సమావేశం ఏర్పాటు చేసి కొన్ని సమస్యలు పరిష్కరించినట్టు చెప్పారు. వంశధార ప్రాజెక్టు స్టేజ్-2, ఫేజ్- 2 హిరమండలం, కొత్తూరు, ఎల్‌ఎన్‌పేట, మండలాల్లో 20 గ్రామాలను నిర్వాసిత గ్రామాలుగా, 14 గ్రామాలను ప్రభావిత గ్రామాలుగా ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిందని వివరించారు. నిర్వాసిత గ్రామాల్లో నివసిస్తున్న 7,104 కుటుంబాకు సంబంధించి సామాజిక, ఆర్థిక సర్వేల ద్వారా వివరాలు సేకరించామన్నారు. ఈ కుటుంబాలకు రూ. 47.33 కోట్లు ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. పునరావాస పునఃపరిశీలన స్కీం 2005 ప్రకారం ఆ మండలాల్లో ఇళ్ల సర్వేలు చేపట్టామన్నారు.
వారిలో 700 కుటుంబాలకు గాజుల కొల్లివలస, 150 కుటుంబాలకు వెన్నెలవలసలో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. మూడు మండలాల్లోని 19 గ్రామాల్లో వివిధ పునరావాసాల కింద 24.69 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. ఇంకా 1779 ఇళ్ల నిర్మాణాలకు సహాయం అందజేయాల్సి ఉందని, నిర్వాసితులు బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్లు అందజేయాల్సి ఉందన్నారు. వీరికి సంబంధించిన వివరాలు సేకరించాలని తహశీల్దార్లను ఆదేశించినట్టు చెప్పారు.
ఖరీఫ్‌కు వంశ‘ధార’
Published Sat, Jun 6 2015 12:35 AM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM
Advertisement
Advertisement