
కాకినాడ రూరల్: వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఎలాంటి ఆటంకాలు లేవని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌శాఖల మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రైతులు నష్టపోకుండా టమాటా నుంచి అరటి వరకూ అన్ని పంటలనూ ప్రభుత్వమే కొని, మార్కెటింగ్ చేస్తోందన్నారు. స్విగ్గీ, జొమాటో సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని, సోమ వారం నుంచి ఆ సంస్థల ద్వారా కూరగాయలు హోమ్ డెలివరీ చేస్తామని చెప్పారు.
► ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఇకపై గ్రామస్థాయిలోనే విత్తనాల విక్రయాలు చేపడతాం.
► దాదాపు 5.5 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను పంపిణీకి సిద్ధం చేశాం.
► పిఠాపురం, పరిసర ప్రాంతాల్లో కర్ర పెండలం పెద్దఎత్తున పండుతోంది. ఎమ్మెల్యే పెండెం దొర బాబు విజ్ఞప్తి మేరకు ప్రభుత్వమే కిలో రూ.13కు కొనుగోలు చేసి, రైతు బజార్లకు పంపుతోంది.
► రోజుకు 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం, మొక్కజొన్న 80 వేల టన్నులు కొన్నాం. శనగలు 1.20 లక్షల మెట్రిక్ టన్నులు, కందులు 47 వేల మెట్రిల్ టన్నులు, పసుపు 100 మెట్రిక్ టన్నులను ప్రభుత్వం కొనుగోలు చేసింది.
► నెలాఖరు నాటికి రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తాం. అర్హత గలవారు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment