లిఫ్ట్‌లో భాగంగా కండలేరు వద్ద ఏర్పాటు చేసిన మోటార్లు
మనుబోలు: అధికార పార్టీ చేస్తున్న సాగునీటి రాజకీయాలకు మనుబోలు మండలంలోని బండేపల్లి బ్రాంచ్ కా లువ ఆయకట్టు రైతులు నష్టపోతున్నారు. మండలంలో హైవేకి పడమటి వైపు ఉన్న సుమారు 10 గ్రామాల రైతులు కనుపూరు కాలువకు అనుబంధంగా మండలంలో విస్తరించిన బండేపల్లి బ్రాంచ్ కాలువపై ఆధారపడి ఏటా సుమారు 8 వేల ఎకరాల్లో రైతులు వరిని సాగు చేస్తారు. అయితే కనుపూరు కాలువకు బండేపల్లి బ్రాంచ్ కాలువ చివరిన ఉండడంతో సాగునీరందక ఏటా ఈ ప్రాంతంలో పంటలు ఎండిపోవడం పరిపాటిగా మారిం ది. దీన్ని దృష్టిలో ఉంచుకుని 2014 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్ర స్తుత మంత్రి సోమిరెడ్డి తాము అధికారంలోకి వస్తే డేగపూడి–గొట్లపాలెం లింక్ కెనాల్‌ను పూర్తి చేసి మండలంలోని బ్రాంచ్ కెనాల్ పరిధిలో ఉన్న మెట్ట గ్రామాలను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే నాలుగేళ్లు గడిచినా డేగపూడి–గొట్లపాలెం కాలు వకు ఇంతవరకూ అతి గతి లేదు. మరో వైపు బ్రాంచ్ కాలువకు సక్రమంగా నీరు విడుదల కాక పంటలు ఎండిపోతున్నాయి. దీని కారణంగా రైతుల నుంచి వచ్చే వ్యతిరేకత నుంచి తప్పంచుకునేందుకు ఇటీవల రూ.49 లక్షలతో రాజోలుపాడు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు.
ఇందులో భాగంగా రాజోలుపాడు వద్ద నుంచి కండలేరు నీటిని లిఫ్ట్ ద్వారా బ్రాంచ్ కాలువలో కలిపి పంటలు ఎండకుండా చూస్తామని చెప్పారు. దీంతో మండల టీడీపీ నాయకులు సోమి రెడ్డిని అపర భగీరథుడంటూ పొగడ్తలు గుప్పిస్తున్నారు. అయితే కండలేరు నీటిని మోటార్ల ద్వారా పంపింగ్ చేసి, ఆపై కాలువ ద్వారా బ్రాంచ్ కాలువలో కలిపే క్రమంలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను ఇంజినీర్లు పట్టించుకోలేదు. రివర్స్ గ్రేడియంట్(దిగువ నుంచి ఎగువకు)లో కేవలం 4 పైపుల ద్వారా కాలువలో నీటిని పంపడంతో నీరు ముందుకు కదలక ఈ పథకం విఫలమైంది. దీంతో సాగునీరందక రైతుల పంటలు ఎండిపోతున్నాయి. వారం రోజుల క్రితం రాజోలుపాడు లిఫ్ట్ పథకాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కాకాణి అందులో ఉన్న లోపాలను ఎండగట్టారు. దీన్ని సహించలేని టీడీపీ నాయకులు రోజూ ప్రెస్ మీట్లు పెడుతూ రాజోలుపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం బ్రహ్మాండమని, బ్రాంచ్ కెనాల్ పరిధిలో ఒక్క ఎకరా కూడా ఎండనివ్వమని హామీలు గుప్పిస్తున్నారు. కాగా వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా పొదలకూరు వచ్చినప్పుడు ఆయన దృష్టికి మండలంలోని మెట్ట రైతుల దుస్థితిని ఎమ్మెల్యే కాకాణి తీసుకెళ్లారు. దీంతో అధికారంలోకి వచ్చిన ఏడాది లోపు లింక్ కెనాల్ పూర్తి చేసి సాగునీరు ఇస్తామని జగన్ మోహన్‌రెడ్డి బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ఆయన హామీ రైతుల్లో భవిష్యత్తుపై భరోసా నింపుతోంది.
తుగ్లక్ పనిలా ఉంది
రాజోలుపాడు ఎత్తిపోతల పథకం పిచ్చి తుగ్లక్ పనుల ను తలపిస్తోంది. దిగువ నుంచి ఎగువకు నీటిని పం ప డం ఎక్కడైనా చూశామా. ఒకవేళ అలా చేయాలన్నా వా లును, గురుత్వాకర్షణ శక్తిని కొలతలు వేసుకుని ఎంత నీటిని లిఫ్ట్ చేస్తే వాలును అధికమించి ఎగువకు చేరుతుందో లెక్కలేసుకుని చేయాల్సి ఉంటుంది. అదేమీ లేకుండా రూ.లక్షల ప్రజాధనం వెచ్చించి ఇలాంటి పనులు చేయడం రైతులను వంచించడమే. చెప్పిన ప్రకారం లింక్ కెనాల్‌ను పూర్తి చేయలేక, వచ్చే ఎన్నికల్లో ముఖ మెలా చూపాలో తెలియక రైతుల దృష్టి మళ్లించేందుకు మంత్రి సోమిరెడ్డి వేసిన ఎత్తు ఇది.
– కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment