విజయనగరం కంటోన్మెంట్: జన్మభూమి గ్రామసభల్లో అర్హులందరికీ రేషన్ కార్డులిస్తామంటే ఇబ్బడి ముబ్బడిగా దరఖాస్తు చేసుకున్నారు. కానీ కనీసం సగం మందికి కూడా కార్డులు అందించలేదు. ఇప్పటికీ గ్రామాలు, వార్డుల్లోని అర్హులు సీఎస్‌డీటీలు, మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ముందుగా సంక్రాంతి సరుకులిచ్చేసి చేతులు దులుపుకున్నారు.జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం 58,880 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హులుగా 55,684 మందిని గుర్తించారు. జన్మభూమి కమిటీల రాజకీయం కార ణంగా ఇందులోనూ కోత విధించి సుమారు 47వేల మందికి రేషన్ కార్డులు ఇస్తున్నామని ప్రకటించారు.
జన్మభూమి గ్రామసభల్లో అరకొరగా పంపిణీ చేసేసి మిగతా కార్డులన్నీ తరువాత ఇస్తామని గ్రామసభల్లో చెప్పి తప్పించుకున్నారు. తరువాత వాటిని పూర్తిగా విస్మరించారు. వారికి ఫిబ్రవరి నుంచి సరుకులు అందుతాయో లేదోనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బొండపల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన గ్రామసభలో కేవలం ఎనిమిది కార్డులు ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నారు. అక్కడ సుమారు 40 మంది అర్హులున్నారు. వారికి ఇంకా ఇవ్వనేలేదు. అలాగే ప్రతీ మండలానికి కూడా కేవలం సగం కార్డులు మాత్రమే వచ్చినట్టు చెబుతున్నారు. విజయనగరం మండలంలో దాదాపు 4వేలపైచిలుకు అర్హులుంటే కేవలం వందల్లోనే కార్డులు పంపిణీ అయ్యాయి. జిల్లాలో పంపిణీ చేయాల్సిన రేషన్ కార్డుల ముద్రణ ఇంకా జరుగలేదని తెలుస్తున్నది.
అరకొరే..!
Published Fri, Jan 22 2016 1:05 AM | Last Updated on Sun, Sep 3 2017 4:03 PM
Advertisement