ప్రభుత్వానికి కాపునాడు హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం చేసిన నిరాహార దీక్షకు మద్దతు తెలిపారన్న సాకుతో ప్రభుత్వ శాఖల్లోని కాపు ఉద్యోగులను ఉన్నతాధికారులు వేధిస్తున్నారని కాపునాడు ఆరోపించింది. కాపునాడు రాష్ట్ర సంఘం నేతలు కఠారి అప్పారావు, అద్దేపల్లి శ్రీధర్ తదితరులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాపు కులానికి చెందిన ఉద్యోగులను బదిలీ చేయడమో, రిజర్వ్ పోస్టుల్లో ఉంచడమో చేస్తున్నారని విమర్శించారు.
విజయనగరం జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో సీనియర్ అధికారిగా ఉన్న చైతన్య మురళీని ముద్రగడ దీక్ష విరమించిన రోజే బదిలీ చేశారని, అయితే పోస్టింగ్ ఇవ్వకుండా రిజర్వ్‌లో ఉంచారని విమర్శించారు. ఇదేవిధంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పలువురు కాపు, బలిజ, ఒంటరి కులాలకు చెందిన ఉద్యోగుల్ని అకారణంగా బదిలీ చేశారన్నారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే కాపు జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. దీనిపై చర్చించేందుకు ఆదివారం కాపునాడు కార్యవర్గం భేటీ అవుతుందని తెలిపారు.
కాపు ఉద్యోగుల్ని వేధిస్తే సహించం
Published Fri, Jun 24 2016 2:39 AM | Last Updated on Mon, Jul 30 2018 6:21 PM
Advertisement