జనం లేని జన్మభూమి | Janmabhoomi is not going on well | Sakshi
Sakshi News home page

జనం లేని జన్మభూమి

Published Fri, Jun 5 2015 4:20 AM | Last Updated on Mon, Aug 20 2018 3:21 PM

జనం లేని జన్మభూమి - Sakshi

జనం లేని జన్మభూమి

- తూతూమంత్రంగా గ్రామసభలు
- అర్జీల స్వీకరణకే పరిమితం
- వైద్య శిబిరాలకు స్పందన కరువు
విజయవాడ సెంట్రల్ :
జన్మభూమి గ్రామ సభలు అధికారుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజల నుంచి అర్జీలు తీసుకొనేందుకే సభలు పరిమితం అయ్యాయి. సామాజిక పింఛన్లు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. ఈక్రమంలో రెండు గంటల పాటు అర్జీలు ఇచ్చే జనం కోసం అధికారులు ఎదురు చూడాల్సి వస్తోంది. జనం లేక పోవడంతో సభలు బోసిపోతున్నాయి. గురువారం పశ్చిమ నియోజకవర్గంలోని 27, 35, 36, సెంట్రల్ నియోజక వర్గంలో 42, 21, 43, 44, తూర్పు నియోజక వర్గంలో 1, 2, 3, 11, 17 డివిజన్లలో గ్రామసభలు నిర్వహించారు. 21, 17 డివిజన్లలో ప్రజారోగ్యశాఖ అధికారులు వైద్య శిబిరాలు చేపట్టారు. బృంద నాయకులు ఎ.ఉదయ్‌కుమార్, పి.మధుకుమార్, ఎం.రవికుమార్, పి.గంగరాజు, జె.శ్రీనివాసరావు, ఎం.ఐజాక్‌బాబు, ఎ.నాగకుమార్ తదితరులు పాల్గొన్నారు.

నేటి షెడ్యూల్ ఇదీ..
జన్మభూమి-మాఊరులో భాగంగా శుక్రవారం పశ్చిమ నియోజక వర్గంలోని 28వ డివిజన్ ప్రియదర్శిని కాలనీ రిజర్వాయర్, 37వ డివిజన్ కేబీఎస్ కళాశాల వెనుక రాఘవరెడ్డి రోడ్డులో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, 38వ డివిజన్ చేపల మార్కెట్ వెనుక శిల్పా ఆశ్రమం రోడ్డులో ఉదయం 10.15 నుంచి 12.15 వరకు సభల నిర్వహించనున్నారు.

సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో 45వ డివిజన్ మధురానగర్ రిజర్వాయర్ వద్ద, 46వ డివిజన్ గొట్టుముక్కల సూర్యనారాయణ మునిసిపల్ స్కూల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, 47వ డివిజన్ ఏకేటీపీ స్కూల్లో, 51వ డివిజన్ అయోధ్యనగర్ సూర్య పబ్లిక్ స్కూల్లో ఉదయం 10 నుంచి 12.15 వరకు గ్రామసభలు జరగనున్నాయి.

తూర్పు నియోజకవర్గంలో 4వ డివిజన్ బెతల్హమ్‌నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద, 12వ డివిజన్ దర్శిపేట రాజరాజేశ్వరీ కల్యాణమండం వద్ద, 24వ డివిజన్ కృష్ణలంక గంగానమ్మ గుడివద్ద, ఉదయం 8నుంచి 10 గంటల వరకు, 6వ డివిజన్ చుట్టగుంట చైతన్య కళాశాల రోడ్డు, 13వ డి విజన్ ఫకీర్‌గూడెం కమ్యూనిటీ హాల్లో ఉదయం 10.15 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు జన్మభూమి సభలు నిర్వహించనున్నట్లు నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement