
ముఖ్యమంత్రివన్నీ అసత్యాలే: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పినవన్నీ అసత్యాలు, అభూత కల్పనలేనని టీఆర్‌ఎస్ అధ్యక్షులు కె.చంద్రశేఖర్‌రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవాలకు సంబంధించిన అన్ని వివరాలను శుక్రవారం విలేకరుల సమావేశంలో ప్రజల ముందుంచుతానని పేర్కొన్నారు.