పరిచయానందం.. | Kapu, Telaga wedding intro stage | Sakshi
Sakshi News home page

పరిచయానందం..

Published Sun, Jun 22 2014 12:48 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

పరిచయానందం.. - Sakshi

పరిచయానందం..

  •      ‘సాక్షి’ ఆధ్వర్యంలో కాపు, తెలగ వివాహ పరిచయ వేదికకు విశేష స్పందన
  •      ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చిన యువతీయువకులు
  • నాగోలు:  మూడుముళ్లు..ఏడడుగులు... అన్నట్లు ‘సాక్షి’ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కాపు, తెలగ వివాహ పరిచయ వేదికకు అపూర్వస్పందన లభించింది. తగిన జోడిని వెతుక్కోవడం కష్టతరమైన ఈ రోజుల్లో పెళ్లికోసం పరిచయవేదికలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలో కొత్తపేటలోని బాబుజగ్జీవన్‌రామ్ భవన్‌లో ‘సాక్షి’ నిర్వహించిన కాపు, తెలగ వివాహ పరిచయవేదిక కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు జంటనగరాల నుంచి భారీసంఖ్యలో యువతీయువకు లు వారి తల్లిదండ్రులతో సహా హాజరయ్యారు.

    ఈసందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ‘సాక్షి’అడ్వర్‌టైజ్‌మెంట్ ఏజీఎం సంతోష్‌కుమార్ మాట్లాడుతూ.. తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రతినెలా వివాహ పరిచవేదికలు నిర్వహిస్తున్నామని, మా వేదికల ద్వారా అనేక జంటలు ఒక్కటయ్యాయన్నారు. కాగా వధూవరులు, వారి తల్లిదండ్రులు తమ వివరాలను వేదికపై పంచుకున్నారు. మధ్యవర్తుల ప్రమేయం, ఎలాంటి ఖర్చులేకుండా పరిచయ వేదికలు నిర్వహిం చడం అభినందనీయమంటూ.. జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. కార్యక్రమంలో ఈవెంట్ మేనేజర్ భరత్‌కిషోర్, ప్రముఖ యాంకర్ క్రాంతి పాల్గొన్నారు.
     
     అభినందనీయం..
     ‘సాక్షి’ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కాపు వధూవరుల పరిచయ వేదిక ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మంచి సంబంధం నేరుగా ఎంచుకునే వీలు కల్పించినందుకు ‘సాక్షి’ యాజమాన్యానికి కృతజ్ఞతలు.                                            
     -వెంకటేశ్వర్లు, వధువు తండ్రి
     
     దళారుల బె డద తప్పుతుంది..
     ఉద్యోగస్తులమైన మాలాంటి వారికి సంబంధాలు వెతకడం చాలా కష్టం. పరిచయ వేదికలతో దళారుల బెడద తప్పుతుంది. ముఖ్యంగా పరిచయ వేదికలు అమ్మాయిల తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడుతుంది.  
     - మీనాకుమారి, ప్రభుత్వ ఉద్యోగి
     
     ఒకేచోట కలుసుకోవడం అద్భుతం..
     పరిచయవేదిక ఏర్పాటుతో రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల వారిని ఒకేచోట కలుసుకునే అవకాశం కలిగింది. మా కుటుంబంలో అందరం ఉద్యోగులు కావడంతో ఎప్పుడూ బిజీగా ఉంటాం. ఈ వేదిక వల్ల సరైన జోడిని వెతుక్కునే అవకాశం ఉంది.      
     -సత్యనారాయణ, వధువు తండ్రి
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement