనిచేయాల్సిన కర్మ పట్టలేదన్నారు. ఒకరిపై ఆరోపణలు చేసే ముందు ఆలోచన చేసి మాట్లాడాలని తెలిపారు. జలీల్‌ఖాన్ అసత్య ఆరోపణలపై కోర్టుకు వెళ్లి పరువు నష్ట దావా వేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement