మచిలీపట్నం, న్యూస్‌లైన్ : రాష్ట్ర హైకోర్టు జడ్జిలు జస్టిస్ అశుతోష్ మొహంత, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఈ నెల 26న మచిలీపట్నం రానున్నారు. ఆ రోజు ఉదయం 10.20 గంటలకు మచిలీపట్నంలోని అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనాలను వారు ప్రారంభిస్తారు. అనంతరం అక్కడినుంచి బయల్దేరి ఉదయం 11.30 గంటలకు విజయవాడ చేరుకుంటారు. అక్కడ 6వ, 7వ అదనపు సీనియర్ సివిల్ జడ్జిల కోర్టు భవనాలను ప్రారంభిస్తారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తారు. జస్టిస్ అశుతోష్ మొహంత సాయంత్రం ఐదు గంటలకు విమానంలో బయలుదేరి హైదరాబాదు వెళతారు. జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి రాత్రి 10.50 గంటలకు మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాదుకు బయల్దేరతారు.
హైకోర్టు జడ్జిలు 26న రాక
Published Fri, Apr 25 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 6:28 AM
Advertisement
Advertisement