కడప కార్పొరేషన్: కడప నగరానికి తాగునీటి సమస్యను శాశ్వతంగా దూరం చేయాలని దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కన్న కలలు త్వరలోనే నెరవేరబోతున్నాయి. 2009లో వైఎస్ కడపకు సోమశిల వెనుక జలాలను తీసుకొచ్చేందుకు రూపొం దించిన ప్రాజెక్టుకు రూ. 780 కోట్లు మంజూరు చేశారు. కొద్దిమేర పనులు కూడా పూర్తి చేయించారు. ఆయన మరణానంతర ం ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా మూలనపడేశారు. కడప కార్పొరేషన్‌కు కొత్త పాలక వర్గం ఏర్పాటయ్యాక ఈ స్కీంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.
మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషా నేతృత్వంలో సమావే శం ఏర్పాటు చేసి జే సీఈ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో రూపొందించిన డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను సమీక్షించారు. కాగా దివంగత వైఎస్‌ఆర్ కడప, ప్రొద్దుటూరుల మీదుగా హిందూపురం వరకూ నీటిని తీసుకుపోవడానికి ప్రాజెక్టు రూపకల్పన చేయగా, ప్రస్తుతం కడప వరకూ మాత్రమే పరిమితం కానుంది.
2045 వరకూ 6.50లక్షల జనాభాకు సరిపడా తాగునీరు
2045 సంవత్సరం వరకూ 6.50 లక్షల మంది జనాభాకు ఒక్కొక్కరికి రోజుకు 155 లీటర్లు చొప్పున తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ వాటర్ సప్లై ఇంప్రూవ్‌మెంట్ స్కీం తయారైంది. దీని ప్రకారం సోమశిల బ్యాక్ వాటర్ వద్ద ఒక ఇంటేక్ వెల్ నిర్మిస్తారు. అక్కడి నుంచి మూడున్నర కి.మీల దూర ంలో ఎత్తులో ఉన్న కొండపై స్టోరేజీ ట్యాంకు నిర్మిస్తారు. ఇంటేక్ వెల్ నుంచి కొండపైనున్న స్టోరేజీ ట్యాంకుకు పంపింగ్ ద్వారా నీటిని తరలిస్తారు. ఆ కొండ నుంచి కడప సమీపంలో ఉన్న కనుమలోపల్లె వరకూ అంతా వాలుగా ఉండటం వల్ల గ్రావిటీ ఆధారంగా నీటిని తీసుకొస్తారు. కనుమలోపల్లె వద్ద ఐదెకరాల రెవెన్యూ భూమిని సేకరించి అక్కడ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మిస్తారు. ట్రీట్‌మెంట్ ప్లాంట్ నుంచి సెంట్రల్ జైలు సమీపంలోని పంపింగ్‌మైన్ వద్దకు పైపులైన్‌ను తీసుకొచ్చి అక్కడ నగరానికి తాగునీరు సరఫరా చేసే పైపులైన్‌కు కనెక్ట్ చేస్తారు.
ఈ క్రమంలో కనుమలోపల్లె వద్దనున్న భూమిని కార్పొరేషన్‌కు అప్పగించాలని రెవెన్యూశాఖకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం స్థానంలో ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం కొత్త అర్బన్ డెవెలప్‌మెంట్ పథకాన్ని తీసుకురానుంది. ఇందులో ఈ స్కీంను ఎలాగైనా మంజూరు చేయించుకోవాలని కొత్తపాలకవర్గం కృతనిశ్చయంతో ఉంది. ఈ స్కీం మంజూరైతే కడపలో పైప్‌లైన్‌ను రీమోడల్ చేసేందుకు రూ. 150 కోట్లు, అవసరమైన చోట ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించుకునేందుకు రూ. 36 కోట్లు ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంది.
విద్యుత్ ఆదాకు తరుణోపాయం
ప్రతిఏటా విద్యుత్ చార్జీల రూపేణా నగరపాలకసంస్థ విద్యుత్ శాఖకు కోటిరూపాయలకుపైగా చెల్లిస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల ఆ ఖర్చు మరింత పెరగకుండా అధికారులు తరుణోపాయం ఆలోచించారు. సోమశిల బ్యాక్ వాటర్ నుంచి కడప వరకూ సుమారు 35 కి.మీలు పంపింగ్ చేస్తే విద్యుత్ చార్జీలకు కోట్లాదిరూపాయలు ఖర్చు అవుతుంది. కార్పొరేషన్‌కు ఇది పెనుభారం అయ్యే అవ కాశం ఉంది. అందుకే పైపులైన్‌ను మూడున్నర కి.మీల దూరంలోనున్న కొండపైకి తీసుకుపోయి అక్కడి నుంచి గ్రావిటీ ఆధారంగా నీటిని తీసుకురావాలని ప్రణాళిక రూపొందిం చిన ట్లు తెలుస్తోంది. నగరపాలక అధికారులు శుక్రవారం జేసీఈ కన్సల్టెన్సీ రూపొం దించిన డీపీఆర్‌ను ఫీల్డ్‌లెవల్‌లో పరిశీలించారు.
త్వరలో కడప కలలు సాకారం
Published Sun, Jul 20 2014 3:02 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement
Advertisement