
ఖరీఫ్ కలిసొచ్చేనా...!
నాలుగేళ్లుగా వాతావరణంలోని అనిశ్చితి రైతాంగానికి నష్టాలను రుచిచూపించగా, తాజాగా ప్రారంభమయ్యే ఖరీఫ్ వారిని అగ్ని పరీక్షకు గురి చేస్తోంది.
నాలుగేళ్లుగా వాతావరణంలోని అనిశ్చితి రైతాంగానికి నష్టాలను రుచిచూపించగా, తాజాగా ప్రారంభమయ్యే ఖరీఫ్ వారిని అగ్ని పరీక్షకు గురి చేస్తోంది. జిల్లావ్యాప్తంగా రెండున్నర లక్షల భూస్వామ్య, సన్నకారు, కౌలు రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. మొదట్లో నైరుతి రుతుపవ నాలు తక్కువ వర్షపాతం ఇస్తాయని వాతావరణ శాఖ సూచించగా ఇటీవల అడపాదడపా కురుస్తున్న వర్షాలు ఖరీప్ నాట్లపై జిల్లా రైతు దృష్టి సారించేలా చేసింది. కొన్నిచోట్ల దుక్కులు చేయడం, మరికొన్ని చోట్ల సాగుకు సన్నద్ధం కావడం కనిపిస్తోంది. -న్యూస్‌లైన్,అనకాపల్లి
అనకాపల్లి, న్యూస్‌లైన్ : అతివృష్టి, అనావృష్టి కారణంగా జిల్లాలో మెజారిటీ శాతం సాగు చేసే వరి, చెరకు పంటల పరిస్థితి ఇప్పటికే దయనీయంగా మారింది. దీనికితోడు నానాటికీ పెరిగిపోతున్న ఎరువులు, విత్తనాల ధరలు, మరోవైపు కూలీల సమస్య మరింత జఠిలంగా మారింది. ఇక రానున్న ఖరీఫ్ సీజన్‌లో సైతం రైతులకు మేలు జరగకుంటే రైతన్న పూర్తిగా సేద్యానికి దూరమయ్యే ప్రమాదం ఉందని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో కూడా 2.16 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయ విభాగం ప్రాథమిక అంచనా వేస్తోంది.
పెట్టుబడి కొండంత.. దిగుబడి ఇసుమంత...
ప్రకృతి కన్నెర్ర చేయడం, రైతులకు మద్దతు ధర దక్కక పోవడం ఒక సమస్య అయితే నానాటికీ పెరిగిపోతున్న పెట్టుబడి రైతులను కుదేలు చేస్తోంది. మార్కెటింగ్ వ్యవస్థలో దళారీల దోపిడీ, అస్తవ్యస్త ప్రభుత్వ మార్కెటింగ్ విధానాలు ఒకవైపు రైతన్నకు నష్టాన్ని కలిగి స్తుండగా, అసలు దిగుబడే నానాటికీ తీసికట్టు గా మారడంతో సగటు రైతు చతికిలపడుతున్నాడు. గడిచిన నాలుగేళ్లలో కూలీలకు చెల్లిం చే కూలీ వేతనం 2 నుంచి 3 రెట్లు పెరిగింది.
యూరియా ధర బ్యాగ్‌కు నాలుగేళ్లలో 220, పొటాష్ 550, డీఏపీ 650 పెరిగింది. ఇక విత్తనాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వరి వి త్తనం ధరలు భారీగా పెరుగుతుండగా, చెరకు నాట్ల కోసం అవసరమయ్యే గడలు దొరకడం రైతులకు భారంగా మారింది. ఇక రైతులకు ప్రభుత్వం నుంచి మంజూరు కావాల్సిన రు ణాలు, రీషెడ్యూల్ విషయమై అర్థం కాని ప్ర చారం జరుగుతోంది. ప్రభుత్వ విధి విధానా లు ఎలా ఉన్నా బ్యాంకర్లు కనికరిస్తేనే రైతులు ఈ ఖరీఫ్‌లో గట్టెక్కగలరు.
రైతు కష్టం.... ఏటేటా ప్రకృతికి నైవేద్యం
2010లో జిల్లాలో 26654 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది.చెరకు 1883.6 హెక్టార్లు, రాజ్‌మా 531హెక్టార్లు, నైజర్ 252 హెక్టార్లు, పత్తి 27 హెక్టార్లు, కంది 30 హెక్టార్లలో దెబ్బతింది. దీనికి నష్టపరిహారం అందించడంలో వ్యవసాయశాఖ పూర్తిగా సఫలం కాలేకపోయింది. వెరసి రైతులకు కోట్లలో నష్టం రాగా, రైతుల పరపతి వడ్డీ వ్యాపారుల వద్ద బాగా పడిపోయింది.
2011లో ఏర్పడ్డ అనావృష్టి ఛాయలు రైతులను ఆత్మహత్యా సదృశ్యంలో పడేశాయి. దొ రకని సాగునీరు, కనికరించని ప్రభుత్వ పాల సీలతో రైతులకు నిర్వేదంలోకి వెళ్లిపోయారు.
2012లో జిల్లాలో 32901.6 హెక్టార్లలో 14 పంటలు నష్టపోయాయి. అందులో వరి 24515. 6 హెక్టార్లలో నష్టపోయింది. అనధికారికంగా గుర్తింపు కాని పంటల విస్తీర్ణం ఇంకా ఉంది. రైతులకు అందాల్సిన నీలం తుపాను నష్టపరిహారంపై నిన్నమొన్నటి వరకు ఆందోళనలు చేసినా బ్యాంకుల ఖాతాల సమస్య అంటూ ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేసింది. ఇంతలో విభజన ఉద్యమం, ఎన్నికల హడావుడితో అసలు విషయం పక్కకు పోగా, రెండేళ్ల క్రితం వచ్చిన నష్టాన్ని భర్తీచేయలేని యంత్రాంగం దాపురించినందుకు రైతులు డీలా పడ్డారు. 2013లో రెండు భారీ తుపానులు, భారీ వర్షాలు జిల్లా రైతుల కొంపముంచాయి. సుమారు 53 వేల హెక్టార్లకు పైబడి ఖరీఫ్ పంటలు నీటమునిగినా వాటి లెక్కలు తేల్చే నాధుడే లేకుండా పోయాడు.