శ్రీవారిని దర్శించుకున్న కేరళ గవర్నర్
తిరుమల: కేరళ గవర్నర్ పి.సదాశివం శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో ఆయన వెంకటేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.