పుట్టపర్తి అర్బన్: మండలంలోని జగరాజుపల్లి గ్రామం వద్ద ఉన్న కస్తూర్బా పాఠశాల విద్యార్థులు గురువారం రాత్రి భోజనం తర్వాత అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. రాత్రి తొమ్మిది గంటలకు భోజనం వండిన తర్వాత చిన్న పిల్లలకు ముందుగా వడ్డిస్తుంటారు. ముందుగా భోజనం తిన్న సుమారు 20 మందికి కడుపు నొప్పి, వాంతులు అయ్యాయి. వెంటనే 108 వాహనంలో పిల్లలందరినీ పుట్టపర్తి సత్యసాయి జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించినట్లు ప్రిన్సిపాల్ సౌజన్యకుమారి పేర్కొన్నారు. పది మంది విద్యార్థులు శ్వాస తీసుకోవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. మిగతా అందరూ ఆరోగ్యంగా ఉన్నారన్నారు.